తూచ్...


సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అరచేతిలో వైకుంఠం చూపే చంద్రబాబు నాయుడు.. సొంత పార్టీ నాయకులకూ చుక్కలు చూపుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో చూపిన ద్వంద్వ నీతినే.. టికెట్ల విషయంలోనూ అనుసరిస్తున్నారు. నమ్ముకున్న వారికి అండగా నిలుస్తామనే హామీని తుంగలో తొక్కేశారు. కష్టకాలంలో జెండాలు మో సిన వారిని కాదని.. ప్యాకేజీలతో కాం గ్రెస్ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన విభజనవాదులకు పెద్దపీట వేశారు.

 

 కాంగ్రెస్‌లో ఉండగా టీడీపీపై దుమ్మెత్తి పోసిన.. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులపై భౌతిక దాడులకు దిగిన నాయకులనే అధినేత దగ్గరకు తీసుకోవడాన్ని తమ్ము ళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేఈ కుటుం బంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్‌కు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడం ఇప్పుడు ఆ పార్టీ వర్గీయుల్లో చర్చనీ యాంశమైంది. కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన కేఈ ప్రభాకర్‌కు కనీసం అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వకపోవడం ఆయనను అవమానించినట్టేనని శ్రేణులు భావిస్తున్నాయి. ఈ విషయంలో మనస్థాపం చెందడం వల్లే ఆయన సోదరుడు కేఈ ప్రతాప్ డోన్‌లో ఇప్పటి వరకు నామినేషన్ వేయలేదని తెలుస్తోంది. ప్రభాకర్‌కు టికెట్ దక్కకపోవడానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హస్తం ఉన్నట్లు సమాచారం.

 

 ఇటీవల పార్టీ తీర్థం పుచ్చుకున్న ఓ నాయకుని సలహాతో పార్టీ అధినేతకు తప్పుడు నివేదికలు పంపి ఆయనను టికెట్‌కు దూరం చేసినట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నిడ్జూరు రాంభూపాల్‌రెడ్డి సోదరుడు రవీంధ్రనాథ్‌రెడ్డికి కూడా చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకోమని అర్ధరాత్రి పూట హామీ ఇచ్చి మాట తప్పారని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబును నమ్మినందుకు రాజకీయ భవిష్యత్తు నాశనం చేశారని నిడ్జూరు సోదరులు మనోవేదనకు లోనవుతున్నట్లు సమాచారం.

 

 తమ్ముళ్లకు అన్యాయం: కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామి, గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితర నాయకుల కోసం ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిని తమ్ముళ్లను పూచికపుల్ల సమానంగా తీసిపడేశారు. ఆ జాబితాలో పాణ్యం టికెట్ ఆశించిన కేజే రెడ్డి, నందికొట్కూరు స్థానాన్ని నమ్ముకుని పనిచేసిన విక్టర్, నంద్యాల అసెంబ్లీ కోసం ఇన్నాళ్ల నుంచి కష్టపడిన ఎన్‌హెచ్ భాస్కర్‌రెడ్డి, కోడుమూరుకు చెందిన ఆకెపోగు ప్రభాకర్, పత్తికొండ స్థానాన్ని ఆశించిన చల్లాకుమార్, మంత్రాలయం అసెంబ్లీ కోసం ఎదురుచూసిన మాధవరం రామిరెడ్డి, ఆళ్లగడ్డలో ఇరిగెల రాంపుల్లారెడ్డి, కర్నూలులో రాంభూపాల్ చౌదరి చేరిపోయారు. 2009లో నందికొట్కూరు అసెంబ్లీకి పోటీ చేసిన బిచ్చన్న పూర్తిగా విస్మరించడంతో ఆయన జైసమైక్యాంధ్ర పార్టీ తరఫున నందికొట్కూరు నుంచి బరిలో నిలిచారు. టికెట్లు ఆశించి భంగపడిన వీరంతా ప్రస్తుతం టీడీపీ వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top