ఆర్మీ ఉద్యోగాలకు మార్గాలివే..

ఆర్మీ ఉద్యోగాలకు మార్గాలివే..


 అనుక్షణం దేశ రక్షణ కోసం పాటుపడడంతోపాటు ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తోంది.. ఇండియన్ ఆర్మీ.. సవాళ్లను స్వీకరించే గుణం, దేశానికి రక్షణలో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు స్వాగతం పలుకుతోంది.. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీలో కెరీర్ పరంగా ఉండేఅవకాశాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియపై విశ్లేషణ..  ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్స్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్(జీసీవో), సోల్జర్ ఇలా పలు హోదాలు ఉంటాయి. వీటికి సంబంధించి నియామక ప్రక్రియ, అర్హతలను పరిశీలిస్తే..

 

 ఆఫీసర్ ఎంట్రీ:

 ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ హోదాలో పురుషులకు ప్రవేశం కల్పించే ఎంట్రీలు: ఇంటర్మీడియెట్ (యూపీఎస్సీ ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ ఎగ్జామ్, 10+2 టెక్నికల్ ఎంట్రీ), గ్రాడ్యుయేట్ యూపీఎస్సీ (సీడీఎస్ పరీక్ష), లా గ్రాడ్యుయేట్, ఇంజనీర్ (యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్, టీజీసీ, ఎస్‌ఎస్‌సీ టెక్), పోస్ట్‌గ్రాడ్యుయేట్.మహిళలకు ఆఫీసర్ హోదాలో ప్రవేశం కల్పించే ఎంట్రీలు: గ్రాడ్యుయేట్ నాన్ యూపీఎస్సీ (ఎస్‌ఎస్‌సీ ఎన్‌సీసీ), ఇంజనీర్ ఎంట్రీ, గ్రాడ్యుయేట్ యూపీఎస్సీ (సీడీఎస్ పరీక్ష), లా గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్.

 

 వివరంగా యూపీఎస్సీ ద్వారా:

 యూపీఎస్సీ ఏటా ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ ఎగ్జామ్ (అర్హత: 10+2 లేదా తత్సమానం), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (అర్హత: గ్రాడ్యుయేషన్) పరీక్షలను నిర్వహిస్తుం ది. ఈ పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా ఆర్మీలో ఆఫీసర్ హోదాలో అడుగుపెట్టొచ్చు. ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ నోటిఫికేషన్ ఏప్రిల్/మే, అక్టోబర్/నవంబర్‌లో, సీడీఎస్ నోటిఫికేషన్ ఆగస్టు, మార్చిలో ఏటా రెండుసార్లు వెలువడుతుంది. వెబ్‌సైట్: www.upsc.gov.in

 10+2 టెక్నికల్ ఎంట్రీ:  భర్తీ చేసే ఖాళీలు: 85.  అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో) లేదా తత్సమానం.

 వయసు: 16బీ - 19 ఏళ్లు. ఏడాదికి రెండుసార్లు ఏప్రిల్, సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది.

 

 ఇండియన్ మిలటరీ అకాడమీ:

 భర్తీ చేసే ఖాళీలు: 250.

 అర్హత: ఏదైనా డిగ్రీ.    వయసు: 19-24 ఏళ్లు.

 (యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా)

 

 టీజీసీ ఇంజనీర్స్:

 అర్హత: నిర్దేశించిన బ్రాంచ్‌లో బీఈ/బీటెక్.

 వయసు: 20-27 ఏళ్లు. ఏడాదికి రెండుసార్లు ఏప్రిల్, అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది.

 

 ఎస్‌ఎస్‌సీ నాన్‌టెక్ మెన్:

 భర్తీ చేసే ఖాళీలు: 175.

 అర్హత: డిగ్రీ.    వయసు: 19-25 ఏళ్లు.

 (యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా)

 

 టీజీసీ ఎడ్యుకేషన్ (ఏఈసీ):

 అర్హత: ఎంఏ/ఎంఎస్సీ.

 వయసు: 23-27 ఏళ్లు. ఏడాదికి రెండుసార్లు ఏప్రిల్, అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది.

 

 ఎస్‌ఎస్‌సీ నాన్ టెక్ ఉమెన్:

 భర్తీ చేసే ఖాళీలు: 175:    అర్హత: డిగ్రీ/పీజీ.

