నిత్యజీవితం-కర్బన సమ్మేళనాలు

నిత్యజీవితం-కర్బన సమ్మేళనాలు


ముఖ్య కర్బన సమ్మేళనాలు-

 వాటి చుట్టూ ఉన్న పదజాలం


 హైడ్రోకార్బన్లు: కార్బన్‌తో పాటు హైడ్రోజన్ మాత్రమే ఉన్న సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు. ఆల్కేనులను సంతృప్త హైడ్రోకార్బన్లు అని అంటారు. వీటిలో ఎలాంటి ద్విబంధం లేదా త్రిబంధాలు ఉండవు. మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్‌లు మొదటి నాలుగు ఆల్కేనులు. గోబర్ గ్యాస్, బయో గ్యాస్, సహజ వాయువుల్లో మీథేన్ వాయువు ప్రధానమైంది. వరి పొలం వంటి చిత్తడి నేలల నుంచి విడుదలయ్యే ‘మార్ష్ ,‘ బొగ్గు గనుల నుంచి వచ్చే ‘ఫైర్ క్యాంప్ వాయువులు మీథేన్‌కు మారు పేర్లు. అసంతృప్త హైడ్రోకార్బన్‌లలో ద్విబంధం ఉన్నవి ఆల్కీనులు ఉదా: ఇథిలీన్, త్రిబంధం ఉన్నవి ఆల్కైన్‌లు ఉదా: ఎసిటలీన్. కాయలు, పండ్లను కృత్రిమంగా పక్వం చెందించడానికి ‘ఆర్టిఫిషియల్ రిపెనర్’గా ‘ఇథిలీన్’ వాయువు వాడతారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి వ్యాపారులు ‘కార్బైడ్’ ఉండలుగా పిలిచే ‘కాల్షియం కార్బైడ్’ను ఉపయోగిస్తున్నారు. తేమ తగిలిన వెంటనే దీని నుంచి ‘ఎసిటలీన్’ విడుదలయి పండ్లు త్వరగా పక్వానికొచ్చేలా చేస్తుంది. ఇలాంటి పండ్లు ఆరోగ్యానికి హానికరం.

 

 చక్కెర నుంచి లభించే సుక్రోజ్, కాటన్, గడ్డి వంటి పదార్థాలు, అన్నం, గోధుమలు నుంచి లభించే స్టార్చ్ వంటి పదార్థాలను కార్బోహైడ్రేటులు అంటారు. ఇవి శక్తి జనకాలు.మాంసకృత్తులు ప్రధానంగా పప్పుధాన్యాలు, మాంసం, బఠానీలు వంటి పదార్థాల నుంచి లభిస్తాయి. వీటినే ప్రోటీన్లు అంటారు.వెంట్రుకలు, గోళ్లు, ఉన్నిలో కూడా ప్రోటీన్లు ఉంటాయి. ఇవి అమైనో ఆమ్లాలు, కార్బనిక అణువులతో నిర్మితమైవుంటాయి.నూనె గింజలు, నూనెలు, నెయ్యి, జంతువుల కొవ్వుల్లో ఉండే అణువులను ‘లిపిడ్’లు అంటారు. తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు కొవ్వులు. నూనెలను ై‘హెడ్రోజనీకరణం’ చేసి డాల్డా వంటి కొవ్వు పదార్ధాలను కృత్రిమంగా తయారుచేస్తారు.

 

 కార్బాక్సిలికామ్లం:

 ’ఇైైఏ’ సమూహం ఉన్న కార్బనిక సమ్మేళనాలను కార్బాక్సిలికామ్లాలు అంటారు. అధిక పరమాణు భారం ఉన్న కార్బాక్సిలికామ్లాలను ఫాటీ అమ్లాలు అని అంటారు.కొబ్బరి నూనె, వెన్నలోని ‘లారిక్ ఆమ్లం’, జంతువుల కొవ్వుల్లోని ‘స్టీరికామ్లం’, పత్తి, సోయా నుంచి లభించే ‘ఓలికామ్లం’ వీటికి ఉదాహరణలు.జీవకణాల మధ్య వార్తా హరులుగా పనిచేసే కార్బనిక అణువులనే ‘హార్మోన్’లు అంటారు. పురుష సెక్స్ హార్మోన్ ‘టెస్టోస్టిరాన్’, స్త్రీ సెక్స్ హార్మోన్ ‘ఈస్ట్రోజెన్’,‘ ప్రొజెస్టిరాన్’లతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే ‘థెరాక్సిన్’లు వీటికి ఉదాహరణ.

