ఆగ్రా నగరాన్ని ఎవరు నిర్మించారు?

ఆగ్రా నగరాన్ని ఎవరు నిర్మించారు? - Sakshi


భారతదేశ చరిత్ర

 

 1.    ప్రాచీన భారతదేశంలో అత్యధికంగా బంగారు నాణేలు ముద్రించిన రాజవంశం?

 గుప్తరాజులు

 

 2.    హీనయాన బౌద్ధమతశాఖ ఏ దేశాల్లో ప్రాచుర్యం పొందింది?

 శ్రీలంక, బర్మా, కంబోడియా, చైనా

 

 3.    మహాయాన బౌద్ధశాఖకు చెందిన తాత్త్వికులెవరు?

 నాగార్జునుడు, ఆర్యదేవుడు, అసంగుడు

 

 4.    వజ్రయాన బౌద్ధం ఏ శతాబ్దంలో ప్రచారంలోకి వచ్చింది?

 క్రీ.శ. 7, 8 శతాబ్దాల్లో

 

 5.    జైనమత గ్రంథాలను ఏ సదస్సులో ప్రామాణీకరించారు? ఆ సదస్సును ఎక్కడ నిర్వహించారు?

 మూడో జైనమత సదస్సు క్రీ.శ.

 453(వల్లభి)లో జరిగింది

 

 6.    శ్వేతాంబర జైనమతం ఎక్కడ బహుళ ప్రజాదరణ పొందింది?

 మధుర, వల్లభి

 

 7.    భారతీయ తాత్త్విక చింతనకు ఆయువు పట్టయిన ‘షడ్‌దర్శనాలు’ ఏవి?

 1. న్యాయ    2. వైశేషిక

 3. సాంఖ్య    4. యోగ

 5. మీమాంస    6. వేదాంతం

 

 8.    పురుషుడు, ప్రకృతి గురించి తెలిపే ‘సాంఖ్యకారిక’ గ్రంథ రచయిత?

 ఈశ్వర కృష్ణ (క్రీ.శ. 4వ శతాబ్దం)

 

 9.    ఇండియన్ నెపోలియన్‌గా ప్రశంసలందుకున్న గుప్తరాజు?

 సముద్రగుప్తుడు

 

 10.    ‘నీతిసారం’ అనే న్యాయశాస్త్ర గ్రంథ రచయిత?

 కామందకుడు

 

 11.    ప్రసిద్ధ ‘సీ-యూ-కీ’ గ్రంథాన్ని ఎవరు రచించారు?

 హ్యూయాన్‌త్సాంగ్

 

 12.    చైనా యాత్రికుడు ‘ఫాహియాన్’ ఏ గుప్తరాజు కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు?

 రెండో చంద్రగుప్తుడు

 

 13.  ప్రసిద్ధులైన ‘నవరత్నాలు’ అనే కవి పండితులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

 రెండో చంద్రగుప్తుడు

 

 14.    ఉపనిషత్తులకు మరో పేరు?

 వేదాంతాలు

 

 15.    ఏ వేదం భారతీయ సంగీత మూలం గురించి వివరిస్తుంది?

 సామవేదం

 

 16.    వేదాంగాలు ఎన్ని?

 ఆరు

 

 17.    బౌద్ధుల పవిత్ర గ్రంథాలు?

 త్రిపీఠకాలు

 

 18.    దక్షిణ కాశీగా పేరొందిన అతి పురాతన, మత విద్యాకేంద్రం?

 కాంచీపురం

 

 19.    ‘బాదామి’ దేనికి ప్రసిద్ధి చెందింది?

 రాతిని తొలచి చెక్కిన గుహాలయాలు

 

 20.    ప్రఖ్యాత త్రిమూర్తి శిల్పం ఎక్కడ ఉంది?

 ఎలిఫెంటా (మహారాష్ర్ట)

 

 21.    ఇటీవల కనుగొన్న ‘బావికొండ బౌద్ధ కేంద్రం’ ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలో ఉంది?

 విశాఖపట్నం

 

 22.    గుప్తుల కాలంలో అధికార భాష?

 సంస్కృతం

 

 23.    భారతదేశ ప్రాచీన పశు వైద్య విజ్ఞాన గ్రంథం ‘హస్తి-ఆయుర్వేదాన్ని’ ఎవరు రచించారు?

 పాలకాప్యుడు

 

 24.    హర్షుడి ఆస్థాన పండితుడు?

 బాణుడు

 

 25.   హర్షుడు రచించిన గ్రంథాలు?

 రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక

 

 26.    హూణులను ఓడించిన గుప్త చక్రవర్తి?

 స్కంధగుప్తుడు

 

 27.    ‘స్వప్న వాసవదత్త’ నాటకకర్త?

 భానుడు

 

 28.    హర్షుని కాలంలో ఏ బౌద్ధమత యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు?

 హ్యూయాన్‌త్సాంగ్

 

 29.    ‘కౌముదీ మహోత్సవం’ గ్రంథ రచయిత?

