టిస్ కోర్సులు... ప్రవేశాలు

టిస్ కోర్సులు... ప్రవేశాలు


దేశంలోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటైన.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) 2015-17 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టిస్‌కు ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్, గువహటిలలో క్యాంపస్‌లు ఉన్నాయి. తాజా నోటిఫికేషన్ ద్వారా ఈ నాలుగు క్యాంపస్‌లలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంహెచ్‌ఏ, ఎంపీహెచ్ వంటి విభాగాల్లో మొత్తం 49 రకాల కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తుంది. క్యాంపస్‌ల వారీగా అందిస్తున్న కోర్సులు..

 

 హైదరాబాద్ క్యాంపస్:

 కోర్సు   -                                   సీట్లు

 ఎంఏ (రూరల్ డెవలప్‌మెంట్ అండ్ గవర్నెన్స్)-    30

 ఎంఏ (ఎడ్యుకేషన్)    -30

 ఎంఏ (పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్)-    30

 ఎంఏ (ఉమెన్ స్టడీస్)-    30

 ఎంఏ (డెవలప్‌మెంట్ స్టడీస్)-    30

 ఎంఏ (నేచురల్ రీసోర్సెస్ అండ్ గవర్నెన్స్) -    30

 

 ప్రవేశం:

 ప్రవేశ ప్రక్రియ 225 మార్కులకు మూడు దశలుగా ఉంటుంది. వివరాలు.. రాత పరీక్ష (100 మార్కులు), ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ (పీఐటీ)/గ్రూప్ డిస్కషన్ (జీడీ-50 మార్కులు), పర్సనల్ ఇంటర్వ్యూ (75 మార్కులు). ఈ మూడు దశలకు కలిపి మొత్తం 225 మార్కులు కేటాయించారు. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ (పీఐటీ)/గ్రూప్ డిస్కషన్ కు హాజరు కావాలి. ఈ దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ క్రమంలో రాత పరీక్షకు 50 శాతం వెయిటేజీ, పీఐటీ/జీడీకి 20 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఇస్తారు.

 

రాత పరీక్ష ఇలా:

రాత పరీక్షలో అభ్యర్థుల ప్రజ్ఞా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. సామాజిక అంశాలు, ప్రస్తుతం వివిధ రంగాల్లో జరుగుతున్న పరిణామాలతోపాటు అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. డెమో కొశ్చన్ పేపర్, గతేడాది ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్లో లభ్యమవుతాయి. వాటి ఆధారంగా ప్రశ్నల స్థాయి తెలుసుకోవచ్చు.

 

రెండో దశ.. పీఐటీ:

ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్.. రాత పరీక్ష (ఎస్సే) రూపంలో ఉంటుంది. ఇందుకు 45 నిమిషాల సమయం కేటాయించారు. ఎంచుకున్న క్యాంపస్, కోర్సును బట్టి ఎస్సే అంశాలు వేర్వేరుగా ఉంటాయి. దాదాపుగా అన్ని అంశాలు ఎంచుకున్న కోర్సు నేపథ్యంగా సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనల ఆధారంగా ఉంటాయి. నిర్దేశించిన పద పరిమితిలోనే ఎస్సేను పూర్తి చేయాలి. తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూలో సైతం ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.

 

 ప్లేస్‌మెంట్స్:

 టిస్‌లో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాల పరంగా ఎటువంటి ఢోకా లేదని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా పలు కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. డెవలప్‌మెంట్ స్టడీస్ అభ్యర్థులను ఇంటర్నేషనల్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. హెచ్‌ఆర్‌ఎం అండ్ ఎల్‌ఆర్ (హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ అండ్ లేబర్ రిలేషన్) అభ్యర్థులను హిందూస్థాన్ లీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, యాక్సిస్ బ్యాంక్, పలు ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి.

 

టిస్ ప్రవేశ ప్రక్రియ ఆధారంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, సోషల్ సెన్సైస్ అండ్ ట్రాన్స్‌డిసిప్లినరీ రీసెర్చ్ (ఐఎంహెచ్‌ఎస్‌టీ)-చెన్నై, మెంటల్ హెల్త్ యాక్షన్ ట్రస్ట్-కాలికట్, జీ-సెట్-రాంచీ ఇన్‌స్టిట్యూట్‌లలోని వివిధ కోర్సుల్లో కూడా ప్రవేశం పొందొచ్చు.

