ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ఎలా?


కాంపిటీటివ్ కౌన్సెలింగ్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ఎలా చేయాలో తెలపండి.      - పి.సుమ, సంతోష్‌నగర్

 

 ఆర్‌బీఐ 506 అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రకటన విడుదల చేసింది. ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్  www.rbi.org.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 ఫీజు చెల్లించాలి.

 

 ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజుకు చివరి తేదీ ఆగస్టు 6 కాగా, ఆఫ్‌లైన్‌లో చివరి తేదీ ఆగస్టు 11. రాత పరీక్షను ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ నాలుగో వారంలో నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ముందు అభ్యర్థి తన  ఫొటోగ్రాఫ్, సంతకాన్ని స్కాన్ చేయించుకోవాలి. ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఈ-మెయిల్ ఐడీ ఉండాలి. పరీక్షకు సంబంధించిన వివరాలు, కాల్ లెటర్ తదితరాలను ఆర్‌బీఐ ఈ-మెయిల్ ద్వారానే అభ్యర్థులకు పంపుతుంది. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత‘రిక్రూట్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్’ లింక్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్ కనిపిస్తుంది.

 

 ఆ తర్వాత ‘క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్’ లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థి తనకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అందులో పొందుపరచాలి. అభ్యర్థి పేరు, తండ్రి/ భర్త పేరు, పుట్టినతేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, పరీక్ష కేంద్రం, విద్యార్హతలు లాంటి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. స్పెల్లింగ్ ఏ మాత్రం తేడా ఉన్నా అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం ఉంటుంది. అన్ని వివరాలు పొందుపరిచాక, ఒకసారి పూర్తిగా పరిశీలించుకొని ‘ఫైనల్ సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఈ బటన్‌పై క్లిక్ చేశాక ఎలాంటి మార్పులు చేయడానికి ఆస్కారం ఉండదు. ఆ తర్వాత స్క్రీన్‌పై రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ కనిపిస్తాయి. వాటిని రాసి పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌లను అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల రూపంలోనూ తెలియజేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు ప్రతిని ప్రింటవుట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.

 

 ఫీజుల చెల్లింపు: మాస్టర్/ వీసా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత ఒక ఇ-రిసీప్ట్ జనరేట్ అవుతుంది.

 

  అభ్యర్థులు దీన్ని ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష ఫీజును ఆఫ్‌లైన్ విధానంలో ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా చెల్లించవచ్చు. అవి: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసంపూర్తిగా నింపిన దరఖాస్తులు, ఫొటో, సంతకం సరిగాలేని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం.

 ఇన్‌పుట్స్: ఎన్.విజయేందర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ


జనరల్ నాల్డెజ్

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top