 వజ్జకుడు

 

 30.    హర్షవర్ధనుని రెండో రాజధాని?

 కనోజ్

 

 31.    అతి ప్రాచీనమైన మూడు సంగమ సదస్సులు ఎక్కడ జరిగాయి?

 మధురై (తమిళనాడు)

 

 32.    అలహాబాద్ ‘ప్రశస్థి’ ఏ గుప్తరాజుకు చెందింది?

 సముద్రగుప్తుడు

 

 33.    బంగారు నాణెంపై ‘వీణవాయిస్తున్నట్లు’ కనిపించే గుప్తరాజెవరు?

 సముద్రగుప్తుడు

 

 34.    ఖగోళ, గణిత శాస్త్రాల్లో, ఎన్నో మౌలిక సమస్యల్ని మొదటిసారిగా ప్రపంచం ముందుకు తీసుకువచ్చిన శాస్త్రవేత్త?

 ఆర్యభట్టు

 

 35.    ‘గుప్తుల శకం’ ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు?

 మొదటి చంద్రగుప్తుడు. క్రీ.శ. 319-20లో

 

 36.   ప్రసిద్ధి గాంచిన ‘తిరుక్కురల్’ తమిళ గ్రంథాన్ని క్రీ.శ. 3వ శతాబ్దంలో ఎవరు రచించారు?

 తిరువళ్లూర్‌వార్

 

 37.    కృష్ణ దేవరాయలు ఒరిస్సా గజపతులపై దండయాత్ర చేస్తూ, విజయ స్తంభాన్ని ఎక్కడ ప్రతిష్టించాడు?

 సింహాచలంలో (విశాఖపట్నం జిల్లా)

 

 38.    ఇటలీ యాత్రికుడు ‘నికోల-డి-కోంటీ’ ఏ విజయనగర రాజుకాలంలో విజయనగరం సందర్శించాడు?

 మొదటి దేవరాయలు

 

 39.    ‘ఇనాం’ అంటే?

 ఉద్యోగులకు జీతం బదులు భూమిని ఇవ్వడం

 

 40.    పల్లవుల అధికార భాష?

 సంస్కృతం

 

 

 41.  ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథ, భువనేశ్వర లింగరాజ ఆలయాలను ఎవరు నిర్మించారు?

 అనంతవర్మ చోడగాంగరాజు

 42.    అశోకుని ధర్మ ప్రబోధాలు ప్రాచీన భారతదేశంలో ఏ విధంగా ప్రచారం పొందాయి?

 శిలాశాసనాల ద్వారా

 

 43.    ఉత్తర భారతదేశ ‘నాగర దేవాలయ’ నిర్మాణ వాస్తుశైలి ప్రత్యేకంగా ఎక్కడ కనిపిస్తుంది?

 ఖజురహో దేవాలయాలు (మధ్యప్రదేశ్), భువనేశ్వర ఆలయాలు (ఒడిశా)

 

 44.    స్థానిక స్వపరిపాలన గురించి వివరించే ఉత్తర మేరూర శాసనాన్ని ఏ రాజు వేయించాడు?

 పరాంతక చోళుడు

 

 45.    ఒరిస్సా గజపతుల రాజ్యస్థాపకుడు?

 కపిలేంద్రుడు

 

 46.    ఆగ్రా నగరాన్ని ఎవరు నిర్మించారు?

 సికిందర్ లోడీ

 

 47.    మధురైలో పాండరాజులు నిర్మించిన ‘మీనాక్షి దేవాలయం’ ఏ దేవతకు సంబంధించింది?

 పార్వతీదేవి

 

 48.    మౌంట్ అబూ వద్ద నిర్మించిన ‘జైన దిల్వారా’ దేవాలయాలను ఏ రాజులు నిర్మించారు?

 విమల, తేజపాలుడు, సిద్ధరాజు

 

 49.    ప్రసిద్ధిగాంచిన రోమన్ వర్తక స్థావరం తమిళనాడులో ఏ ప్రాంతంలో ఉంది?

 అరికమేడు

 

 50.    పవిత్ర ‘గాయత్రీమంత్రం’ ప్రస్థావన ఏ వేదంలో ఉంది?

 రుగ్వేదం

 

 51.    ‘గోత్ర’ అనే పదాన్ని ఏ వేదంలో ప్రస్థావించారు?

 అధర్వణ వేదం

 

 52.    వేదకాలం నాటి సాహిత్యాల వరుస క్రమం?

 సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు

 

 53.    కర్మమార్గాన్ని సమర్ధించిన ‘పూర్వ మీమాంస’ వాదాన్ని ప్రతిపాదించినవారు?

 జైమినీ మహర్షి

 

 54.    ‘జ్ఞాన మార్గాన్ని’ సమర్థించిన ‘ఉత్తర మీ మాంస’ వాదానికి మూలపురుషుడు?

 బాదనారాయణుడు

 

 55.    ‘ఇహం, సత్యం, పరం’ మిథ్య అని ప్రతిపాదించిన వారిని ఏమని పిలుస్తారు?