 

 తుల్జాపూర్ క్యాంపస్

 ఎంఏ (రూరల్ డెవలప్‌మెంట్)

 ఎంఏ/ఎంఎస్సీ (డెవలప్‌మెంట్ పాలసీ, ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్)

 ఎంఏ (సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్)

 ఎంఏ/ఎంఎస్సీ (సస్టెయినబిలిటీ లైవ్లీహుడ్స్ అండ్ నేచురల్ రీసోర్సెస్ గవర్నెన్స్)

 

 గువహటి క్యాంపస్

 ఎంఏ (ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెయినబుల్‌టీ డెవలప్‌మెంట్)

 ఎంఏ (లేబర్ స్టడీస్ అండ్ సోషల్ ప్రొటెక్షన్)

 ఎంఏ (పీస్ అండ్ కన్‌ఫ్లిక్ట్ స్టడీస్)

 ఎంఏ (సోషియాలజీ అండ్ సోషల్ ఆంత్రోపాలజీ)

 ఎంఏ (సోషల్ వర్క్, నాలుగు స్పెషలైజేషన్స్‌తో)

 

 ముంబై క్యాంపస్

 స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్

 స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ లేబర్ స్టడీస్

 స్కూల్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ స్టడీస్

 స్కూల్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్

 స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్

 స్కూల్ ఆఫ్ హబిటాట్ స్టడీస్

 ఎంఏ/ఎంఎస్సీ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్)

 సెంటర్ ఫర్ హ్యుమన్ ఎకాలజీ

 స్కూల్ ఫర్ మీడియా అండ్ కల్చరల్ స్టడీస్

 స్కూల్ ఆఫ్ లా, రైట్స్ అండ్ కాన్‌స్టిట్యూషనల్ గవర్నెన్స్

 మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్

 ఆన్‌లైన్ కోర్సులు: ఎంఏ (సోషల్ వర్క్ ఇన్ చైల్డ్ రైట్స్, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ స్టడీస్).

 ఈ స్కూల్స్‌లో పలు రకాల స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి.

 

 నోటిఫికేషన్ సమాచారం

 

 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ (10 + 2 + 3 లేదా 10 + 2 + 4 లేదా 10 + 2 + 2+ 1 విధానంలో, 15 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి). కోర్సుల వారీగా అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి సంబంధిత వివరాలను వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చు.

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 29, 2014.

 పరీక్ష తేదీ: జనవరి 10, 2015.

 స్కోర్ కార్డులు పంపే తేదీ: ఫిబ్రవరి 3, 2015.

 పీఐటీ/ఇంటర్వ్యూ షెడ్యూల్: మార్చి 9-27, 2015.

 తుది ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 23, 2015.

 

వివరాలకు:   https://admissions.tiss.edu

 www.tiss.edu


 

అదేవిధంగా 2015 సంవత్సరానికి ఎంఫిల్, పీహెచ్‌డీ, షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌లలో కూడా ప్రవేశానికి టిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెరిట్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 15, 2015.

 

షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌ల విషయానికొస్తే.. ఎంచుకున్న విభాగాన్ని బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ కూడా ఎంచుకున్న కోర్సును బట్టి వేర్వేరుగా ఉంది.

 

సోషల్‌సెన్సైస్‌తో సామాజిక అవగాహన

 

సోషల్ సెన్సైస్ కోర్సులు అభ్యసించిన వారికి సమాజం, అభివృద్ధి క్రమంలో చోటు చేసుకునే సామాజిక మార్పులు పట్ల విస్తృత స్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. టిస్‌లో ఎంఏ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ గవర్నెన్స్, ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్‌‌స కోర్సులకు డిమాండ్ ఉంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సైతం ఈ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత విద్య, పరిశోధన, సమాచారాన్ని భిన్న కోణాల్లో విశ్లేషించడంలో ఆసక్తి ఉన్నవారు ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్‌ను ఎంచుకుంటున్నారు. మహిళా సాధికారత, విద్యావిధానంలో మార్పులు, సహజ వనరులు, వాతావరణ మార్పులు తదితర అంశాలపై ఆసక్తి ఉన్నవారు ఎంఏ ఉమెన్స్ స్టడీస్, ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ నేచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్‌‌స కోర్సుల్లో చేరుతున్నారు.

 

సోషల్ సైన్‌‌స కోర్సులు పూర్తిచేసిన వారు పంచాయతీలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలైన నేషనల్ లైవ్‌లీహుడ్స్ మిషన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఎంఎన్‌ఈఆర్‌జీఏ.. తదితర పథకాల్లో వివిధ హోదాల్లో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారికి నేర్చుకునే తత్వం, పరిశీలనా నైపుణ్యాలు, సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. అంతేకాకుండా వారికి ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉంటే త్వరగా ఉన్నత హోదాలో స్థిరపడొచ్చు.



- డా. లక్ష్మీ లింగం, డిప్యూటీ డెరైక్టర్,  టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, హైదరాబాద్.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top