 వయసు: 19-25 ఏళ్లు. మార్చి/ఏప్రిల్, సెప్టెంబర్/అక్టోబర్‌లో ఏటా రెండుసార్లు నోటిఫికేషన్ వెలువడుతుంది

 

 జాగ్ మెన్:

 అర్హత: ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం. వయసు: 21-27 ఏళ్లు.

 

 ఎస్‌ఎస్‌సీ టెక్ మెన్:

 భర్తీచేసే ఖాళీలు: 50.

 అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ.

 వయసు: 20-27 ఏళ్లు. ఏప్రిల్, అక్టోబర్‌లో ఏడాదికి రెండుసార్లు నోటిఫికేషన్ వెలువడుతుంది.

 

 ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ మెన్:

 భర్తీచేసే ఖాళీలు: 50.

 అర్హత: ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం, ఎన్‌ఎన్‌సీ సీ సర్టిఫికెట్ ఎగ్జామ్‌లో కనీసం బి గ్రేడ్ ఉండాలి.

 వయసు: 19-25 ఏళ్లు. ఏప్రిల్, అక్టోబర్‌లో ఏడాదికి రెండు సార్లు నోటిఫికేషన్ వెలువడుతుంది.

 

 ఎస్‌ఎస్‌సీ టెక్ ఉమెన్:

 అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ.

 వయసు: 19-25 ఏళ్లు. డిసెంబర్/జనవరి, జూన్/జూలై లో ఏడాదికి రెండుసార్లు నోటిఫికేషన్ వెలువడుతుంది.

 

 ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ఉమెన్:

 అర్హత: ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం, ఎన్‌ఎన్‌సీ సీ సర్టిఫికెట్ ఎగ్జామ్‌లో కనీసం బి గ్రేడ్ ఉండాలి.

 వయసు: 19-25 ఏళ్లు.  ఏప్రిల్, అక్టోబర్‌లో ఏడాదికి రెండు సార్లు నోటిఫికేషన్ వెలువడుతుంది.

 

 యూనివ ర్సిటీ ఎంట్రీ స్కీమ్:


 భర్తీచేసే ఖాళీలు: 60.

 అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ప్రీ-ఫైనలియర్.

 వయసు: 19 నుంచి 25 ఏళ్లు. ఏటా మేలో నోటిఫికేషన్ వెలువడుతుంది.

 

 భర్తీ ఇలా..

 ఆఫీసర్ పోస్టులకు యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలు.. మినహా మిగతా విభాగాల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. వచ్చిన దరఖాస్తుల్లోంచి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి నిర్దేశించిన సెంటర్‌లో సర్వీస్ సెలెక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ఐదు రోజులపాటు ఉంటుంది. ఇందు లో ఇంటలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్, డిస్కషన్ ఆఫ్ ది పిక్చర్, థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్,వర్డ్ అసోసియేషన్ టెస్ట్, సిచువేషన్ రియాక్షన్ టెస్ట్, సెల్ఫ్ డిస్‌క్రిప్షన్ టెస్ట్, గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్‌సైజ్, ప్రొగ్రెసివ్ గ్రూప్ టాస్క్ ఇండివిడ్యువల్ ఆబ్‌స్టకెల్, కమాండ్ టాస్క్ తదితర పరీక్షలు ఉంటాయి. అలహాబాద్, బెంగళూరు, భోపాల్‌లో సంబంధిత సెంటర్లు ఉన్నాయి. ఇందులో అర్హత సాధించిన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది నియామకాన్ని ఖరారు చేస్తారు.

 

 డాక్టర్లు

 ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్-పుణే నుంచి మెడిసిన్ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లను నేరుగా ఆర్మీలో పర్మినెంట్ కమిషన్డ్ మెడికల్ ఆఫీసర్స్‌గా నియమించుకుంటారు.అర్హత: 10+2/ఇంటర్మీడియెట్(బైపీసీ)

 వయసు: 17 ఏళ్లు. ఇందుకోసం ఏఐపీఎంటీ పరీక్షకు హాజరు కావాలి.

