తెలంగాణ సోషియో ఎకనమిక్‌ ఔట్‌లుక్‌–2017

తెలంగాణ సోషియో ఎకనమిక్‌ ఔట్‌లుక్‌–2017


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక ప్రగతి వేగవంతమైంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో.. జాతీయ వృద్ధిరేటును తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు అధిగమించి.. రెండంకెల వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి దేశ తలసరి ఆదాయ వృద్ధి కంటే తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి అధికంగా ఉందని అర్థమవుతోంది.


స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో వృద్ధి.. ఆర్థికS వ్యవస్థ ప్రగతిని తెలియజేస్తుంది. 2015–16లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి రూ.5.76 లక్షల కోట్లు కాగా, 2016–17లో రు.6.54 లక్షల కోట్లుగా(ముందస్తు అంచనాల ప్రకారం) ఉంటుందని అంచనా. 2015–16తో పోల్చితే 2016–17లో ప్రస్తుత ధరల వద్ద జీఎస్‌ డీపీలో వృద్ధి 13.7 శాతం. 2015–16లో స్థిర ధరల వద్ద జీఎస్‌డీపీ రూ.4.64 లక్షల కోట్లు కాగా, 2016–17లో రూ.5.11 లక్షల కోట్లని అంచనా. 2015–16తో పోల్చితే 2016–17లో స్థిర ధరల వద్ద జీఎస్‌డీపీలో వృద్ధి 10.1 శాతంగా నమోదైంది



రాష్ట్ర ప్రగతి (2016–17)

జాతీయ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర వాటా 2015–16లో 4.21 శాతం కాగా, 2016–17లో 4.28 శాతం. దేశ వృద్ధిరేటుతో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ) వృద్ధిని పోల్చితే 2012–13లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 5.5 శాతం కాగా, తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధి కేవలం 2.7 శాతం మాత్రమే. కానీ, 2014–15 తర్వాత తెలంగాణ వృద్ధిరేటు మెరుగై దేశ జీడీపీ వృద్ధిరేటును అధిగ మించింది.



 2013–14లో స్థిర ధరల వద్ద తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధి 5.6 శాతం కాగా, 2014–15లో 8.7 శాతంగా, 2015–16లో 9.5 శాతంగా, 2016–17లో 10.1 శాతంగా నమోదైంది. భారతదేశ జీడీపీ వృద్ధి స్థిర ధరల వద్ద 2013–14లో 6.5 శాతం కాగా, 2014–15లో 7.2 శాతంగా, 2015–16లో 7.9 శాతానికి పెరిగి, 2016–17 లో 7.1 శాతానికి తగ్గింది. స్థిర ధరల వద్ద (2011–12) తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5,11,286 కోట్లు కాగా, భారతదేజీడీపీ రూ.1,21,65,481 కోట్లు.



    వివిధ రంగాల్లో ప్రగతి

ఆర్థిక వ్యవస్థను మూడు రంగాలుగా విభజించవచ్చు. అవి..

1) ప్రాథమిక రంగం

2) ద్వితీయ రంగం

3) తృతీయ రంగం



ప్రాథమిక రంగంలో పంటలు, పశు పోషణ, అడవులు, ఫిషింగ్‌–ఆక్వాకల్చర్, గనులు –క్వారీయింగ్‌ వంటిæ ఉపరంగాలు ఉంటాయి. ద్వితీయ రంగంలో తయారీ–నిర్మాణ రంగాలు, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వంటి ఉప రంగాలు ఉంటాయి. తృతీయ రంగంలో వాణిజ్యం, రిపేర్‌ సర్వీసులు, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, కోల్డ్‌ స్టోరేజ్‌ సేవలు (నిల్వ) సమాచార–ఫైనాన్షియల్‌ సర్వీసులు, రియల్‌ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు, ప్రభుత్వ పాలన తదితర ఉపరంగాలు ఉంటాయి.



తెలంగాణలో వ్యవసాయ–అనుబంధ కార్య కలాపాలతో కూడిన ప్రాథమిక రంగ స్థూల సమ కూరిన విలువలో వృద్ధి.. ప్రస్తుత ధరల వద్ద 17.2 శాతంగా నమోదైంది. అదే సమయంలో దేశంలో వ్యవసాయ–అనుబంధ కార్యకలాపాల్లో వృద్ధి 9 శాతంగా ఉంది. తెలంగాణలో ద్వితీయ రంగం వృద్ధి ప్రస్తుత ధరల వద్ద 9.8 శాతం కాగా, దేశంలో 8.7 శాతంగా ఉంది. తెలంగాణలో సేవా రంగంలో వృద్ధి 14.6 శాతం కాగా, దేశంలో 11.9 శాతంగా నమోదైంది.

lస్థిర ధరల వద్ద 2015–16లో తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక రంగంలో రుణాత్మక వృద్ధి నమోదైంది. కాగా, 2016–17లో ప్రాథమిక వృద్ధిని 12.8 శాతంగా, ద్వితీయ రంగ వృద్ధిని 6.2 శాతంగా, తృతీయ రంగ వృద్ధిని 8.2 శాతంగా అంచనా వేశారు.



