104 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో

104 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో


అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది.సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో భారత కీర్తి పతాకం మరోమారు రెపరెపలాడింది. అమెరికా, రష్యాలాంటి అగ్ర దేశాలు సైతం చేయని సాహసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేసింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను దిగ్విజయంగా నింగిలోకి పంపి మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 104 ఉపగ్రహాలతో నిప్పులు చెరుగుతూ భారత అంతరిక్ష నౌక పీఎస్‌ఎల్‌వీ – సి37 నింగిలోకి దూసుకుపోతుంటే...



యావత్‌ ప్రపంచం నిబిడాశ్చర్యంతో భారత్‌వైపు చూసింది!!

ఫిబ్రవరి 15, 2017 బుధవారం ఉదయం 9.28 నిమిషాలకు నెల్లూరుకు దగ్గరగా ఉన్న సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలోని ఫస్ట్‌ లాంచ్‌ పాడ్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ – సి37ను ఇస్రో ప్రయోగించింది. దీని ద్వారా భారత్‌కు చెందిన 3 ఉపగ్రహాలను, 101 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది.



పీఎస్‌ఎల్‌వీ–సి37 విజయంతో పీఎస్‌ఎల్‌వీ జైత్రయాత్ర మరింత ముందుకు సాగింది. ధ్రువ, సూర్యానువర్తిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించే లక్ష్యంతో 1982లో ఇస్రో పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1993 సెప్టెంబర్‌ 20న నిర్వహించిన మొదటి ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. కానీ ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడకుండా పీఎస్‌ఎల్‌వీ–సి 37 సహా మొత్తం 38 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి.



ఒకటి కంటే ఎక్కువ ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించగలగడం రెండో కార్యాచరణ ప్రయోగం (్కSఔVఇ2) తోనే ఇస్రో ప్రారంభించింది. అంతే కాకుండా ఈ ప్రయోగంలోనే విదేశీ (జర్మనీ, కొరియా) ఉపగ్రహాలను కూడా ఇస్రో ప్రయోగించింది. అప్పటి నుంచి మొదలైన విదేశీ ఉపగ్రహాల ప్రయోగాన్ని ఇస్రో నేటికీ కొనసాగిస్తూనే ఉంది. 2008 ఏప్రిల్‌ 28న పీఎస్‌ఎల్‌వీ– సి9 ద్వారా ఒకే సారి 10 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఆ తర్వాత 2016 జూన్‌ 22న పీఎస్‌ఎల్‌వీ సి–34 ద్వారా కార్టోశాట్‌ 2–సి సహా 20 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. నాసా కూడా ఒకేసారి అత్యధికంగా 29 ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించింది. రష్యా కూడా గతేడాది ఒకే సారి అత్యధికంగా 37 ఉపగ్రహాలను ప్రయోగించింది.



 ఎక్సెల్‌ రూపంలో..

పీఎస్‌ఎల్‌వీ–సి 37ను ఇస్రో ఎక్సెల్‌ రూపంలో ప్రయోగించింది. మొదటి దశ చుట్టూ ఆరు భారీ స్ట్రాప్‌ ఆన్‌ మోటార్లు కలిగిన పీఎస్‌ఎల్‌వీ సి–37.. 44.4 మీటర్ల పొడవు, 320 టన్నుల బరువు ఉంది. ఇది నాలుగంచెల నౌక. దీని మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని, మళ్లీ మూడో దశలో ఘన, నాల్గో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. మొదటి దశ చుట్టూ ఉన్న ఆరు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్లలో కూడా ఘన ఇంధనాన్ని ఉపయోగించారు. నాల్గో దశపై ఎక్యుప్‌మెంట్‌బే∙ఉంటుంది. దానిపై ఉన్న అడాప్టర్‌పై ఉపగ్రహాలను అమరుస్తారు.సరిగ్గా ఫిబ్రవరి 15, బుధవారం ఉదయం 9.28 నిమిషాలకు ముందుగానే అనుకున్న విధంగా లిఫ్ట్‌ ఆఫ్‌ మొదలైంది. లిఫ్ట్‌ఆఫ్‌ జరిగిన ఒక నిమిషం 32 సెకన్లకు మొదటి చుట్టూ ఉన్న ఆరు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్లు పూర్తిగా మండాయి. లిఫ్ట్‌ ఆఫ్‌ జరిగిన 17 నిమిషాల తర్వాత కార్టోశాట్‌–2 సిరీస్‌ ఉపగ్రహం 510 కి.మీ. సూర్యానువర్తిత కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 10–11 సెకన్ల మధ్య ఐNS1అ – ఐNS1ఆ ఉపగ్రహాలు కూడా నౌక నుంచి విడిపోయాయి. ఆ తర్వాత సుమారు 10 సెకన్లకు (లిఫ్ట్‌ ఆఫ్‌ జరిగిన 18 నిమిషాల 33 సెకన్లుకు) జతలుగా విదేశీ నానో ఉపగ్రహాలు నౌక నుంచి వేరుపడటం మొదలై, చివరకు లిఫ్ట్‌ ఆఫ్‌ జరిగిన 28 నిమిషాల 43 సెకన్లకు అన్ని నానో ఉపగ్రహాలు నౌక నుంచి వేరుపడి కక్ష్యలోకి ప్రవేశించాయి.



