సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా కోరుకొండ.. చిత్తూరు జిల్లా కలికిరిలోని సైనిక పాఠశాలలు 2015-16 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నాయి.

 

 ఆ వివరాలు...

 సీట్లు: కోరుకోండ:  ఆరో తరగతి-90, తొమ్మిదో తరగతి-25, కలికిరి-ఆరో తరగతి-105.

 

 అర్హతలివే:

 ఆరో తరగతిలో ప్రవేశానికి: విద్యార్థులు పదేళ్లు పూర్తి చేసుకుని పదకొండేళ్లలోపు ఉండాలి. ప్రస్తుత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జూలై 2, 2004 - జూలై 1, 2005 మధ్య జన్మించి ఉండాలి.

 తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి: పదమూడేళ్లు నిండి పధ్నాలుగేళ్లోపు అంటే జూలై 2, 2001- జూలై 1, 2002 మధ్య జన్మించి ఉండాలి. తొమ్మిదో తరగతిలో ప్రవేశం నాటికి గుర్తింపు పొందిన పాఠశాలలో ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత చెందినట్లు ధృవ పత్రం తప్పనిసరి.

 

 ప్రవేశ విధానం:

 ప్రవేశ విధానంలో రెండు దశలు ఉంటాయి. అవి..

 1. ప్రవేశ పరీక్ష, 2. ఇంటర్వ్యూ. ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూ దశకు అర్హత కల్పిస్తారు.  

 

 పరీక్ష తీరు:

 ఆరు, తొమ్మిది తరగతుల కోసం వేర్వేరుగా పరీక్ష జరుగుతుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీతోపాటు గుర్తింపు పొందిన ఆధికారిక భాషల్లో ఉంటుంది. ఆరో తరగతి  ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్‌తోపాటు గుర్తింపు పొందిన ఆధికారిక భాషల్లో రూపొందిస్తారు.  తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష పత్రం మాత్రం ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది.  

 

 పరీక్షకు సన్నద్ధమిలా

 ఈ రెండు పరీక్షల్లో అడిగే ప్రశ్నల స్థాయి విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న తరగతుల సిలబస్ మేరకే ఉంటుంది. లాంగ్వేజ్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఇంగ్లిష్ భాషపై ఉన్న ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. ఇంటెలిజెన్స్ టెస్ట్‌లో జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి.

 

 ఆరో తరగతి:  

 ఇంగ్లిష్: వ్యాసరచన (ఎస్సే రైటింగ్), కాంప్రెహెన్షన్, వొకా బ్యులరీ, జెండర్, యాంటినామ్స్, సినానిమ్స్, సెంటెన్సెస్,  వెర్బ్ ఫామ్స్, నౌన్స్, యాడ్‌వెర్బ్స్, గ్రమెటికల్ స్ట్రక్చర్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

 మ్యాథమెటిక్స్: ఇందులో నంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్, డెసిమల్స్, కమర్షియల్ మ్యాథమెటిక్స్, మెన్సురేషన్, జామెట్రీ (ప్రాథమిక భావనలు) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

 

 తొమ్మిదో తరగతి:

 ఈ పేపర్ కోసం ఎనిమిదో తరగతి వరకు సోషల్ స్టడీస్ (జాగ్రఫి, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్), సైన్స్ (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లలో అన్ని అంశాలను చదవాలి. మ్యాథమెటిక్స్‌లో స్క్వేర్స్, క్యూబ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పాలినామిల్స్, సర్కిల్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, స్టాటిస్టిక్స్ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ఇంగ్లిష్‌లో ఎస్సే రైటింగ్, కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ, జెండర్, యాంటినామ్స్, సినానిమ్స్, సెంటెన్సెస్, వెర్బ్ ఫామ్స్, నౌన్స్, యాడ్‌వెర్బ్స్, గ్రామెటికల్ స్ట్రక్చర్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలను సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా రూపొందిస్తారు. ఈ నేపథ్యంలో ఆరో తరగతి విద్యార్థులు..సీబీఎస్‌ఈ ఐదో తరగతి పుస్తకాలను, తొమ్మిదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి పుస్తకాలను చదవడం ప్రయోజనకరం.

 

 రాత పరీక్ష తర్వాత:

 రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ దశకు 50 మార్కులు కేటాయించారు. ఇందుకోసం 1:3 నిష్పత్తిలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులకు ఇంటర్వ్యూ మార్కులను కలుపుతారు.

 

 దరఖాస్తు ఇలా:

 ‘ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, కోరుకొండ, విజయనగరం,ఆంధ్రప్రదేశ్’,‘ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, కలికిరి,చిత్తూరు,ఆంధ్ర ప్రదేశ్’ ,పేరిట ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చెల్లుబాటు అయ్యేలా రూ. 475 డీడీ (ఎస్సీ, ఎస్టీలకు రూ.  325) తోపాటు సొంత చిరునామా గల కవరుని జత చేసి స్కూల్ చిరునామాకు పోస్టల్ ద్వారా మాత్రమే పంపి దరఖాస్తు పొందొచ్చు.

 

 ముఖ్య సమాచారం

 రాత పరీక్ష తేదీ: జనవరి 4, 2015.

 దరఖాస్తుల లభ్యత: నవంబర్ 29, 2014.

 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 06, 2014.

 వెబ్‌సైట్: www.sainikschoolkorukonda.org

 

 తొమ్మిదో తరగతి పరీక్ష విధానం

 విభాగం            మార్కులు  

 1. మ్యాథమెటిక్స్  అండ్ సైన్స్    275

 2. ఇంగ్లిష్  అండ్ సోషల్ సెన్సైస్    175

 మొత్తం            450

 మార్కుల విభజన ఇలా ఉంటుంది. మ్యాథమెటిక్స్    -200 మార్కులు, సైన్స్-75 మార్కులు, ఇంగ్లిష్       -100 మార్కులు, సోషల్ స్టడీస్-75 మార్కులు.

 

 ఆరో తరగతి పరీక్ష  విధానం

 విభాగం            మార్కులు  

 1. మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్    200

 2. ఇంటెలిజెన్స్ టెస్ట్    100

 మొత్తం    300

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top