‘ద మదర్’ రచయిత ఎవరు?

‘ద మదర్’ రచయిత ఎవరు? - Sakshi


 భారతదేశ చరిత్ర



 1.    రాజధానిని స్థానేశ్వరం నుంచి కనోజ్‌కు మార్చిన రాజెవరు?

     హర్షుడు

 2.    ‘అష్టాంగ సంగ్రహం’ అనే వైద్య గ్రంథాన్ని ఎవరు రచించారు?

     వాగ్బటుడు

 3.    ‘హితకారిణీ సమాజం’ ఎవరు స్థాపించారు?

     కందుకూరి వీరేశలింగం

 4.    ‘ప్రచ్ఛన్న బుద్ధుడు’ అని ఎవరిని పేర్కొంటారు?

     శంకరాచార్యులు

 5.    నరేంద్ర మృగేశ్వరాలయాలు అనే పేరుతో 108 శివాలయాలు నిర్మించిన తూర్పు చాళుక్యరాజు?

     రెండో విజయాదిత్యుడు

 6.    ‘మహాభాష్య’ రచయిత?

     పతంజలి

 7.    ‘సెంగుట్టువాన్’ ఏ రాజ వంశస్థుడు?

     చేర

 8.    శాశ్వత భూమిశిస్తు విధానాన్ని బెంగాల్‌లో ఎవరు ప్రవేశపెటారు?

     కారన్‌వాలీస్

 9.    రుగ్వేద కాలంలో ‘గ్రామాధిపతిని’ ఏమని పిలిచేవారు?

     గ్రామణి

 10.    సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించిన భారతీయ పాలకుడు?

     టిప్పుసుల్తాన్ (మైసూర్)

 11.    స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి, చిట్టచివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు?

     చక్రవర్తుల రాజగోపాలాచారి

 12.    స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్?

     లార్‌‌డ మౌంట్‌బాటన్

 13.    ‘అభినవ్ భారత్’ అనే అతివాద సంస్థను ఎవరు స్థాపించారు?

     సావార్కర్ సోదరులు

 14.    ‘గదర్ పార్టీని’ 1915లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరంలో ఎవరు స్థాపించారు?

     లాలా హరదయాళ్

 15.    గదర్ పార్టీలో సభ్యుడైన ఆంధ్రుడెవరు?

     దర్శి చెంచయ్య

 16.    లాలా లజపతిరాయ్‌ని తీవ్రంగా గాయపర్చిన బ్రిటిష్ పోలీసు అధికారి ‘సాండర్‌‌స’ ను లాహోర్‌లో కాల్చి చంపిందెవరు?

     భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్

 17.    1922-24 సంవత్సరాల్లో రంప విప్లవం (లేదా) మన్నెం పోరాటం ఎవరి నాయకత్వంలో జరిగింది?

     అల్లూరి సీతారామరాజు

 18.    శాసనోల్లంఘన ఉద్యమకాలంలో

 1930లో గాంధీజీ దండియాత్రను ఎక్కడ నుంచి ప్రారంభించారు?

     సబర్మతీ ఆశ్రమం

 19.    ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ భారత జాతీయ సైన్యాన్ని ఎవరు స్థాపించారు?

     సుభాష్ చంద్రబోస్

 20.    భారత స్వాతంత్య్ర సమితి (లేదా) ‘ఇండియన్ ఇండిపెండెన్‌‌స లీగ్’కి మొదటి అధ్యక్షుడెవరు?

     రాస్‌బిహారీ బోస్

 21.    ‘ఛలో ఢిల్లీ’ అనే నినాదాన్ని ఎవరు అందించారు?

     సుభాష్ చంద్రబోస్

 22.    ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు దాని కార్యస్థానం ఎక్కడ ఉండేది?

     విజయవాడ

 23.    ఆంధ్ర రాష్ర్టం ఏర్పడినప్పుడు

 హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు?

     గుంటూరు

 24.    భారతదేశపు మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని పుణేలో ఎవరు ప్రారంభించారు?

     పండిత రమాబాయి

 25.    భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?

     డల్హౌసీ

 26.    ఛత్రపతి శివాజీ నౌకాబల స్థావరం ఏది?

     సాల్సెట్ట్

 27.    ‘బృహత్సంహిత’ గ్రంథకర్త?

     వరాహమిహిరుడు

 28.    భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడంలో బాధ్యత వహించింది?

