ప్రజాపంపిణీలో అక్రమాలపై కొరడా


రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు

మండల స్టాక్ పాయింట్లు, రేషన్ దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు

టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గోదాముల్లో  రూ. 20.80 కోట్ల అక్రమ నిల్వలు గుర్తింపు

మొత్తంగా పదిహేను రోజుల్లో రూ. 145 కోట్ల విలువైన సరుకులు స్వాధీనం.. 55 కేసులు నమోదు

మరిన్ని దాడులు చేస్తామని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్  డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడి


 

 రేషన్ దుకాణాల్లో పేదలకు అందజేయాల్సిన సరుకులను నల్లబజారుకు తరలిస్తున్న అక్రమార్కులపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కొరడా ఝుళిపించింది. గత కొద్ది రోజులుగా 20 జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ కేంద్రాలతో పాటు రేషన్‌షాపులు, గోదాములపై దాడులు జరిపింది. మొత్తంగా దాదాపు రూ. 145 కోట్ల విలువైన సరుకులను స్వాధీనం చేసుకుని... 55 కేసులు నమోదు చేసింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చెందిన గోదాముల్లో అక్రమంగా నిల్వ చేసిన దాదాపు రూ. 20 కోట్ల విలువైన ధాన్యం కూడా ఉండడం గమనార్హం. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ బుధవారం ఈ దాడులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కొంతకాలంగా రాష్ట్రంలోని  వివిధ రేషన్ షాపులలో నిత్యావసర సరుకులు సక్రమంగా అందడం లేదని.. వాటిని కాంట్రాక్టర్లు, రేషన్ డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని  విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకుని మూడో తేదీ నుంచి విజిలెన్స్ అధికారులు దాడులు ప్రారంభించారు. చిత్తూరు, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, నల్లగొండ, హైదరాబాద్, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ కడప, గుంటూరు, కరీంనగర్, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం,  తూర్పు గోదావరి, కృష్ణా, మెదక్ జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ కేంద్రాలు, రేషన్ దుకాణాలతో పాటు వివిధ గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు.



బుధవారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణ శివారులోని జమ్మలమడుగు, గుంజలపాడు రహదారుల్లోని పది గోదాముల్లో సుమారు రూ. 50 కోట్ల విలువ చేసే 1.78 లక్షల బస్తాల శనగపప్పును సీజ్ చేశారు. మొత్తంగా మూడో తేదీ నుంచి బుధవారం వరకు 138 గోదాములు, రేషన్ దుకాణాలపై దాడులను నిర్వహించగా... కాంట్రాక్టర్ల అక్రమాలు భారీ ఎత్తున వెలుగు చూశాయి. ముఖ్యంగా స్టాక్ కేంద్రాల నుంచి రేషన్ షాపులకు సరుకులు రవాణా చేసే దశలోనే వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు వెల్లడైంది. అధికారులు ఈ దాడుల్లో 8,655.1 క్వింటాళ్ల ఎర్రపప్పు, 4,37,854 క్వింటాళ్ల శనగపప్పు, 1,60,680 క్వింటాళ్ల పెసరపప్పు, వేరుశనగ తదితర ధాన్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 145 కోట్లకు పైగా ఉంటుందని ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా అక్రమార్కులపై నిత్యావసర వస్తువుల చట్టంలోని 6(ఎ) కింద 55 కేసులు నమోదు చేశామని, ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని ఆయన చెప్పారు.

 పేద రైతుల కడుపుకొడుతున్నారు..



 ఎమ్మెల్యే పయ్యూవుల కేశవ్ సోదరులు అక్రవుంగా దాచి పెట్టిన ధాన్యం నిల్వలపై ఉన్నతాధికారులు సవుగ్ర విచారణ చేపట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తేజోనాథ్, కిసాన్ సెల్ కో-ఆర్డినేటర్ అశోక్ డివూండ్ చేశారు. గోదాములపై దాడుల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సోదరులు ఎంతో వుంది రైతులను బెదిరించి వారి పాసు పుస్తకాలు లాక్కొని ధాన్యం నిల్వలపై బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారని.. పేద రైతుల కడుపు కొడుతున్నారని వారు మండిపడ్డారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top