ఎంఏ సోషియాలజీ కోర్సు..


ఎంఏ సోషియాలజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు, కోర్సు పూర్తయ్యాక ఉద్యోగావకాశాలను వివరించండి?

 - పావని, మధిర

 విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. సోషియాలజీలో ఎంఏ కోర్సును అందిస్తోంది.

 అర్హత: బీఏ/ బీకాం/ బీఎస్సీ/ హోంసైన్స్‌లో బీఎస్సీ/ బీఎస్సీ అగ్రికల్చర్/ బీఎస్సీ నర్సింగ్/ బీబీఎం/ బీసీఏ/ బీఏఎల్.ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం.. సోషియాలజీలో ఎంఏ కోర్సును అందిస్తోంది.

 అర్హత: డిగ్రీ

 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

 వెబ్‌సైట్: www.svuniversity.ac.in

 హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. సోషియాలజీలో ఎంఏ కోర్సును అందిస్తోంది.

 అర్హత: కనీసం 40 శాతం మార్కులతో బీఏ/బీకాం/బీఎస్సీ.

 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

 వెబ్‌సైట్: ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ

 ఉద్యోగావకాశాలు: అడ్వర్‌టైజింగ్, మార్కెటింగ్, పబ్లిషింగ్, జర్నలిజం వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యా, పరిశోధన, ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసుపత్రులు, కౌన్సెలింగ్ కేంద్రాలు, కరెక్షన్ సెల్స్, వృద్ధాశ్రమాలు, రూరల్ హెల్త్, బిజినెస్ సంస్థల్లోని హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నత హోదాలు పొందవచ్చు.

 న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?

 -సుమన్, తాడేపల్లిగూడెం

 న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ నిపుణులు మనుషుల వయసు, జెండర్, వారు చేసే వృత్తి ఆధారంగా ఎటువంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తారు.

 ఈ కోర్సును అందించే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు:

 అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్.. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లతో మాస్టర్స్ డిగ్రీని అందిస్తోంది.

 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ.

 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

 వెబ్‌సైట్: www.sssihl.edu.in

 ైెదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం.. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.

 అర్హత: అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ డెయిరీలో కనీసం 50 శాతం మార్కులతో బీటెక్/బీవీఎస్సీ/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్/ హోంసైన్స్‌లో బీఎస్సీ లేదా అగ్రికల్చర్/సెరీకల్చర్/హార్టీకల్చర్/ ఫారెస్ట్రీలలో బీఎస్సీ/బీఎఫ్‌ఎస్సీ

 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

 వెబ్‌సైట్: www.angrau.ac.in

 హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా గుర్తింపు పొందిన కళాశాలలు న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్‌లో బీఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

 అర్హత: ఇంటర్మీడియెట్/10+2

 హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది. అర్హత: డిగ్రీ

 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

 వెబ్‌సైట్: www.osmania.ac.in

 విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.

 అర్హత: ఏదైనా ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.

 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 

 ఉద్యోగావకాశాలు: ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ, ప్యాకేజింగ్, ఫిషరీస్, బేబీ ఫుడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆసుపత్రులు, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ లాంటి వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

 

 బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?

 - వినోద్, రంగారెడ్డి

 బయోమెడికల్ ఇంజనీరింగ్.. ఇది బయాలజీ, టెక్నాలజీల సమ్మేళనం. మెడికల్ రంగంలో ఇంజనీరింగ్‌ను ఉపయోగించి తయారుచేసిన ఉత్పత్తులు.. డిజిటల్ థర్మామీటర్, పేస్‌మేకర్, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ మెషీన్లు, గ్లూకోమీటరు. ఇందులో మెడికల్, క్లినికల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైక్రోప్రాసెసర్ల లాంటి సబ్జెక్టులు ఉంటాయి. బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెస్, మెడికల్ ఎంబెడెడ్ సిస్టమ్స్,బయోమెకానిక్స్, మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, బయో మెటీరియల్స్, బయో-నానో టెక్నాలజీ, రీహాబిలిటేషన్ ఇంజనీరింగ్ లాంటి స్పెషలైజేషన్లు ఈ కోర్సులో అందుబాటులో ఉన్నాయి.

 విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది.

 అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.

 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ కోర్సును అందిస్తోంది.

     అర్హత: ఇంటర్మీడియెట్/10+2

 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

 వెబ్‌సైట్: www.osmania.ac.in

 

 ఉద్యోగావకాశాలు: మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో ఉద్యోగాలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆసుపత్రులు, డయాగ్నాస్టిక్ సెంటర్లు, పరిశోధన సంస్థలు, కేపీఓల్లో కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్, విప్రో, సెమైన్స్ మెడికల్, జీఈ హెల్త్‌కేర్, ఎల్ అండ్ టీ మెడికల్, ఫిలిప్స్ మెడికల్, బీపీఎల్ మెడికల్, నోవార్టిస్ హెల్త్‌కేర్ లాంటి కంపెనీలు బయోమెడికల్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top