వైఎస్సార్ సీపీలోకి పార్థసారథి, వేదవ్యాస్

వైఎస్సార్ సీపీలోకి పార్థసారథి, వేదవ్యాస్ - Sakshi


భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు

కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికిన జగన్

సమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్న నేతలు


 

హైదరాబాద్: సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన రోజు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వలసల వరద కొనసాగింది. కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి కె.పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్థసారథి ఇటీవలి వరకూ రాష్ట్ర ప్రభుత్వంలో పాఠశాల విద్యా శాఖమంత్రిగా కొనసాగారు. అలాగే 2009 నుంచీ పీఆర్పీలో ఉన్న వేదవ్యాస్ ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత అందులో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామాలిచ్చిన ఈ ఇద్దరు నేతలు శనివారం పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వచ్చి పార్టీలో చేరారు.



పార్థసారథి ఇంతకుమునుపే జగన్‌ను కలిసి తన అభీష్టాన్ని వెల్లడించారు. అందుకు అనుగుణంగా శనివారం వేదవ్యాస్‌తో కలిసి వ చ్చారు. వీరిద్దరికీ జగన్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ నివాసం పరిసరాలన్నీ కృష్ణాజిల్లా కార్యకర్తలతో కిటకిటలాడాయి. ‘జై జగన్...’ నినాదాలతో మారుమోగాయి. తనను కలుసుకోవడానికి ఉబలాటపడిన యువకులను నిరాశ పర్చకుండా జగన్ బయటకు వచ్చి వందలాది మందితో కరచాలనం చేసి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కృష్ణాజిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గోవాడ అనిల్‌కుమార్, ఉయ్యూరు, కంకిపాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు గోన మదన్, సాదిక్, ఉయ్యూరు చెరకు అభివృద్ధి మండలి చైర్మన్ నెర్సు సతీశ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో ఉన్నారు.

 

ప్రజలు జగన్ నాయకత్వాన్ని  కోరుకుంటున్నారు: పార్థసారథి



 రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని, ఆయన సారథ్యంలోనే పేదల కష్టాలు తీరతాయని విశ్వసిస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి పార్థసారథి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్ర ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి జరగాల్సి ఉందని, అది ఒక్క జగన్ నేతృత్వంలోనే సాధ్యమని అన్నారు. అందుకే తాను, తన అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. 2014 ఎన్నికల తరువాత రాష్ట్రంలో జగన్ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు.



 జగన్ ముఖ్యమంత్రి కావాలి: వేదవ్యాస్



 ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని, తాను కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నానని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. సీమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ ప్రజలకు అవసరమన్నారు. వైఎస్ పథకాల అమలు చేయగలిగిన వ్యక్తి జగనేనన్నార

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top