సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3ఎలా పిపేరవ్వాలి?

సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3ఎలా పిపేరవ్వాలి?


కాంపిటీటివ్ కౌన్సెలింగ్:  సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని ఏవిధంగా ప్రిపేరవ్వాలి?

 - టి. నాగమణి, అల్వాల్.


 జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకనమిక్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అనే అంశాలున్నాయి. వీటి నుంచి 25 ప్రశ్నలు అడుగుతున్నారు. సివిల్స్ 2013లో ఎకానమీ నుంచి 12 ప్రశ్నలు ఇవ్వగా, మిగిలిన అంశాల నుంచి 13 ప్రశ్నలు ఇచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, సెక్యూరిటీ, మేధో సంపత్తి హక్కులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ప్రశ్నలన్నీ దాదాపు సమకాలీన అంశాలపైనే ఉండటం గమనార్హం. మేధో సంపత్తి హక్కులు అనే అంశంలో 1970 నాటి భారత పేటెంట్ చట్టానికి 2005లో జరిగిన సవరణలకు కారణాలు అడుగుతూనే.. నోవార్టిస్ ఫైల్ చేసిన పేటెంట్స్‌ను తిరస్కరించడంలో సుప్రీంకోర్టు ఈ సవరణను ఎలా ఉపయోగించుకుందో వివరించమని ఇచ్చారు.

 

 డిజిటల్ సిగ్నేచర్, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ, క్రికెట్‌లో అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ మొదలైన వాటిని వివరించమని ప్రశ్నలు అడిగారు. సిలబస్‌లోని ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్‌లో భాగంగా అక్రమ మైనింగ్ అంటే ఏమిటి? అనే ప్రశ్న అడిగారు. సమకాలీన అంశాల్లో మరొకటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు. వీటి ద్వారా భద్రత ఏవిధంగా ప్రభావితమవుతుందో వివరించమని అడిగారు. సైబర్ సెక్యూరిటీలో భాగంగా.. సైబర్ వార్‌ఫేర్ అనేది ఉగ్రవాదం కంటే ఏవిధంగా తీవ్రమైంది? భారత్ ఏవిధంగా దాని ప్రభావానికి గురవుతోంది? భారత్‌లో ఈ అంశానికి చెందిన సంసిద్ధత ఎలా ఉంది? అని అడిగారు. ఇలా అన్ని ప్రశ్నలు దాదాపుగా సమకాలీన అంశాలతో ముడిపడి ఉన్నాయి.

 

 సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఇచ్చిన రెండు ప్రశ్నలు వైద్య రంగానికి సంబంధించినవి. ఆ రెండు ప్రశ్నలు ఇన్‌డెప్త్‌గా, వైద్య రంగంలో అసాధారణమైన పట్టు ఉన్నవారు తప్ప మిగిలినవారు సమాధానం రాయలేనివిధంగా ఉన్నాయి. ప్రశ్నలన్నీ సమకాలీన సమస్యలపై అప్లికేషన్ ఓరియంటెడ్ విధానంలో ఉంటున్నాయి. దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామంగా గుర్తించాలి. అభ్యర్థి సమగ్ర ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేసేలా ప్రశ్నల కూర్పు ఉంది. కాబట్టి అభ్యర్థులు ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలతోపాటు దానితో ముడిపడి ఉన్న వర్తమాన అంశాలన్నింటిపై అవగాహన పెంచుకోవాలి. దీనికోసం విస్తృతంగా అధ్యయనం చేయాలి. దినపత్రికల్లో వచ్చే విశ్లేషకుల ఆర్టికల్స్‌ను తప్పనిసరిగా చదవాలి.                    

 ఇన్‌పుట్స్: సి.హరికృష్ణ, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ

 

 జనరల్ నాలెడ్జ్

 అంతర్జాతీయ సంస్థలు

 ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్‌పోల్)

 ప్రధాన కార్యాలయం: లయోన్‌‌స (ఫ్రాన్‌‌స)

 ఏర్పాటైన సంవత్సరం: 1923, సభ్యదేశాల సంఖ్య: 184

 లక్ష్యం: సభ్య దేశాల్లోని పోలీసు వ్యవస్థలతో కలిసి సమన్వయంతో పనిచేయడం  

 

 అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA)

 ప్రధాన కార్యాలయం: వియన్నా (ఆస్ట్రియా)    

 ఏర్పాటైన సంవత్సరం: 1957. సభ్యదేశాల సంఖ్య: 138    

 లక్ష్యం:  అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించేలా చేయడం.  

  అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసన్ హోవర్ సూచనల మేరకు ఈ సంస్థ ఏర్పాటైంది.

  అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి సమర్థంగా కృషి చేసినందుకు 2005లో ఈ సంస్థకు, అధ్యక్షుడికి(ఎల్‌బరాది) నోబెల్ శాంతి బహుమతి లభించింది.

 

 ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్‌క్రాస్ (ICRC) ప్రధాన కార్యాలయం : జెనీవా (స్విట్జర్లాండ్)

 ఏర్పాటైన సంవత్సరం:    1864    

 లక్ష్యాలు: - రెడ్‌క్రాస్ సంస్థను స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డ్యూ నాంట్ ప్రారంభించాడు.

 ఇది అంతర్జాతీయ వైద్యసంస్థ. ప్రకృతి వైపరీత్యాలు, అంతర్యుద్ధాలు సంభవించినప్పుడు బాధితులకు ఉచితంగా, స్వచ్ఛందంగా వైద్య సేవలు అందింస్తుంది.

  రెడ్‌క్రాస్ సంస్థ చేసిన కృషికిగానూ మూడుసార్లు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

  రెడ్‌క్రాస్ సంస్థను ‘హ్యూమానిటేరియన్ లా కమిషన్’గా కూడా పిలుస్తారు.

 - 'Charity in war’ అనేది ఈ సంస్థ నినాదం.

 

 అంతరిక్ష శాస్త్ర విజ్ఞానంలో భారతదేశం

 ప్రాజెక్టు/ఉపగ్రహం: ఎరైస్ (ARISE) అగ్రికల్చరల్ రిసోర్సెస్ ఇన్వెంటరీ అండ్ సర్వే ఎక్స్‌పెరిమెంట్, సంవత్సరం: 1974

 వివరాలు:  ISRO, ICAR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్‌‌చ) ఉమ్మడి ప్రాజెక్టు

 అనంతపురం(ఆంధ్రప్రదేశ్), పాటియాలా జిల్లా (పంజాబ్)లో పంటల, భూమి  తీరుతెన్నులను పరిశీలించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం

 ప్రాజెక్టు/ఉపగ్రహం: ఆర్యభట్ట,  సంవత్సరం: 1975

 వివరాలు: ఒ భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఒ పూర్తిగా భారతీయ శాస్త్రవేత్తల రూపకల్పన

 బెంగళూరు సమీపంలో ఇస్రో ఉపగ్రహ కేంద్రంలోనే నిర్మాణం జరిగింది.  

 రష్యా రాకెట్ ద్వారా ప్రయోగించారు.

 ప్రాజెక్టు/ఉపగ్రహం: స్టెప్ (STEP) (శాటిలైట్ టెలి కమ్యూనికేషన్  ఎక్స్‌పెరిమెంట్ ప్రాజెక్టు), సంవత్సరం: 1977

 వివరాలు: ఇస్రో, తంతితపాల శాఖల సంయుక్త ప్రాజెక్టు

 జియో స్టేషనరీ ఉపగ్రహాల ద్వారా సమాచార వ్యవస్థను అభివృద్ధిపర్చడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top