ఎడ్యుకేషన్ & జాబ్స్


 1న హెచ్‌సీయూ స్నాతకోత్సవం

 హైదరాబాద్: హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) 17వ స్నాతకోత్సవం అక్టోబర్ 1న మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, హెచ్‌సీయూ చాన్స్‌లర్ సి.రంగరాజన్, వైస్‌చాన్స్‌లర్ పొదిలె అప్పారావు హాజరవుతారు. పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీలతో పాటు పలు కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్‌మెడళ్లు, ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు అందజేయనున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచనల మేరకు స్నాతకోత్సవంలో ధరించే డ్రెస్‌కోడ్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. చేనేత వస్త్రాలు ధరించి విద్యార్థులు స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు.

 

  1న బీఈడీ ఫలితాలు

 హైదరాబాద్: ఓయూ బీఈడీ రెగ్యులర్ కోర్సు వార్షిక పరీక్ష ఫలితాలు అక్టోబర్ 1న విడుదలచేయనున్నట్లు అదనపు కంట్రోలర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మూల్యాం కణం పూర్తయ్యిందని, మార్కుల జాబితాలు తయారవుతున్నాయని చెప్పారు.

 

  నేడు పీజీ డిప్లొమా ప్రవేశ పరీక్షల ఫలితాలు

 హైదరాబాద్: న్యాయశాస్త్రంలో వివిధ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 20న జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం (26న) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు కోర్సు కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. ఫలితాలను ఉస్మానియా వర్సిటీ వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.

 

  బార్‌‌కలో మెడికల్ ఆఫీసర్లు

 బాబా అటామిక్ రీసెర్‌‌చ సెంటర్ (బార్‌‌క).. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, ఆఫ్తాల్మలిక్ సర్జన్, న్యూక్లియర్ మెడిసిన్, ఒబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్/సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు 6. ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ డిగ్రీ ఉండాలి. రా త పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తే ది అక్టోబర్ 20. మరిన్ని వివరాలకు https://barcrecruit.gov.in చూడొచ్చు.

 

  ఈఎస్‌ఐలో ఇన్సూరెన్‌‌స మెడికల్ ఆఫీసర్లు

 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్/డిస్పెన్సరీల్లో ఇన్సూరెన్‌‌స మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 450.  వయసు 30 ఏళ్లకు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 10. మరిన్ని వివరాలకు http://esic.nic.in/recruitment.php  చూడొచ్చు.

 

  ఎన్‌బీసీసీలో మేనేజ్‌మెంట్ ట్రైనీలు

 నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటె డ్..  గేట్-2016 ద్వారా మేనేజ్ మెంట్ ట్రైనీ(సివిల్)ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. వయసు 29 ఏళ్లకు మించరాదు. దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 31. వివరాలకు www.nbccindia.com చూడొచ్చు.

 

  ఈఎస్‌ఐలో జూనియర్ ఇంజనీర్లు

 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ).. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ల భ ర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు 154. సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 30 ఏళ్లకు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 10. మరిన్ని వివరాలకు http://esic.nic.in/recruitment.php  చూడొచ్చు.

 

  ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్లు

 ఇండియన్ ఆర్మీ.. 123వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ల కోర్సుకు ఇంజనీరింగ్ పూర్తి చేసినవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్  చివరి సంవత్సరం చదివేవారు కూడా అర్హులు. వివరాలు ..సివిల్ (ఖాళీలు-25), ఎలక్ట్రికల్ (ఖాళీలు-10), మెకానికల్ (ఖాళీలు-10), ఎలక్ట్రానిక్స్(ఖాళీలు-05), కంప్యూటర్ (ఖాళీలు-10), ఎలక్ట్రానిక్స్, టెలికాం, టెలికమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ (ఖాళీలు-10). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 27. వివరాలకు  www.davp.nic.in చూడొచ్చు.

 

  నిట్ - రాయ్‌పూర్‌లో టెక్నికల్, ల్యాబ్ అసిస్టెంట్లు

 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) - రాయ్‌పూర్.. టెక్నికల్, లేబొరేటరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. టెక్నికల్ అసిస్టెంట్స్ (13). బీఈ/బీటెక్/బీఎస్సీ/డిప్లొమా/సైన్‌‌సలో పీజీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 30 ఏళ్లకు మించకూడదు. లేబొరేటరీ అసిస్టెంట్స్ (32). బీఎస్సీ/ఇంజనీరింగ్ డిప్లొమా/ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 27 ఏళ్లకు మించకూడదు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 23. మరిన్ని వివరాలకు http://www.nitrr.ac.in/ చూడొచ్చు.

 

 ఎన్‌హెచ్‌పీసీలో ట్రైనీ ఇంజనీర్లు

 నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ).. గేట్-2016 స్కోర్ ద్వారా ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ఎలక్ట్రికల్ -50, సివిల్ -20, మెకానికల్ - 20. 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణులు అర్హులు. వయసు 30 ఏళ్లకు మించరాదు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 1, 2016. మరిన్ని వివరాలకు http://www.nhpcindia.com/ చూడొచ్చు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top