ఉద్యోగాలు


పుదుచ్చేరి నిట్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

 పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్  ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి  ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

 

పోస్టు: ఫ్యాకల్టీ, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్

విభాగాలు:  ఫ్యాకల్టీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్,

నాన్ -టీచింగ్: ఎలక్ట్రికల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ

ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 30, జూలై 1, 2, 3

వివరాలకు: www.nitpy.ac.in

 

రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్

రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ట్యూటర్/ క్లినికల్  ఇన్‌స్ట్రక్టర్ (నర్సింగ్) పోస్టుల భర్తీకి  దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

దరఖాస్తుకు చివరి తేది: జూలై 14

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

వివరాలకు: www.aiimsraipur.edu.in

 

విజయనగరం జిల్లాలో 39 పోస్టులు

 విజయనగరం జిల్లా సెలక్షన్ కమిటీ..  వ్యవసాయశాఖలో  కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో బహుళ ప్రయోజన విస్తరణాధికారి (ఎంపీఈఓ)  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఖాళీలు: 39

అర్హత:  బీఎస్సీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ) చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది.

వయసు: జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 40 సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 25

వివరాలకు: www.vizianagaram.nic.in

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top