ఉపరంగాల్లో వృద్ధిని పరిశీలిస్తే స్థిర ధరల వద్ద జీవీఏలో 2016–17లో (ముందస్తు అంచనాల ప్రకారం) ప్రాథమిక రంగంలో పంటల ఉత్పత్తి వృద్ధి 19 శాతంగా, వ్యవసాయం, అడవులు, ఫిషింగ్‌లో వృద్ధి 12.1 శాతంగా, మైనింగ్‌–క్వారీయింగ్‌లో వృద్ధి 15.6 శాతంగా నమోదయ్యాయి.

స్థిర ధరల వద్ద స్థూల సమకూరిన∙విలువలో ద్వితీయ రంగంలోని ఉపరంగాల్లో వృద్ధిని పరిశీలిస్తే 2016–17లో తెలంగాణలో తయారీ రంగ వృద్ధి 7.1 శాతంగా, నిర్మాణ రంగ వృద్ధి 6 శాతంగా ఉన్నాయి.



అయితే విద్యుచ్ఛక్తి –నీటి సరఫరాల్లో మాత్రం రుణాత్మక వృద్ధి (–2.4 శాతం) నమోదైంది.lతెలంగాణ రాష్ట్రంలో 2016–17లో స్థిర ధరల వద్ద స్థూల సమకూరిన విలువలో తృతీయ రంగంలోని ఉపరంగాల్లో వృద్ధిని పరిశీలిస్తే వాణిజ్యం, రిపేర్, హోటళ్లు, రెస్టారెంట్లలో వృద్ధి 9.8 శాతం కాగా, ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో వృద్ధి 9.8 శాతంగా,S రియల్‌ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల్లో వృద్ధి 7.2 శాతంగా, ఇతర సేవల్లో వృద్ధి 6.2 శాతంగా ఉంది.



2016–17లో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల సమకూరిన విలువలో వివిధ రంగాల వాటాలను పరిశీలిస్తే ప్రాథమిక రంగం వాటాS18.5 శాతంగా, ద్వితీయ రంగం వాటా 19 శాతంగా, తృతీయ రంగం వాటా 62.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రాథమిక రంగం వాటాలో వ్యవసా యం–అనుంబంధ కార్యకలాపాల వాటా 15 శాతంగా, మైనింగ్‌–క్వారీయింగ్‌ వాటా 3 శాతంగా నమోదయ్యాయి.



ద్వితీయ రంగంలో(19 శాతంలో) తయారీ రంగ వాటా 12 శాతం కాగా, నిర్మాణ రంగ వాటా 6 శాతంగా, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా వాటా 1 శాతంగా ఉన్నాయి. తృతీయ రంగంలో(62.6 శాతం) రియల్‌ ఎస్టేట్‌–వృత్తిపరమైన సేవల వాటా 21 శాతం కాగా.. వాణిజ్యం, రిపేర్లు, హోటళ్లు–రెస్టారెంట్ల వాటా 15 శాతంగా, ఫైనాన్షియల్‌ సేవలు వాటా 6 శాతంగా, ఇతర సేవల వాటా 9 శాతంగా ఉన్నాయి. రవాణా, నిల్వ (స్టోరేజ్‌), సమాచారం వాటా 8 శాతంగా ఉంది.



స్థిర ధరల వద్ద (2011–12) తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా 2016–17లో రూ.76,083 కోట్లు కాగా, ద్వితీయ రంగం వాటా రూ.98,439 కోట్లు, తృతీయ రంగం వాటా రూ.2,84,572 కోట్లు. 2016–17లో తెలం గాణ రాష్ట్ర çస్థూల దేశీయోత్పత్తి.. స్థిర ధరల వద్ద రూ.5,11,286 కోట్లు.

స్థిర ధరల వద్ద(2011–12) 2016–17లో రాష్ట్ర స్థూల సమకూరినlవిలువలో ప్రాథమిక రంగం వాటా 16.6 శాతం కాగా, ద్వితీయ రంగం 21.4 శాతం వాటాను, తృతీయ రంగం 62 శాతం వాటాను కలిగున్నాయి.



  తలసరి ఆదాయం

ఆర్థికాభివృద్ధి స్థాయితోపాటు ప్రజల జీవన ప్రమాణాన్ని కొలిచేందుకు తలసరి ఆదాయాన్ని ముఖ్య సూచికగా పరిగణిస్తారు. ముందస్తు అంచనాల ప్రకారం 2016–17లో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,58,360 కాగా, 2015–16లో రూ.1,40,683గా నమోదైంది. 2015–16తో పోల్చితే 2016–17లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయంలో వృద్ధి 12.6 శాతం.



జాతీయ తలసరి ఆదాయం 2015–16లో రూ.94,178 కాగా, 2016–17లో రూ.1,03,818కు పెరిగింది. 2015–16తో పోల్చితే 2016–17లో ప్రస్తుత ధరల వద్ద దేశ తలసరి ఆదాయంలో వృద్ధి 10.2 శాతం మాత్రమే. 2011–12 నుంచిl2016–17 మధ్య కాలంలో దేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ. ఈ కాలంలో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య అంతరం పెరగడం తెలంగాణ రాష్ట్ర అధిక ప్రగతిని సూచిస్తుంది.