 

 మాదిరి ప్రశ్నలు

 

 1.    మత్తు కలిగించే వాయువు?

     1) మీథేన్        2) ఈథేన్

     3) ఇథిలీన్        4) ఎసిటిలీన్

 2.    మీథేన్‌కు సంబంధించి సరైన సమాచారం కానిది?

     1) గోబర్ గ్యాస్, సహజవాయు, బయోగ్యాస్‌లలో ప్రధాన అనుఘటం.

     2) ఎల్పీజీలో ప్రధాన అనుఘటకం.

     3) వరి పొలాల్లో విడుదలయ్యే మార్ష్ వాయువు.

     4) బొగ్గు గనుల్లో డేవీ ల్యాంప్‌తో గుర్తించే వాయువు.

 3.    ద్విబంధం గల కర్బన సమ్మేళనం?

     1) ఇథిలీన్        2) ఈథేన్

     3) ఎసిటలీన్1    4) మీథేన్

 4.    త్రిబంధం గల కర్బన సమ్మేళనం?

     1) ఇథిలీన్        2) ఈథేన్

     3) ఎసిటలీన్    4) ప్రొపేన్

 5.    అణుభారం పెరిగే క్రమం...

     1) మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్

     2) ఈథేన్, మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్

     3) బ్యూటేన్, ప్రొపేన్, ఈథేన్, మీథేన్

     4) ప్రొపేన్, బ్యూటేన్, ఈథేన్, మీథేన్

 6.    పండ్లు త్వరగా పక్వానికి రావడానికి దోహదపడే వాయువు?

     1) ఇథిలీన్        2) మీథేన్

     3) బ్యూటేన్    4) ఈథేన్

 7.    వెనిగార్ అనేది?

     1) విలీన ఎసిటికామ్లం    2) విలీన ఫార్మికామ్లం

     3) విలీన ఫార్మాల్డిహైడ్    4) ఏదీకాదు

 8.    మెడికల్ కాలేజీల్లో శవాలను భద్రపరిచేందుకు వాడే ‘పార్మాలిన్’ ఏంటి?

     1) 30% హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం.

     2) 30% ఎసిటికామ్ల ద్రావణం.

     3) 30% ఆల్కహాల్ ద్రావణం.

     4) 30% ఫార్మాల్డిహైడ్ ద్రావణం.

 9.    మాయిశ్చరైజర్‌గా వాడే ‘సమ్మేళనం’?

     1) ఇథిలీన్ గ్లైకాల్    2) గ్లిజరాల్

     3) ఫార్మాల్డిహైడ్    4) ఎసిటికామ్లం

 10.    బొద్దింకలు, సిల్వర్ ఫిష్‌ల నుంచి బట్టలను కాపాడటానికి వాడే డాంబర్ గోలీల్లో వాడే పదార్థం?

     1) కాంఫర్        2) నాఫ్తలీన్

     3) బెంజీన్        4) కెఫీన్

 11.    కింది వాటిలో సరైన జత?

     1) టీ    -    కెఫీన్

     2) కాఫీ    -    కెఫీన్

     3) సిగరెట్    -    నికోటిన్

     4) తేనె    -    ఫార్మికామ్లం

 12.    నిమ్మ, ఉప్పుల్లో ఉండేది?

     1) ఆస్కార్బికామ్లం    2) సిట్రికామ్లం

     3) ఎసిటికామ్లం    4) ఫార్మికామ్లం

 13.    జతపర్చండి.

     అ. చెరకు రసం    1) ఫ్రక్టోజ్

     ఆ. తేనె        2) సుక్రోజ్

     ఇ. బియ్యం     3) లాక్టోజ్

     ఈ. పాలు        4) స్టార్చ్

         అ    ఆ    ఇ    ఈ

     1)    1    2    3    4

     2)    4    3    2    1

     3)    1    2    4    3

     4)    2    1    4    3

 14.    బార్లీ లేదా స్టార్చ్‌ను కిణ్వ ప్రక్రియ చేస్తే లభించే ప్రధాన పదార్థం?

     1) మిథైల్ ఆల్కహాల్    2) ఎసిటికామ్లం

     3) ఫార్మికామ్లం    4) ఇథైల్ ఆల్కహాల్

 15.    అత్యంత తియ్యనైన చక్కెర?

     1) సుక్రోజ్        2) గ్లూకోజ్

     3) ఫ్రక్టోజ్        4) లాక్టోజ్

 16.    కాగితంలో ఉండే రసాయన పదార్థం?

