ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏఎఫ్‌సీఏటీ


ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ విభాగాల్లో కమిషన్డ్ ఆఫీసర్లుగా అడుగుపెట్టేందుకు వీలుకల్పించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ)కు నోటిఫికేషన్ విడుదలైంది.

 

 ఫ్లయింగ్ బ్రాంచ్

     వయసు: 2016, జూలై 1 నాటికి 20-24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

     విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్.గతంలో కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ (సీపీఎస్‌ఎస్)/ పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ)లో విఫలమైన వారు అనర్హులు.శారీరక ప్రమాణాలు: కనిష్ట ఎత్తు-162.5 సెం.మీ. దానికి తగ్గ బరువు ఉండాలి.



 టెక్నికల్ బ్రాంచ్

     వయసు: 2016, జూలై 1 నాటికి 20-26 ఏళ్ల మధ్య ఉండాలి.

     విద్యార్హతలు:

ఏరోనాటికల్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్): గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మైక్రోప్రాసెసర్స్ వంటి 18 సబ్జెక్టుల్లో కనీసం ఎనిమిది సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత. మొత్తంమీద కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.



ఏరోనాటికల్ ఇంజనీర్ (మెకానికల్): గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఆటోమోటివ్ ఇంజనీరింగ్/ప్లాంట్ ఇంజనీరింగ్/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్; ఇంజనీరింగ్ మెకానిక్స్/స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్; ఏరో డైనమిక్స్ వంటి 18 సబ్జెక్టుల్లో కనీసం ఎనిమిది సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత.

     శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు- 157.5 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.

 

 గ్రౌండ్ డ్యూటీ బ్రాంచెస్

     వయసు: 2016, జూలై 1 నాటికి 20-26 సంవత్సరాలు.

     విద్యార్హతలు:

అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ బ్రాంచ్: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. లేదా కనీసం 50 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత.

అకౌంట్స్ బ్రాంచ్: కనీసం 60 శాతం మార్కులతో బీకామ్ లేదా కనీసం 50 శాతం మార్కులతో ఎంకామ్/సీఏ/ఐసీడబ్ల్యూఏ.

ఎడ్యుకేషన్ బ్రాంచ్: కనీసం 50 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ.

శారీరక ప్రమాణాలు: పురుషులకు కనిష్ట ఎత్తు-157.5 సెం.మీ, మహిళలకు 152 సెం.మీ. ఎత్తుకు తగిన బరువుండాలి.



 ఎంపిక ప్రక్రియ

ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ), ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ-టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు)లను 2015, సెప్టెంబర్ 13న నిర్వహిస్తారు.



ఏఎఫ్‌సీఏటీ పరీక్షను రెండు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.



ఏఎఫ్‌సీఏటీ తర్వాత టెక్నికల్ బ్రాంచ్ విద్యార్థులకు 45 నిమిషాల వ్యవధిలో ఈకేటీ నిర్వహిస్తారు.

ఏఎఫ్‌సీఏటీ/ఈకేటీలో ఉత్తీర్ణులైన వారికి డెహ్రాడూన్/ మైసూర్/వారణాసి/గాంధీనగర్/కంచరపారాలలోని ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డ్స్(ఏఎఫ్‌ఎస్‌బీ)తదుపరి పరీక్ష లు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు 3 దశల్లో నిర్వహిస్తారు.



స్టేజ్-1లో మొదటి రోజు ఇంటెలిజెన్స్ టెస్ట్‌తోపాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే స్టేజ్-2 పరీక్షలకు అర్హులు. స్టేజ్-2లో అయిదు రోజుల పాటు సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్స్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫ్లైయింగ్ బ్రాంచ్‌కు అర్హులైన అభ్యర్థులకు సీపీఎస్‌ఎస్ (కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం) లేదా పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ) నిర్వహిస్తారు.



వైద్య పరీక్షలు: ఏఎఫ్‌ఎస్‌బీ సిఫార్సు చేసిన అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఏఎఫ్‌సీఎంఈ లేదా ఐఏఎం బెంగళూరులో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి మెరిట్ లిస్ట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2015, జూలై 23.

కోర్సు ప్రారంభం: 2016, జూలై.

వెబ్‌సైట్: www.careerairforce.nic.in

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top