ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు


జాబ్ పాయింట్

అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు జూన్ 1లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.




అర్హతలు:  అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ (పైలట్) పోస్టులకు  కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. 10+2+3 విధానంలో ఇంటర్ వరకు మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 60 శాతం మార్కులు.



జనరల్ డ్యూటీ పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1996 మధ్య జన్మించిన పురుష అభ్యర్థులు అర్హులు  జనరల్ డ్యూటీ (పైలట్) పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1998 మధ్య జన్మించిన పురుష అభ్యర్థులు అర్హులు.   టెక్నికల్ బ్రాంచ్ (మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్)కు 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) సెక్షన్-ఎ, సెక్షన్-బిలో ఉత్తీర్ణత. టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1996 మధ్య జన్మించి ఉండాలి.

 

షార్ట్ సర్వీస్ నియామకాలు: 8ఏళ్ల కాలానికి జరిపే ఈ షార్ట్ సర్వీస్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల పదవీ కాలాన్ని పదేళ్లకు, పద్నాలుగేళ్లకు పొడిగించే వీలుంది.

 

పైలట్స్ (సీపీఎల్): 60 శాతం మార్కులతో  ఇంటర్ ఉత్తీర్ణత. దీంతోపాటు దరఖాస్తు చేసుకునే నాటికి డీజీసీఏ గుర్తింపు పొందిన కరంట్/వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లెసైన్స్ కలిగి ఉండాలి. 01 జూలై 1992 - 30 జూన్ 1998 తేదీల మధ్య జన్మించిన  స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు.



జనరల్ డ్యూటీ (ఉమెన్) పోస్టుకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. 10+2+3 విద్యా విధానంలో ఇంటర్ వరకు 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లను చదివి ఉండాలి. 01 జూలై 1992 - 30 జూన్ 1996 తేదీల మధ్య జన్మించిన  మహిళా అభ్యర్థులు అర్హులు.  రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు.

 

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  

ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ప్రిలిమినరీ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ దశను దాటిన వారికి తుది దశ పరీక్ష ఉంటుంది. వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

 

పోస్టుల వివరాలు

అసిస్టెంట్ కమాండెంట్‌లోని విభాగాలు..

అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ

అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ (పైలట్)

అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్)

అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్ (మెకానికల్/ఏరోనాటికల్)

అసిస్టెంట్ కమాండెంట్ (కమర్షియల్ పైలట్ లెసైన్స్ - ఎస్‌ఎస్‌ఏ)

అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ (ఉమెన్ -ఎస్‌ఎస్‌ఏ)

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top