జిల్లా ఆర్థిక వృద్ధి స్థాయిని తెలుసుకునేం దుకుS జిల్లా స్థూల దేశీయోత్పత్తి కొలమానంగా ఉపకరిస్తుంది. 2015–16లో స్థూల జిల్లా దేశీయో త్పత్తిని పరిశీలిస్తే మిగిలిన జిల్లాలతో పోల్చితే హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల జీడీడీపీ ఎక్కువ. హైదరాబాద్‌ జీడీడీపీ 2015–16లో రూ.1,36,388 కోట్లు కాగా, రంగా రెడ్డి జీడీడీపీ రూ.82,359 కోట్లుగా, మేడ్చల్‌– మల్కాజ్‌గిరి జీడీడీపీ రూ.47,604 కోట్లుగా నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఈ నాలుగు జిల్లాల (హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి, సంగారెడ్డి) వాటా 52 శాతంగా ఉంది. దీన్నిబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పై నాలుగు జిల్లాల్లోనే కేంద్రీకృతమయ్యాయని తెలుస్తోంది.



రాష్ట్రంలో 31 జిల్లాల తలసరి ఆదాయాల్లో తేడాలు ఉన్నాయి. 2015–16లో రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రూ.1,40,683. అయితే నాలుగు జిల్లాల తలసరి ఆదాయం మాత్రం రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది. తలసరి ఆదా యంలో హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో (రూ.2,99,997) ఉండగా, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి(రూ.2,88,408), తృతీయ స్థానంలో Üంగారెడ్డి(రూ.1,69,481), నాలుగో స్థానంలో ólుడ్చల్‌–మల్కాజ్‌గిరి(రూ.1,62,327) ఉన్నాయి. రాష్ట్రంలో 18 జిల్లాల తలసరి ఆదాయం లక్ష రూపాయల కన్నా తక్కువ. అదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం (రూ.94,178) కన్నా 14 జిల్లాల తలసరి ఆదాయం తక్కువగా ఉంది.



ఉపాధి, నిరుద్యోగం

2015–16లో రాష్ట్రంలో మొత్తం శ్రామికుల్లో వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాల వాటా 54 శాతం కాగా, 18.1 శాతం మంది శ్రామికులు పారిశ్రామిక రంగంపై, 27.8 శాతం మంది శ్రామికులు సేవా రంగంపై ఆధారపడి



2015–16లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతా ల్లో వివిధ రంగాలపై ఆధారపడిన శ్రామి కులను పరిశీలిస్తే మొత్తం శ్రామికుల్లో వ్యవ సాయ–అనుబంధ రంగాలపై ఆధారపడిన వారు 73 శాతం కాగా, పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారు 13.7 శాతంగా, సేవా రంగంపై ఆధారపడినవారు 13.4 శాతంగా ఉన్నారు.



2015–16లో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వివిధ రంగాలపై ఆధారపడిన శ్రామికులను పరిశీలిస్తే.. మొత్తం శ్రామికుల్లో వ్యవసాయ– అనుబంధ రంగాలపై ఆధారపడినవారు 6.5 శాతం కాగా, పారిశ్రామిక రంగంపై 29.6 శాతం, సేవా రంగంపై 64.1 శాతం శ్రామిక శక్తి ఆధారపడి ఉంది.



2015–16లో తెలంగాణ రాష్ట్రంలో పనిలో పాల్గొనే శ్రమశక్తి రేటు 56.6 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 62.2 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 46.1 శాతంగా ఉంది.



2015–16లో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 2.7 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.2 శాతం, పట్టణ ప్రాంతాల్లో 6.1 శాతం నమోదైంది.



వ్యవసాయ రంగం

2014–15లో రాష్ట్ర స్థూల నీటి పారుదల విస్తీర్ణం 25.29 లక్షల హెక్టార్లు కాగా, 2015–16లో 20.28 లక్షల హెక్టార్లకు తగ్గింది. 2015–16లో మొత్తం స్థూల నీటిపారుదల విస్తీర్ణంలో గొట్టపు బావుల వాటా 58.83 శాతంగా, ఇతర బావుల వాటా 30.18 శాతంగా, చెరువుల వాటా 5.96 శాతంగా, కాల్వల వాటా 3.01 శాతంగా ఉంది. 1955–56లో మొత్తం నీటి పారుదల విస్తీర్ణంలో చెరువుల వాటా 64 శాతం కాగా, 1985–86లో 28 శాతానికి, 2012–13లో 8 శాతానికి తగ్గింది. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పవచ్చు. చెరువులు, కాల్వల కింద నీటిపారుదల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.



2016–17లో ఆహార ధాన్యాల సాగు కింద ఉన్న విస్తీర్ణం 29.29 లక్షల హెక్టార్లు కాగా, 2015–16తో పోల్చితే 2016–17లో విస్తీర్ణంలో వృద్ధి 33 శాతంగా ఉంది.



2015–16లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51.45 లక్షల టన్నులు కాగా, 2016–17లో 77.93 లక్షల టన్నులు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top