ఈసీఐఎల్, హెచ్ఎంటీలో ఉద్యోగాలు...


ఈసీఐఎల్‌లో 14 పోస్టులు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

 పోస్టులు: సైంటిస్ట్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిసన్, సీనియర్ ఆర్టిసన్.

 ఖాళీలు: 14



 అర్హత: 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/మెకానికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.

 ఆర్టిసన్ పోస్టులకు అర్హత:  ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ ఫిట్టర్ / షీట్ మెటల్ విభాగాల్లో రెండేళ్ల వ్యవధి గల ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత విభాగాల్లో అనుభవం ఉండాలి.

 ఎంపిక విధానం: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తుని నిర్దేశిత నమూనాలో పూర్తి చేసి ఆగస్టు 3న  

 ‘ఇంటి నెం: 47-09-28, ముకుంద సేవా అపార్ట్‌మెంట్స్, థర్డ్ లేన్ ద్వారకా నగర్, విశాఖపట్నం’లో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.

 ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 3

 వివరాలకు: www.ecil.co.in

 ......................

 హెచ్‌ఎంటీలో 16 పోస్టులు

 బెంగళూరులోని హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

 పోస్టులు: జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఫైనాన్స్ ఆఫీసర్.

 విభాగాలు: ఫైనాన్స్, హెచ్‌ఆర్

 ఖాళీలు: 16

 అర్హత: సంబంధిత విభాగంలో  ఐసీడబ్ల్యూఏ/ సీఏ/ సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ (ఇంటర్)/ ఎంబీఏ (ఫైనాన్స్/హెచ్), ఎంఎస్‌డబ్ల్యూ/ ఎన్‌ఐపీఎం/ పీజీడీపీఎం/తత్సమాన అర్హత.

ఎంపిక విధానం: అర్హత గల వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

 దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 20

 వివరాలకు:  www.hmtmachinetools.com

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top