ఆచరణ దేవుడెరుగు!


బొగ్గుబారుు కార్మికులు.. పగలనక రేయనక బొగ్గును వెలికితీసే నల్లసూరీళ్లు...  ఏళ్లు గడుస్తున్నారుు... ప్రభుత్వాలు మారుతున్నారుు... అరుునా కార్మికుల బతుకులు మారడంలేదు... సమస్యలు తీరడంలేదు... జిల్లాలో పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో గని కార్మికుల సంఖ్య ఎక్కువ. ప్రతి ఎన్నికల్లో ఆయూ పార్టీల నాయకులు సింగరేణి కార్మికుల సమస్యలను ఎన్నికల అస్త్రాలుగా చేసుకుంటున్నారు. ఓట్లు రాబట్టుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. తీరా గెలిచాక కార్మికుల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడంలేదు. ఈసారి సైతం అవే హామీలు ఇస్తూ ఓట్ల ‘టబ్బు’ నింపుకునేందుకు యత్నిస్తున్నారు.

 

 గోదావరిఖని, న్యూస్‌లైన్ : దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను రద్దు చేసింది. కానీ.. భూగర్భంలోకి వెళ్లి ప్రాణాలను ఫణంగా పెట్టి బొగ్గు వెలికితీస్తున్న గని కార్మికుల విషయంలో మాత్రం సర్కారు శీతకన్ను వేసింది. ఫలితంగా సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో కోల్ ఇండియా పరిధితోపాటు సింగరేణి సంస్థలో సుమారు ఐదు లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ఆదాయపు పన్ను రద్దు చేయాలంటే లోక్‌సభలో  బిల్లు ఆమోదం పొందాలి. బొగ్గు సంస్థలు విస్తరించి ఉన్న ప్రాంతాల లోక్‌సభ సభ్యులు ఏకతాటిపైకి వచ్చి పార్లమెంట్, ప్రధాని దృష్టికి తీసుకువస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. జిల్లాలోని గోదావరిఖని సహా రాష్ట్రంలో మరో మూడు జిల్లాల పరిధిలోని ఐదు లోక్‌సభ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు ప్రతి ఎన్నికల్లో కార్మికులకు ఆదాయపన్ను రద్దు చేరుుస్తామంటున్నారు. తీరా చేతులెత్తేస్తున్నారు.

 

 తరుముతున్న ఓపెన్‌కాస్ట్‌లు...

 సింగరేణి వ్యాప్తంగా 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులుండగా 400 గ్రామాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధ్వంసమయ్యాయి. వీరికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పరిహారం, ఇంటి స్థలాలు ఇచ్చినప్పటికీ ఏళ్లకేళ్లుగా చేసుకుంటున్న వ్యవసాయం మటుమాయమై ఉపాధి కోల్పోయూరు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 54 మిలియన్ టన్నులుంటే అందులో 35 భూగర్భ గనుల ద్వారా 15 మిలియన్ టన్నులు వెలికితీస్తున్నారు. మిగతా లక్ష్యాన్ని 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో ఓసీపీలపైనే యూజమాన్యం దృష్టి సారిస్తోంది. ప్రజల జీవన విధ్వంసానికి కారణమవుతున్న ఓసీపీలను వ్యతిరేకించే ప్రజాప్రతినిధి లేకపోవడంతో యాజమాన్యం మరిన్ని ఓసీపీల కోసం ప్రణాళికలు రూపొందిస్తోందనే విమర్శలున్నారుు. అరుుతే ఇప్పుడు నాయకులు మాత్రం తమను గెలిపిస్తే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని, వాటి  ఏర్పాటును అడ్డుకుంటామని హామీ ఇస్తున్నారు.

 

 వారసత్వ ఉద్యోగాలు హుళక్కే..

 గతంలో కార్మికుడి స్థానంలో ఆయన వారసుడికి ఉద్యోగావకాశం కల్పించే వీలుండేది. సంస్కరణల మూలంగా 1998 జూన్‌లో వారసత్వ ఉద్యోగాల కల్పనను నిలిపివే శారు. ఆనాటి నుంచి నేటివరకు కార్మికుల స్థానంలో వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కార్మికుడు మరణిస్తే లేదా తీవ్ర అనారోగ్యానికి గురై మెడికల్ అన్‌ఫిట్ అయితే తప్ప ఉద్యోగాలు రావడంలేదు. దీంతో చాలామంది వారసులు ఆటో డ్రైవర్లుగానో లేక దుకాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారసత్వ ఉద్యోగాలను కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కూడా అవే హామీనిస్తూ ఓట్లడిగేప్రయత్నం చేస్తున్నారు.

 

 పెన్షన్.. టెన్షన్...

 ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చెల్లించే పెన్షన్‌లో పెరుగుదలేదు. ఫలితంగా రిటైర్డ్ కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడంలేదు. వీరికి చివరి వేతనం బేసిక్‌పై 25 శాతం పెన్షన్‌గా చెల్లిస్తున్నారు. ప్రస్తుత ధరలకనుగుణంగా పెన్షన్ 40 శాతం చేయూలనే డిమాండ్ ఉంది. అరుుతే యూజమాన్యం, ప్రజాప్రతినిధులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నారుు.

 

 ‘డిస్మిస్’ గోస అంతే...

 భూగర్భంలో పరిస్థితులను తట్టుకోలేక ఇబ్బం దులకు గురై ఉద్యోగానికి వెళ్లని కార్మికులను యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. గతంలో ఈ విధానం లేకపోయినా... 2000 నుంచి నిబంధనలు కఠినతరం చేసింది. ఏడాదిలో వంద మస్టర్లు (హాజరు) ఉంటేనే ఉద్యోగం ఉంటుందని నిబంధన విధించడంతో ఇప్పటి వరకు 13 వేల మంది డిస్మిసయ్యూరు. తమకు ఉద్యోగావకాశం కల్పించాలని వారు కనిపించే ప్రతి నాయకుడిని కోరుతున్నారు. అరుునా కనికరం చూపడంలేదు. 2000, 2012 సంవత్సరాల్లో యాజమాన్యం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి 500 మందికి పైగా డిస్మిస్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. షరతులు లేకుండా ఉద్యోగంలోకి తీసుకోవాలని డిస్మిస్డ్ కార్మికులు చేస్తున్న డిమాండ్‌ను పట్టించుకునే నాథులే కరువయ్యూరు.

 

 డిపెండెంట్ ఉద్యోగాలివ్వాలి..

 వారసత్వ ఉద్యోగాలు లేకపోడంతో నాలాంటి చాలామంది నిరుద్యోగులుగా మారారు. మా నాన్న మల్లేశ్ 2007లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. వీఆర్‌ఎస్ పెట్టకముందు నాకు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డ. ఇప్పుడు ఆ ఆశపోయింది. కొత్తగా ఏర్పడే తెలంగాణ ప్రభుత్వంలోనైనా మాలాంటోళ్ల బతుకులు మారాలి. ఉద్యోగాలు కల్పించాలి.

 - అడ్డూరి రాజశేఖర్, నిరుద్యోగి,

 గోదావరిఖని

 

 సమానంగా చూడాలి..

 గని కార్మికులను విమాన, నౌకాయాన ఉద్యోగులతో సమానంగా చూడాలి. ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలో ప్రాణాలను ఫణంగా పెట్టి దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులను సాహస వీరుగులుగా గుర్తించాలి. వారికి కల్పిస్తున్న తరహాలోనే గని కార్మికులకు కూడా గుర్తింపు, సౌకర్యాలు కల్పించాలి. ఆదాయపన్ను రద్దు చేయాలి.

 - ఈర్ల రాజేశ్, సింగరేణి ఉద్యోగి,

 గోదావరిఖని

 

 భూగర్భ గనులు ప్రారంభించాలి

 సింగరేణిలో ఉద్యోగావకాశాలు పెరగడానికి భూగర్భగనులు ప్రారంభించాలి. బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో ఓసీపీలను తవ్వడం వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. నిరుద్యోగులు పెరుగుతున్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే విషయమై యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

 - షబ్బీర్ అహ్మద్, సీనియర్ మైనింగ్ సర్దార్, జీడీకే 1వ గని

 

 పింఛన్ పెంచాలి..

 రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. మూడేళ్లకోసారి పెన్షన్ రివైజ్డ్ చేయూలని నిబంధనలున్నా రెండు దశాబ్దాలుగా అమలుకు నోచుకోవడం లేదు. పదేళ్లక్రితం రిటైర్ అరుున కార్మికులకు వెరుు్య రూపాయల పెన్షన్ కూడా వస్తలేదు. పెరిగిన ధరలకనుగుణంగా పెన్షన్ ఇవ్వాలి. లేకుంటే బతకడమే కష్టం.

 - ఆట పోషం, రిటైర్డ్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి

 

 వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి

 వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలి. తెలంగాణ తొలి ప్రభుత్వ ఈ మేరకు మొదటి జీవో ఇవ్వాలి. చాలా మంది కార్మికుల పిల్లలు వారసత్వ ఉద్యోగాలు లేక డ్రైవర్లుగా... ఇతర చిన్నచిన్న ఉపాధి పనులు వెతుక్కుంటున్నారు. మరికొందరైతే కూలీలుగా మారుతున్నరు. ఈ పరిస్థితి మారాలి. ప్రతీ కార్మికుడి కుటుంబానికి కొత్త ప్రభుత్వం భరోసా కల్పించాలి.

 - మారం రాకేశ్, బీటెక్, గోదావరిఖని

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top