టీఎస్‌పీఎస్సీ ఏఈఈ ప్రిపరేషన్ ప్రణాళిక


 సిలబస్

 పేపర్-1 (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్): వర్తమాన వ్యవహారాలు (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ). అంతర్జాతీయ వ్యవహారాలు జనరల్ సైన్స్, శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ విజయాలు పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ భారత, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి భారత జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ (ఫిజికల్, సోషల్, ఎకనమిక్) ఆధునిక భారతదేశ చరిత్ర (భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యం) తెలంగాణ సామాజిక-ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర (తెలంగాణ ఉద్యమం, రాష్ర్ట ఏర్పాటుకు ప్రాధాన్యం) భారత రాజ్యాంగం; తెలంగాణ సమాజం- సంస్కృతి- వారసత్వం, సాహిత్యం; తెలంగాణ రాష్ట్ర విధానాలు; లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్, పదో తరగతి స్థాయి ఇంగ్లిష్.  పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడతాయి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌కు ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలను రిఫరెన్స్‌గా ఉపయోగించుకోవచ్చు.

 

 పేపర్-2 (సివిల్ ఇంజనీరింగ్):

 డిగ్రీ స్థాయిలో ప్రశ్నలుంటాయి.

  ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్

  మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్

 హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్

 ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్

 ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్

 సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్

 ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్

 సర్వేయింగ్

 

 ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ కోసం ఉపయోగపడే పుస్తకాలు:

 సివిల్ ఇంజనీరింగ్ (ఆబ్జెక్టివ్ టైప్): ఆర్.ఎస్.ఖుర్మి, జె.కె.గుప్త

 సివిల్ ఇంజనీరింగ్ (ఆబ్జెక్టివ్ టైప్): ఎస్.పి.గుప్త అండ్ ఎస్.ఎస్.గుప్త

 

 ప్రణాళిక ముఖ్యం:

 తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మొదటి అవకాశం కాబట్టి, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సిలబస్‌కు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం చదివి, విజయం సాధించవచ్చు.

 రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రిపరేషన్‌తో మంచి ఫలితాలు రాబట్టవచ్చు. పరీక్ష సెప్టెంబరు 20న జరుగుతుంది కాబట్టి, చాలా తక్కువ సమయం అందుబాటులో ఉంది. అందువల్ల సబ్జెక్టు నిపుణుల సూచనల మేరకు ప్రిపరేషన్ కొనసాగించాలి. గ్రూప్‌గా చదవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చు. కొత్త విషయాలను నేర్చుకునేందుకు అవకాశముంటుంది.  పరీక్షలో ఎక్కువగా థియరీ ప్రశ్నలుంటాయి కాబట్టి గేట్ ఒక మార్కు ప్రశ్నలు, ఐఈఎస్ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.



 షార్ట్ నోట్స్‌ను రూపొందించుకోవడం వల్ల చివర్లో రివిజన్‌కు బాగా ఉపయోగపడుతుంది. సిలబస్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలు, సూత్రాలు, సిద్ధాంతాలతో సొంతగా షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. తక్కువ సమయం అందుబాటులో ఉంది కాబట్టి ఎక్కువ వెయిటేజీకి అవకాశమున్న అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. సివిల్ ఇంజనీరింగ్ టెక్నికల్ సబ్జెక్టులో స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెషినరీ అంశాలకు దాదాపు 50 శాతం వెయిటేజీ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రిపరేషన్ కొనసాగించాలి. స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్‌లో ఈ్ఛజ్ఛఛ్టిజీౌట, జ్ఛిట్ఛ జౌటఛ్ఛిట, ఆ్ఛఛీజీజ జౌటఛ్ఛిట నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.

 అధిక వెయిటేజీ ఉన్న అంశాలపై దృష్టిసారించి, మిగిలిన అంశాలను ఆబ్జెక్టివ్‌గా ప్రిపరేషన్ కొనసాగిస్తే సరిపోతుంది.

 

 మాదిరి ప్రశ్నలు

 Civil Engineering

 1.    The relation between Young's modulus of Elasticity E, bulk modulus K and Poisson's ratio m is given by

     1) E = 2K (1 - 2m)    2) E = 3K (1 + m)

     3) E = 3K (1 - 2m)    4) E = 2K (1 + m)

 2.    Limiting values of Poission's ratio are

     1) +1 and 0.5    2) -1 and 0.5

     3) 1 and -0.5    4) 0 and 0.5

 General studies and Reasoning, Analytical

 3.    If A= 1, B= 2, N= 14, then BEADING = ?

     1) 2154(14)97    2) 2514(14)79

     3) 25149(14)7    4) 2154(14)79

 4.    The Supreme Court of India was set up by

     1) Regulating Act, 1773

     2) Pits India Act, 1784

     3) Charter Act, 1813

     4) Charter Act, 1833

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top