     1) సెల్యులోజ్    2) స్టార్చ్

     3) షుగర్        4) ప్రోటీన్

 17.    కృత్రిమ తీపికారిణి కానిది?

     1) గ్లూకోజ్        2) శాక రిన్

     3) ఆస్పార్టేమ్    4) సుక్రలోజ్

 18.    కాప్యూల్స్‌పై పొర దేనితో తయారుచేస్తారు?

     1) ప్లాస్టిక్        2) సెల్యులోజ్

     3) స్టార్చ్        4) ప్రొటీన్

 19.    మూత్రపిండాలు పాడైన వారు ఏవి ఎక్కువగా తినకూడదు?

     1) కార్బొహైడ్రేట్లు    2) లిపిడ్‌లు

     3) ప్రొటీన్‌లు    4) మిటమిన్‌లు

 20.    వెజిటబుల్ ఆయిల్ నుంచి వనస్పతిని తయారుచేయటానికి వాడే వాయువు?

     1) ఆక్సిజన్        2) నైట్రోజన్

     3) హైడ్రోజన్    4) కార్బన్ డై ఆక్సైడ్

 21.    చక్కెర వ్యాధిగ్రస్తుని మూత్ర నమూనాలో ఉండేది?

     1) లాక్టోజ్        2) మాల్టోజ్

     3) గ్లూకోజ్        4) సుక్రోజ్

 22.    జతపర్చండి.

     అ. టెఫ్లాన్        1) పాలీవినైల్ క్లోరైడ్

     ఆ. పీవీసీ        2) పాలీక్లోరోఫ్లోరో ఇథిలీన్

     ఇ. ఫ్రియాన్‌లు     3) పాలీపెప్పైడ్

     ఈ. ప్రోటీన్        4) క్లోరోఫ్లోరో కార్బన్‌లు

         అ    ఆ    ఇ    ఈ

     1)    1    2    3    4

     2)    4    2     3    1

     3)    2    1    4    3

     4)    3    4    2    1

 23.    కొలస్ట్రాల్ ఒక----

     1) ఒక రకమైన క్లోరోఫిల్

     2) క్రోమియం హైడ్రాక్సైడ్

     3) క్లోరోఫాం డెరివేటివ్

     4) జంతు కొవ్వులలో ఉండే ఒక సమ్మేళనం

 24.    కింది వాటిలో సరైన జత?

     1) పప్పు దినుసులు-ప్రోటీన్లు

     2) బియ్యం, గోధుమలు, బార్లీ-కార్బొహైడ్రేట్లు

     3) నూనెగింజలు-కొవ్వులు

     4) కూరగాయలు-హార్మోన్‌లు

 25.    ఆర్టిఫీషియల్ సిల్క్ అని దేనికి పేరు?

     1) కాటన్        2) ఉన్ని

     3) సిల్క్        4) ఏదీకాదు

 26.    పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లటి రుచి రావడానికి కారణమైన పదార్థం?

     1) ఎసిటికామ్లం    2) ఫార్మికామ్లం

     3) లాక్టికామ్లం    4) ఆక్సాలికామ్లం

 27.    గ్యాసోహాల్ మిశ్రమం?

     1) పెట్రోల్+హైడ్రోజన్

     2) పెట్రోల్+కిరోసిన్

     3) కిరోసిన్+ఆల్కాహాల్

     4) పెట్రోల్+ఇథైల్ ఆల్కహాల్

 28.    మలేరియా వ్యాధి నయం చేయడానికి వాడే ఏ ఔషధం సింకోనా చెట్టు బెరడు నుంచి సంగ్రహిస్తారు?

     1) కెఫీన్        2) నికోటిన్

     3) క్వినైన్        4) బెల్లడోనా

 29.    ఆహార పదార్థాల పరిరక్షకంగా ఉపయోగించేది?

     1) సోడియం బెంజోయేట్

     2) సోడియం కార్బొనేట్

     3) సోడియం టార్టరేట్    4) ఏదీకాదు

 30.    ఎల్పీజీలో ఉండేది?

     1) పెంటేన్        2) బ్యూటేన్

     3) మీథేన్        4) హెప్టేన్

 

 సమాధానాలు

 1) 3    2) 2    3) 1    4) 2    5) 1

 6) 1    7) 1    8) 4    9) 2    10) 2

 11) 4    12) 2    13) 4    14) 4    15) 3

 16) 1    17) 1    18) 3    19) 3    20) 3

 21) 3    22) 3    23) 4    24) 4    25) 3

 26) 3    27) 4    28) 3    29) 1    30) 2

 

 

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top