ఇక ‘ఇ’లా ప్రచారం!

ఇక ‘ఇ’లా ప్రచారం!


 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాజకీయ పార్టీలకు దీటుగా ఈసీ, అభ్యర్థులకు పోటీ గా అధికారులు ఎన్నికల ప్రచారానికి సై అంటున్నారు. అం దులో భాగంగా ఈసీ ఒక అడుగు ముందుకు వేసి ఈ- క్యాంపెయినింగ్‌కు శ్రీకారం చుడుతోంది. పోలింగ్ శాతం పెంచేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ఈ తరహా ప్రచారానికి స్వీప్(సిస్టమెటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేట్) ఆధ్వర్యంలో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నవారే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న జిల్లా వాసులకు కూడా ఓటింగ్‌పై అవగాహన కల్పించనున్నారు.

 

 ‘హాయ్! ఫ్రెండ్స్!! డోంట్ ఫర్‌గెట్ ఓటింగ్’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు చేసే ప్రక్రియను బుధవారం నుంచే ప్రారంభించనున్నట్లు స్వీప్ నోడల్‌అధికారి ఎస్‌వీ లక్ష్మణమూర్తి చెప్పారు. అలాగే ట్విట్టర్‌లోనూ ‘మీ ఓటును వేయడం మర్చిపోకండి’ అంటూ మెయిల్ చేయనున్నామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే తెలిసిన వారి అకౌంట్‌ల ను సేకరిస్తున్నారు. అకౌంట్లు తెలిసిన వారికి మెయిల్స్ కూడా పె డతామన్నారు. ప్రత్యేకించి యువతను టార్గెట్ చేసుకుని ప్రచారం మొదలు పెడుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా కళాశాలల అడ్రస్‌లను ట్యూనింగ్ ద్వారా సేకరించి వారి అకౌంట్ల ద్వారా ఫే స్‌బుక్‌కు ప్రచార సమాచారాన్ని పోస్ట్ చేస్తారు. ఇప్పటికే కొన్ని కళాశాలలకు ఈ సమాచారాన్ని అందించి విద్యార్థుల మొబైల్ నం బర్లకు ఎస్‌ఎంఎస్‌లను పంపిస్తున్నట్టు స్వీప్ అధికారి చెప్పారు. బల్క్ ఎస్‌ఎంఎస్‌లను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలకు కూడా ఓటింగ్‌పై ప్రచారం ముమ్మరం చేయాలని చెబుతున్నామన్నారు.  

 

 ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ...

 కలెక్టరేట్‌తో పాటు పలు జిల్లా కార్యాలయాలు, ప్రాధాన్యత కలిగిన ప్ర భుత్వ కార్యాలయాల్లో కూడా ఓటింగ్‌పై ప్రచారం చేస్తున్నట్లు స్వీప్ నోడల్ అధికారి ఎస్‌వీ లక్ష్మణమూర్తి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా పంపించినపుడు దిగువన ఓటు వేయాలన్న సూచనను పొందుపరుస్తున్నామన్నారు. దీని ప్రకారం ‘టు ఆల్ డిపార్ట్ మెంట్స్’ అంటూ ‘ప్లీజ్! ఓట్ వితౌట్ ఫెయిల్ ఆన్ మే 7’ అంటూ పోలింగ్ సమయాన్ని కూడా సూచిస్తున్నట్లు తెలిపారు. ఓటింగ్ గూర్చి మరిన్ని సలహాలు ఇచ్చేందుకు ఎస్‌డిసి2సీపీపీఎట్‌జీమెయిల్‌డాట్‌కామ్‌కు మెయిల్ చేయవచ్చన్నారు. ప్రతి కార్యాలయానికి ఈ ఆదేశాలు వెళ్లేలా కలెక్టర్ సర్క్యులర్‌లు పంపించినట్లు తెలిపారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top