పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ నిర్వహించేదెవరు?

పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ నిర్వహించేదెవరు?


నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలను తెలపండి?    - చరణ్, గద్వాల

 అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) పలు డిజైన్ స్పెషలైజేషన్‌లను డిప్లొమా, పీజీ డిప్లొమా రూపంలో అందిస్తోంది. వాటిలో ప్రధానమైనవి1.గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డిజైన్: ఇది నాలుగేళ్ల కోర్సు. ఇందులో ప్రొడక్ట్ డిజైన్, ఫర్నీచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, సెరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ అండ్ టెక్స్‌టైల్ డిజైన్‌లు స్పెషలైజేషన్లుగా ఉన్నాయి.

 

 అర్హత: 10 +2

 2.పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజైన్: ఇది రెండున్నరేళ్ల కోర్సు. ఇందులో ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆటోమోబైల్ డిజైన్., టాయ్ అండ్ గేమ్ డిజైన్, ఫోటోగ్రఫీ డిజైన్, అపారెల్ డిజైన్, లైఫ్ స్టైల్ యాక్సెసరీ డిజైన్, న్యూ మీడియా డిజైన్ అండ్ స్ట్రాటజిక్ డిజైన్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లుగా ఉంటాయి.

 అర్హత: డిగ్రీ (డిజైన్ స్పెషలైజేషన్).



 పై రెండింటిలో ప్రవేశానికి రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది.

 కోర్సు పూర్తయిన తర్వాత స్పెషలైజేషన్ ఆధారంగా మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, ఫ్యాషన్, ఆర్కిటెక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఇంటీరియర్ డిజైనింగ్, అడ్వర్టైజింగ్, ఐటీ రంగాల్లో ఉద్యోగం సంపాదించవచ్చు.

 వెబ్‌సైట్: http//:www.nid.edu

 

 పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ గురించి వివరిస్తారా? దీన్ని ఎవరు నిర్వహిస్తారు?

 - మధు, షాద్‌నగర్

 పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ ఆధారిత అకడెమిక్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్. యూకే, ఆస్ట్రేలియా విద్యాసంస్థల్లో ప్రవేశానికి దీన్ని నిర్వహిస్తారు. పరీక్ష రాయాలనుకునేవారు ముందుగా పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ అకడెమిక్ పేరున ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరీక్షకు సన్నద్ధం కావాలనుకునేవారికి పియర్సన్ సైట్‌లో స్టడీ మెటీరియల్ లభిస్తుంది. ఆన్‌లైన్ టెస్ట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా ప్రవేశం ఉంటుంది. పరీక్ష రుసుం: రూ. 9,350.

 వెబ్‌సైట్: www.pearsonpte.com

 

 అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఏయే కోర్సులను అందిస్తోంది. వాటి ప్రవేశ వివరాలు తెలియజేయండి?    - స్వాతిసింధు, శ్రీకాకుళం కర్ణాటకలో మొదటి స్వయం ప్రతిపత్తి యూనివర్సిటీ అజీం ప్రేమ్ యూనివర్సిటీ. ఈ సంస్థ అందిస్తోన్న కోర్సుల వివరాలు.మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్: కరిక్యులమ్ అండ్ పెడగాజీ, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్, స్కూల్ లీడర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్‌లో స్పెషలైజేషన్ చేయవచ్చు. ఇది రెండేళ్ల కోర్సు.

 

 అర్హత: ఏదైనా డిగ్రీ.

 మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ డెవలప్‌మెంట్: ఇది రెండేళ్ల ఫుల్‌టైమ్ కోర్సు. అర్హత: ఏదైనా డిగ్రీ.

 ఈ రెంటికీ ప్రవేశ పరీక్షతో పాటు ఇంటర్వ్యూలో  కనబరిచిన ఆధారంగా సీటు లభిస్తుంది. కోర్సు పూర్తి చేసినవారికి విద్యాసంస్థల్లో, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లో, ఎన్‌జీఓ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.

 వెబ్‌సైట్: http://azimpremjiuniversity.edu.in

 

 ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో చేరాలంటే ఎలా? వివరాలను తెలపండి?

 - రవి, హైదరాబాద్

 ప్రతిష్టాత్మకమైన ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ (ఎంఐసీఏ) అహ్మదాబాద్ లో ఉంది. 1991లో ఇది ఆవిర్భవించింది. ఈ సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు...

 

 ఎ)ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్-కమ్యూనికేషన్స్

 అర్హతలు: కమ్యూనికేషన్, జర్నలిజం, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్ సబ్జెక్టులతో కూడిన హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్/బిజినెస్ మేనేజ్ మెంట్‌లో 55 శాతం ఉత్తీర్ణత లేదా ఇంటర్ తర్వా త జర్నలిజం, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్ ప్రధాన సబ్జెక్టులుగా హ్యుమానిటీస్/ సోషల్ సెన్సైస్/ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీలో 55 శాతం మార్కులు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/మీడియా ఇనిస్టిట్యూషన్ నుంచి మాస్ కమ్యూనికేషన్/ మేనేజ్‌మెంట్‌లో ఎంఫిల్/ నెట్/ జేఆర్‌ఎఫ్(యూజీసీ) క్వాలిఫై అయిన అభ్యర్థులకు ప్రాధాన్య ముంటుంది.

 

 ప్రవేశ విధానం: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబరచాలి. అలాగే హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, కమ్యూనికేషన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టులుగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం, మేనేజ్‌మెంట్‌లో ఎంఫిల్/నెట్/జేఆర్‌ఎఫ్ (యూజీసీ) లేదా గుర్తింపు పొందిన కమ్యూనికేషన్ మీడియా ఇనిస్టిట్యూ షన్‌లో పరిశోధనా అనుభవం.

 

 ప్రవేశం: రాత, మౌఖిక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

 బి)మేనేజ్‌మెంట్ - కమ్యూనికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా

 అర్హతలు: డిగ్రీలో 50 శాతంతో ఉత్తీర్ణత. ప్రవేశం: ఎంఐసీఏ ప్రవేశ పరీక్ష, గ్రూప్ ఎక్స్‌పీరియన్స్, వ్యక్తిగత ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది.సి)క్రాఫ్టింగ్ క్రియేటివ్ కమ్యూనికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అర్హత: గ్రాడ్యుయేషన్, ప్రవేశ పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.డి)ఆన్‌లైన్ విధానంలో ఎంఐసీఏ నిర్వహిస్తున్న కోర్సులు: అడ్వర్టైజింగ్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్, రిటైల్ మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్‌లో పీజీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్

     వెబ్‌సైట్: http://www.mica.ac.in

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top