మొత్తం మీద 1380 కిలోగ్రాముల బరువున్న 104 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ–సి37 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.పీఎస్‌ఎల్‌వీ–సి37 ద్వారా ప్రయోగించిన ప్రధాన పేలోడ్‌ కార్టోశాట్‌–2 సిరీస్‌ ఉపగ్రహం. కార్టోగ్రఫీ ఉపగ్రహాల్లో ఇది ఐదోది కాగా, కార్టోశాట్‌–2 సిరీస్‌లో నాల్గోది. దీన్ని కార్టోశాట్‌–2డి అని కూడా అంటారు. దీన్ని తొలుత 505 కి.మీ ధ్రువ సూర్యానువర్తిత కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీలోని నాల్గో దశ ప్రయోగించింది. దీని బరువు 714 కిలోలు, జీవిత కాలం 5 ఏళ్లు. భూమి ఉపరితల చిత్రీకరణ విజ్ఞానం కార్టోగ్రఫీ. దీని ద్వారా బహుళ ప్రయోజనాలుంటాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీర ప్రాంతాల్లో నేల వినియోగం, దాని నియంత్రణ, రోడ్డు రవాణ వ్యవస్థ పర్యవేక్షణ, నీటి విస్తరణ అధ్యయనం, నేల వినియోగ పటాలను తయారు చేయడం లాంటి అనేక అనువర్తనాలుంటాయి.  భూ వినియోగ సమాచార వ్యవస్థతో పాటు భౌగోళిక సమాచార వ్యవస్థ (Geographicl Information System)  అనువర్తనాలు అనేకం ఉంటాయి. ఈ ఉపగ్రహాల్లో ప్రధానమైన రెండు పెలోడ్‌లు ఉన్నాయి. అవి.. ప్యాన్‌ క్రొమోటిక్‌ కెమెరా, మల్టీస్పెక్ట్రల్‌ కెమెరా. కార్టోశాట్‌–2 సిరీస్‌ ఉపగ్రహాలకు అదనంగా రెండు ఇతర నానో ఉపగ్రహాలను భారత్‌ దీని ద్వారా ప్రయోగించింది. వీటిని ISRO Nano Satellites (INS) అంటారు. ఇవి రెండూ INS-1A, INS -1B



ఇస్రో అభివృద్ధి చేసిన ఐఎన్‌ఎస్‌ వ్యవస్థ లక్ష్యాలు

తక్కువ ఖర్చుతో పది కిలోలలోపు నానో ఉపగ్రహాలను నిర్మించడం. టెక్నాలజీ పరీక్షించే పేలోడ్లకు అవకాశమివ్వడం.విశ్వవిద్యాలయాలు, పరిశోధన, అభివృద్ధి సంస్థలకు సరికొత్త పేలోడ్ల అభివృద్ధికి అవకాశమివ్వడం.ఐఎన్‌ఎస్‌–1ఎ: దీని లిఫ్ట్‌ఆఫ్‌బరువు 8.4 కిలోలు. దీనిలో రెండు పేలోడ్‌ పరికరాలున్నాయి. ఒకటి అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన surface bidirectional reflectance distribution function radiometer.  భూమి ఉపరితలం నుంచి జరిగే సౌర పరావర్తనాన్ని ఇది అధ్యయనం చేస్తుంది.  రెండోది  Single Event Upset Monitor (SEUM). దీన్ని కూడా స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ అభివృద్ధి చేసింది. రోదసి వాతావరణంలో అధిక శక్తి వికిరణ ప్రభావాలను ఇది అధ్యయనం చేస్తుంది.



ఐఎన్‌ఎస్‌–1బి: దీని బరువు 9.7 కిలోలు దీనిలో కూడా రెండు పెలోడ్లు ఉన్నాయి. మొదటిది Earth Exosphere Lyman Alpha Analyser (EELA). దీన్ని బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్స్‌ సిస్టమ్స్‌ ((LEOS) అభివృద్ధి చేసింది. ఇది లైమన్‌ ఆల్ఫా కిరణాల ప్రవాహాన్ని గుర్తిస్తుంది. రెండోది ఒరిగామి కెమెరా. దీన్ని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ అభివృద్ధి చేసింది. ఇది ఒక రిమోట్‌ సెన్సింగ్‌ కలర్‌ కెమెరా.  - INS-1A, INS-1B ఉపగ్రహాల జీవిత కాలం 6 నెలలు.