     1813 చార్టర్ చట్టం

 29.    ‘అభిలాషితార్థ చింతామణి’ గ్రంథకర్త?

     చాళుక్య సోమేశ్వరుడు

 30.    మౌర్యుల కాలంనాటి పట్టణ పరిపాలనా విధానం గురించి తెలియజేసే ప్రధాన ఆధారం?

     మెగస్తనీస్ ఇండికా

 31.    ‘పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ (ౌ్కఠ్ఛిట్టడ ్చఛీ ్ఖఆటజ్టీజీటజి ఖఠ్ఛ జీ ఐఛీజ్చీ) రచయిత ఎవరు?

     దాదాబాయి నౌరోజీ

 32.    ‘భారత జాతీయ కాంగ్రెస్’కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరు?

     పి. ఆనందాచార్యులు.

 (1891లో)

 33.    ‘ది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్’ను ఎవరు స్థాపించారు?

     సర్ విలియం జోన్‌‌స

 34.    1857లో తిరుగుబాటును ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’గా అభివర్ణించిందెవరు?

     వి.డి. సావార్కర్

 35.    ‘ఆంధ్రాలో మొట్టమొదటి’ బాలికల పాఠశాలను ఎక్కడ నెలకొల్పారు?

     ధవళేశ్వరంలో

 36.    ‘ఆత్మ గౌరవ సభ’ను ఎవరు స్థాపించారు?

     పెరియార్ రామస్వామి నాయకర్

 37.    ‘గాంధారశిల్పకళారీతి’ ఏ రాజు పోషణలో ఎక్కువగా అభివృద్ధి చెందింది?

     కనిష్కుడు

 38.    సుప్రసిద్ధ నాగర వాస్తురీతికి చెందిన లింగరాజ దేవాలయం ఏ రాష్ర్టంలో ఉంది?

     ఒడిశా

 39.    ‘పంజాబ్ కేసరి’గా ప్రసిద్ధి చెందినవారెవరు?

     లాలా లజపతిరాయ్

 40.    వందేమాతరం ఉద్యమంలో భాగంగా బిపిన్ చంద్ర పాల్ పర్యటనలను ఆంధ్రదేశంలో ఎవరు ఏర్పాటు చేశారు?

     ముట్నూరి కృష్ణారావు

 41.    1907లో రాజమండ్రిలో ‘బాలభారతి సమితి’ వ్యవస్థాపకులెవరు?

     చిలుకూరి వీరభద్రరావు

 42.    ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అనే గేయాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం ఏ ఉద్యమం కాలంలో రచించాడు?

     వందేమాతరం ఉద్యమం

 43.    ‘ద మదర్’ రచయిత ఎవరు?

     మాక్సిమ్ గోర్కీ

 44.    ‘రౌలత్ చట్టానికి’ వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహం చేపట్టినప్పుడు ఏ దురంతం జరిగింది?

     జలియన్ వాలాబాగ్

 45.    బహమనీ - విజయనగర రాజ్యాలు తరచుగా ఏ ప్రాంతం కోసం కీచులాడేవి?

     రాయచూరు, అంతర్వేది

 46.    ఔరంగజేబు గోల్కొండ కోటను ఏ సంవత్సరంలో జయించాడు?

     1687లో

 47.    పీష్వా పదవిని వారసత్వ హక్కుగా చేసినవాడు?

     మొదటి బాజీరావు

 48.    ‘ఆంధ్ర శివాజీ’గా పేరు పొందినవారు?

     పర్వతనేని వీరయ్య చౌదరి

 49.    ‘ఫార్వర్‌‌డ బ్లాక్’ను నెలకొల్పినవారు?

     సుభాష్ చంద్రబోస్

 50.    ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘వందేమాతరం’ ఉద్యమం ఎప్పుడు జరిగింది?

     1938లో

 51.    హర్షవర్థనుని ఓడించిన చాళుక్యరాజు?

     రెండో పులకేశిన్

 52.    చోళుల గ్రామ పరిపాలన గురించి వివరించే ఉత్తర మేరూర శాసనాన్ని వేయించింది ఎవరు?

     మొదటి పరాంతక చోళుడు

 53.    హైడాస్పస్ యుద్ధంలో అలెగ్జాండర్‌ను ఎదుర్కొన్న వీరుడెవరు?

     పోరస్

 54.    ‘ది క్రిసెంట్’ అనే పత్రికను ప్రారంభించిందిఎవరు?

     గాజుల లక్ష్మీ నరసుచెట్టి

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top