 లోకాయుత వాదం (చార్వాకులు)

 

 56.    జైనమతంలో ‘ఇరవై మూడో తీర్థంకరుడు ఎవరు? అతని చిహ్నం ఏది?

 పార్శ్వనాథుడు (సర్పం చిహ్నం)

 

 57.   300 ప్రాంతంలో పాటలీపుట్రలో జరిగిన మొదటి జైన సమావేశానికి అధ్యక్షుడెవరు?

 స్థూలభద్రుడు

 

 58.    జైనమత ‘కల్పసూత్రాలు’ ఎవరు రచించాడు?

 భద్రబాహుడు

 

 59.    జైనమతస్థులు పూజించే స్త్రీ దేవత పేరేమిటి?

 విద్యాదేవి

 

 60.    బౌద్ధమత వాస్తులో ‘చైత్య గృహాలు’ దేన్ని సూచిస్తాయి?

 ప్రార్థన మందిరాలు

 

 61.  . 483లో గౌతమ బుద్ధుడు ఎక్కడ నిర్యాణం పొందాడు?

 కుశీనగరం (ఉత్తరప్రదేశ్)

 

 62.    అశ్వఘోషుడు రచించిన గ్రంథాలు?

 బుద్ధచరితం, సౌందర నందనం, సారిపుత్ర ప్రకరణం

 

 63.    {Mీ.శ. 1వ శతాబ్దంలో కాశ్మీరులోని కుందలవనంలో  4వ బౌద్ధ సదస్సును (సంగీతి) ఏ

 రాజు నిర్వహించాడు? దానికి అధ్యక్షుడు ఎవరు?

 కుప్రాణురాజు కనిష్కుడు, వసుమిత్రుడు (అధ్యక్షుడు)

 

 64.    దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం?

 భట్టిప్రోలు (గుంటూరు జిల్లా)

 

 65.    ‘జాతక కథలు’ అంటే ఏమిటి?

 బుద్ధుడి పూర్వ జన్మ వృత్తాంతాన్ని వివరించే కథలు

 

 66.    తమిళ ఇతిహాసమైన ‘శిలప్పాధికారం’ గ్రంథ రచయిత?

 ఇలంగో అడిగళ్

 

 67.    ‘ధర్మచక్ర ప్రవర్తనం’ అంటే?

 బుద్ధుడు మొదటిసారిగా ధర్మాన్ని బోధించడం (సార్‌నాథ్‌లో)

 

 68.    ‘భాగవత మతశాఖ’ను స్థాపించినవారు?

 వాసుదేవ కృష్ణుడు

 

 69.    ‘సంగం’ అంటే?

 పండితుల పరిషత్తు

 

 70.    ‘తొల్కాకప్పీయం’ రచయిత?

 తొల్కాకప్పీయర్

 

 71.    జైన మహావీరుడి జన్మస్థలం?

 కుందగ్రామం

 

 72.    బౌద్ధమత ‘మాధ్యమిక తత్త్వ’ సిద్ధాంతకర్త ఎవరు?

 ఆచార్య నాగార్జునుడు

 

 73.    వర్ధమాన మహావీరుడు తన బోధనలను ఏ భాషలో బోధించాడు?

 అర్థమాగధి

 

 74.    మౌర్యుల కాలంలో పరిపాలనా భాష?

 ప్రాకృతం

 

 75.    అశోకుడి కాలంలో పాటలీపుత్రలో జరిగిన మూడో బౌద్ధమత సదస్సుకు అధ్యక్షుడు?

 మొగ్గలి పుత్త తిస్యుడు

 

 76.    ‘ముద్రారాక్షసం’ గ్రంథకర్త?

 విశాఖదత్తుడు

 

 77.    సింధునాగరికత ప్రజలకు ‘ఏ లోహం’ తెలియదు?

 ఇనుము

 

 78.    మౌర్యుల తర్వాత ‘పాటలీపుత్ర’ సింహాసనాన్ని అధిష్టించినవారు?

 శుంగులు

 

 79.    అశోకుడి కాలంలో రెండో బౌద్ధమత సంగీతి’ సదస్సును ఎక్కడ నిర్వహించారు?

 వైశాలి

 

 80.    అజాత శత్రువు కాలంలో నిర్వహించిన మొదటి బౌద్ధమత సదస్సుకు అధ్యక్షుడు ఎవరు?

 మహాకశ్యపుడు

 

 81.    జైన మహావీరుడు ఏ నది ఒడ్డున కైవల్యం పొందాడు?

 రిజుపాలిక

 

 82.    ‘మణిమేఖలై’ గ్రంథకర్త?

 సిత్త లై సత్తనార్

 

 83.    బౌద్ధ మత సాహిత్యం ఏ భాషలో రాశారు?

 పాళీభాషలో

 

 84.    మగధ తొలి రాజధాని?

 గిరివ్రజం

 

 85.    చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ మరణించాడు?

 శ్రావణ బెళగొల (కర్ణాటక)

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top