 వివరాలకు: http://aipmt.nic.in www.afmc.nic.in/

 

 మిలిటరీ నర్సింగ్ సర్వీస్

 మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌లో ప్రవేశించాలనుకునే వారి కోసం ఏటా ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు బీఎస్సీ(నర్సింగ్), డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సుల్లో చేరాలి. పుణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో బీఎస్సీ(నర్సింగ్) కోర్సును నిర్వహిస్తారు. డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు మాత్రం దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హాస్పిటల్స్‌లో శిక్షణనిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి మిలిటరీ నర్సింగ్ సర్వీస్ కమిషన్డ్ ప్రదానం చేస్తారు. అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(బైపీసీ). లేదా పదో తరగతితో జీఎన్‌ఎంతోపాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయోపరిమితి 17 - 25 ఏళ్లు. పెళ్లికాని యువతులు, భర్త నుంచి విడాకులు తీసుకున్నవారు, వితంతువులు అర్హులు. సంబంధిత నోటిఫికేషన్ సెప్టెంబర్/అక్టోబర్‌లలో వెలువడుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ మూడు దశలుగా ఎంపిక ఉంటుంది.

 

 రెండు సర్వీసులు

 ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి పర్మినెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ రెండు సర్వీసులు ఉంటాయి. పర్మినెంట్ కమిషన్ స్థాయిలో ఉన్నవారు పూర్తికాలం ఆర్మీలో సేవలు అందించాలి. అంటే ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్మెంట్ వరకు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ) ద్వారా ప్రవేశించిన వారికి పర్మినెంట్ కమిషన్ ర్యాంక్ ఇస్తారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయిన వారు నిర్దేశిత వ్యవధి మేరకు ఆర్మీలో సర్వీస్ చేయాలి. తర్వాత తప్పుకునే అవకాశం ఉంటుంది. నిబంధనల మేరకు దీన్ని పర్మినెంట్ కమిషన్‌గా కూడా మార్చుకోవచ్చు.

 

 సోల్జర్/జేసీవో అర్హతలు:

 సోల్జర్ జనరల్ డ్యూటీ:

 అర్హత: మెట్రిక్/ఎస్‌ఎస్‌ఎల్‌సీ.

 వయసు: 17బీ-21 ఏళ్లు

 సోల్జర్ టెక్నికల్:

 అర్హత: 10+2/ఇంటర్మీడియెట్(ఎంపీసీ).

 వయసు: 17బీ - 23 ఏళ్లు

 సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్:

 అర్హత: 10+2/ ఇంటర్మీడియెట్.

 వయసు: 17బీ - 23 ఏళ్లు

 సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్:

 అర్హత: 10+2/ఇంటర్మీడియెట్ (బైపీసీ).

 వయసు: 17బీ - 23 ఏళ్లు

 హవల్దార్ ఎడ్యుకేషన్:

 అర్హత: డిగ్రీ/పీజీతోపాటు బీఈడీ

 వయసు: 20-25 ఏళ్లు

 రెలిజియస్ టీచర్:

 అర్హత: ఏదైనా డిగ్రీ.

 వయసు: 27-34 ఏళ్లు

 జేసీవో కేటరింగ్:

 అర్హత: 10+2తోపాటు హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్‌లో డిప్లొమా/సర్టిఫికెట్.

 వయసు: 21 - 27 ఏళ్లు.

 సర్వేయర్ ఆటోమేటడ్ కార్టోగ్రాఫర్:

 అర్హత: బీఏ/బీఎస్సీ (మ్యాథ్స్)తోపాటు ఇంటర్‌లో కూడా మ్యాథ్స్ చదివి ఉండాలి.

 వయసు: 20-25 ఏళ్లు.

 

 ర్యాలీల ద్వారా

 ఆర్మీలో ప్రస్తుతం ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా జవాన్ల భర్తీ జరుగుతుంది. ఇందుకోసం రాష్ట్రం మొత్తం కాకుండా కొన్ని జిల్లాలకు కలిపి.. వాటికి సమీపంలో ఉండే ఒక ప్రదేశంలో నిర్దేశిత తేదీల్లో ర్యాలీ నిర్వహిస్తారు. దీని కోసం స్థానిక పత్రికలు, రేడియో, హోర్డింగ్స్, ఎగ్జిబిషన్ తదితరాల ద్వారా ప్రచారం చేస్తారు. ఇందులో ఫిజికల్ ఈవెంట్లు, సంబంధిత సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్ట్ వంటి అంశాలు ఉంటాయి.

 

 కొన్ని పోస్టులకు అవివాహితులు మాత్రమే అర్హులు.

 నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి.

 సంబంధిత నోటిఫికేషన్లను ఎంప్లాయిమెంట్‌న్యూస్, జాతీయ/స్థానిక దినపత్రికలతోపాటు ఆర్మీ

 వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు.

 వెబ్‌సైట్:http://joinindianarmy.nic.in

 

 http://indianarmy.nic.in

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top