PSLV-C37 ద్వారా ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాలు

అమెరికాకు చెందినవి– 96: వీటిలో 88 డోవ్‌ ఉపగ్రహాలు. ఈౌఠ్ఛి ఊlౌఛిజు3్క అనే ఈ 88 నానో ఉపగ్రహాలు రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు. ప్రతి రోజూ భూమి మొత్తాన్ని కనిపెట్టుకొని ఉండే ఈ ఉపగ్రహాలు వాణిజ్య, పర్యావరణ, మానవత అవసరాలకు ఉపయోగపడతాయి. వీటిని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్లానెట్‌ ఇంక్‌ అనే సంస్థ రూపొందించి, నిర్మించింది. వీటి విధులను ఈ సంస్థ నిర్వహిస్తుంది.



ఉపగ్రహాలు–8: ఇవి కూడా అమెరికాకు చెందినవే. ఈ నానో ఉపగ్రహాలను స్పైర్‌ గ్లోబల్‌ అనే సంస్థ నిర్మించింది. సముద్ర నౌకలను గుర్తించి దిశా నిర్దేశం అందించే ప్రత్యేక అu్టౌఝ్చ్టజీఛి ఐఛ్ఛీn్టజీజజీఛ్చ్టిజీౌn Syట్ట్ఛఝకు ఈ ఉపగ్రహాలు తోడ్పడతాయి. అదనంగా వాతావరణ సమాచార సేకరణకు ఉపయోగపడతాయి.



ఇతర దేశాలకు చెందిన 5 నానో ఉపగ్రహాలు: నెదర్లాండ్స్‌కు చెందిన ్కఉఅSS (పియస్‌) ఉపగ్రహం బరువు 3 కిలోలు. ఇన్నోవేటివ్‌ సొల్యూషన్స్‌ ఇన్‌ స్పేస్‌ బివి అనే యూరోపియన్‌ సంస్థ నిర్మించింది.



ఇజ్రాయిల్‌కు చెందిన బిజియుశాట్‌ (బరువు 4.3 కిలోలు). బెన్‌ గురియోన్‌ విశ్వవిద్యా లయం సహకారంతో ఇజ్రాయిల్‌ ఏరోస్పోస్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చేసింది.



కజకిస్తాన్‌కు చెందిన అల్‌–ఫరాబి–1 (బరువు 1.7 కిలోలు). దీన్ని కజక్‌  జాతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది.



యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన నయాఫ–1 (బరువు 1.1 కిలోలు). దీన్ని దుబాయ్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ స్పేస్‌ అనే సంస్థ నిర్మించింది. అత్యాధునిక టెక్నాలజీ అభివృద్ధిని పరీక్షించేందుకు పై నాలుగు ఉపగ్రహాలను ఉద్దేశించారు.  



స్విట్జర్లాండ్‌కు చెందిన ఈఐఈౖ2 (బరువు 4.3 కిలోలు). దీన్ని స్పేస్‌ ఫార్మా అనే సంస్థ నిర్మించింది. ఈ నానో ఉపగ్రహం మైక్రోగ్రావిటీ పరిశోధనకు ఉద్దేశించింది.



PSLV ఇటీవలి ప్రయోగాలు– ఉపగ్రహాలు

PSLV-C37: 2017 ఫ్రిబవరి  15  కార్టోశాట్‌ –2 సిరీస్‌ ఉపగ్రహం + ఇతర 103 నానో ఉపగ్రహాలు

PSLV-C36: 2016 డిసెంబర్‌ 7  రిసోర్స్‌ శాట్‌–2ఎ

PSLV-C35: 2016 సెప్టెంబర్‌ 26  స్కాట్‌శాట్‌–1 + 6 ఉపగ్రహాలు

PSLV-C34: 2016 జూన్‌ 22  కార్టోశాట్‌– 2సి + 19 ఉపగ్రహాలు

PSLV-C33: 2016 ఏప్రిల్‌ 28  ఐఖNSS1ఎ

PSLV-C32: 2016 మార్చి 10  ఐఖNSS1ఊ

PSLV-C31: 2016 జనవరి 20  ఐఖNSS1ఉ



సి.హరికృష్ణ

సివిల్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ

ఆర్‌.సి.రెడ్డి ఐఏఎస్‌

స్టడీ సర్కిల్‌


 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top