టీడీపీదంతా అడ్డదారే!

టీడీపీదంతా అడ్డదారే! - Sakshi

 ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: ఆయన ప్రముఖ సినీ నటుడు.. టీడీపీకి స్టార్ క్యాంపెయినర్.. అటువంటి బాలకృష్ణ ప్రచారానికే జనాలు లేక.. తరలింపు యత్నాలు ఫలించక ఆ పార్టీ నేతలు నానా అగచాట్లు పడ్డారు. చివరికి తమకు అలవాటైన అడ్డదారి ఎంచుకున్నారు. ఎన్నికల నిబంధనలకు నీళ్లొదిలారు. నడి రోడ్డుపైనే మీటింగ్ పెట్టారు. రోడ్డుకు అడ్డంగా కార్లు పెట్టి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఇన్ని చేసినా వారి లక్ష్యం నెరవేరలేదు. జనం గుమిగూడలేదు సరికదా.. రాకపోకలు నిలిపివేసి ప్రయాణికులను అవస్థల పాల్జేశారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. టీడీపీ ప్రచారానికి జిల్లాలో పర్యటిస్తున్న బాలకృష్ణ మంగళవారం చిలకపాలెం సభలో ప్రసంగిం చాల్సి ఉంది. ఉదయం 9 గం టలకు సభ అని ప్రకటించారు. జనం లేకపోవడంతో  జాప్యం చేస్తూ వచ్చారు. ఈలోగా ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల నుంచి జనాలను తరలించేందుకు పార్టీ అభ్యర్థి కళా వెంకటరావు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి చిలకపాలెంలో నిర్వహించాల్సిన సభను ఉన్న పళంగా రద్దీగా ఉండే ఆర్‌అండ్‌బి రోడ్డు కూడలికి మార్చారు. 11.30కు సభ జరిపారు. నడిరోడ్డుపైనే ప్రచార వాహనం నిలిపివేసి బాల కృష్ణ ప్రసంగించారు. 

 

 అందుకోసం రోడ్డుకు రెండువైపులా కార్లు అడ్డంపెట్టి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా శ్రీకాకుళం నుంచి రాజాం, బొబ్బిలి ప్రాం తాలకు వెళ్లాల్సిన బస్సు లు జాతీయ రహదారిపై నిలిచి పోయాయి. శ్రీకాకుళం వైపు రావాల్సిన బస్సులు చిలకపాలెం ఆర్ అండ్ బీ బంగ్లా సమీపంలో నిలిచి పోయా యి. వీటితోపాటు లారీలు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవటంతో ప్రయాణికులు, వాహనదారులు మండుటెండలో నానా పాట్లు పడ్డారు. బాలకృష్ణ సుమారు అరగంట సేపు మాట్లాడారు. ఆయన వెళ్లిన తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి పోలీసులు 20 నిమిషాలపాటు అష్టకష్టాలు పడ్డారు. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాల పక్కన కావల్సినంత ఖాళీ స్థలం ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇక్కడ సభలు పెట్టటం ఆనవాయితీ. అయి తే జనం రారన్న భయంతోనేమో టీడీపీ నేతలు రోడ్డు మీదే సమావేశం నిర్వహించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.

 

 మద్యం ఎర

 కాగా బాలకృష్ణ సమావేశం ముగిశాక తెలుగు తమ్ముళ్లు చిలకపాలెంలో ఉన్న రెం డు  మద్యం దుకాణాలు చుట్టూ చేరారు. గుంపులుగా గుమిగూడి షాపుల బయటే నేతలు పోసిన మద్యం సేవిస్తూ కనిపిం చారు. ఈ దృశ్యాలను షూట్ చేయడానికి ప్రయత్నించిన  ఓ న్యూస్ చానల్‌కెమెరామన్‌ను మత్తులో ఉన్న తెలుగు తమ్ముళ్లు చుట్టుముట్టారు.  ఏం.. మందు తాగితే తప్పా? అని ప్రశ్నిస్తూ మీదికి వచ్చారు. స్థానికులు జోక్యం చేసుకోవడంతో వెనక్కి తగ్గారు.

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top