డీఈఈసెట్ గ్రాండ్ టెస్ట్


1       ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో చేరిన 161వ దేశం?

     1) కజకిస్థాన్    2) సీషెల్స్

     3) యెమన్        4) రష్యా

 2.    ప్రస్తుత కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) ఎవరు?

     1) ఆర్.ఎం.భాటియా    2) కె.విజయ్‌భార్గవ్

     3) కె.వి.చౌదరి     4) అనిల్ కుమార్

 3.    దౌపది ముర్ము ఏ రాష్ట్రానికి గవర్నరుగా ఉన్నారు?

     1) ఒడిశా         2) ఉత్తరప్రదేశ్

     3) జార్ఖండ్     4) బీహార్

 4.    జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?

     1) జూన్ 5         2) నవంబరు 2

     3) మార్చి 10    4) ఫిబ్రవరి 28

 5.    సుదీర్మన్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?

     1) బ్యాడ్మింటన్     2) టెన్నిస్

     3) ఫుట్‌బాల్     4) హాకీ

 

 టీచింగ్ ఆప్టిట్యూడ్

 

 6.    తల్లిదండ్రులు సాధారణంగా పాఠశాల నుంచి దేన్ని ఆశిస్తారు?

     1) తమ పిల్లల్ని అభ్యసనంలో నిమగ్నం చేయడం

     2) తమ పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ చూపడం

     3) తాము ఆశించిన తరగతిలో పిల్లల్ని చేర్చడం

     4) తాము ఆశించిన స్థాయిలో పిల్లల మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం

 7.    విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయుని అంతిమ లక్ష్యం?

     1) పరీక్షలకు తయారు చేయడం

     2) సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటం

     3) క్రమశిక్షణ పెంపొందించడం

     4) వైజ్ఞానిక దృష్టిని వెలికి తీయడం

 8.    విద్యార్థుల గైర్హాజరును ఎలా నిరోధిస్తావు?

     1) విద్యార్థుల తల్లిదండ్రులకు తెలపడం ద్వారా

     2) విద్యార్థులతో వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకొని

     3) పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా

     4) దండించుట ద్వారా

 9.    పిల్లలకు విద్య నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది?

     1) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం

     2) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు

     3) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు

     4) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు

 10.    తరగతి గది బోధన ఎక్కువ ఫలవంతం కావాలంటే.. ఉపాధ్యాయులు?

     1) ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి

     2) మెథడాలజీలో సంపూర్ణ నైపుణ్యం సాధించాలి

     3) దృశ్య, శ్రవణ ఉపకరణాలను ఎక్కువగా ఉపయోగించాలి

     4) బోధనాభ్యసన ప్రక్రియలో పిల్లలందరూ పాల్గొనేటట్లు చేయాలి

 

 English

 

 11.    The different flavours ................ each other perfectly. Fill in the blank with the correct alternative from the following.

     1) complement    2) compliment

     3) complementary to    4) complementing

 12.    People often ................... me with my twin sister. Pick out the correct word that fits in the blank.

     1) confused    2) confusing

     3) confuse    4) confusedly

 13.    Everything has finally................. that he is corrupt in ‘cash for vote’ case.

     1) convicted    2) confuted

     3) conjectured    4) confected

 14.    I am feeling no better today. Name the parts of speech of the word in bold.

     1) Noun        2) adverb

     3) adjective    4) determiner

 15.    What a terrible...................? Fill in the blank with the correct word.

     1) noise    2) sound    3) din    4) racket.

 16.    They should remember that their proposals aren’t carved in stone. Choose the correct meaning of the words in bold.

     1) Are unable to be changed

     2) Are able to be changed

     3) Are not written on stone

     4) Are not written on paper

 17.    Sastry teaches us English. The passive form of the above sentence is ....

     1) English is taught us by Sastry

     2) English is taught to us by Sastry

     3) English was taught us by Sastry

     4) English was taught to us by Sastry

 18.    His debtors are coming..................... him. Insert correct word in the blank.

     1) Across        2) about

     3) at        4) against

 19.    There were no................... than fifty students in the class room. Insert correct word that suits the blank.

     1) more        2) less

     3) fewer        4) hardly

 20.    If you had given me the book, I ................. it by now. Fill in the blank with correct form of verb.

     1) shall have been reading

     2) will have been reading

     3) would have been reading

     4) should have been reading

 

 తెలుగు

 

 21.    తిక్కన రచించిన ‘శాంతి కాంక్ష’ పాఠ్యభాగం ఏ గ్రంథంలోనిది?

     1) నిర్వచనోత్తర రామాయణం తృతీయాశ్వాసం

     2) మహాభారతంలోని విరాటపర్వం తృతీయాశ్వాసం

     3) మహాభారతంలోని ఉద్యోగపర్వం తృతీయాశ్వాసం

     4) మహాభారతంలోని ఉద్యోగపర్వం పంచమాశ్వాసం

 22.    విమర్శ దృష్టితో వ్యంగ్య, హాస్యధోరణిలో వ్యాఖ్యానిస్తూ, పరిష్కారమార్గాన్ని సూచిస్తూ సాగే సాహిత్య ప్రక్రియ?

     1) సంపాదకీయం     2) వార్తావ్యాఖ్య

     3) గల్పిక         4) అధిక్షేప వ్యాసం

 23.    ‘చిలిపి గజ్జెలు’ అనే పదంలో జరిగిన సమాసం?

     1) సంభావణ పూర్వపద కర్మధారయం

     2) విశేషణ పూర్వపద కర్మధారయం

     3) విశేషణోత్తరపద కర్మధారయం

     4) విశేషణోభయపద కర్మధారయం

 24.    హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విమర్శకులు ఏ కవిని గుర్తించారు?

     1) సామల సదాశివ

     2) పుట్టపర్తి నారాయణాచార్యులు

     3) సి.నారాయణరెడ్డి

     4) పిలకా గణపతి శాస్త్రి

 25.    ‘ఇనునసమానతేజు దివసేంద్రు గనుంగొనుమాడ్కి జూడగా’... ఇది ఏ పద్యపాదం?

     1) ఉత్పలమాల    2) చంపకమాల

     3) మత్తేభం        4) శార్దూలం

 26.    దేశీయ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి?

     1) నన్నయ     2) తిక్కన

     3) నన్నెచోడుడు    4) పాల్కురికి సోమనాథుడు

 27.    గడియారం వేంకటశాస్త్రి బిరుదు కానిది ఏది?

     1) కవితా వసంత     2) కవిసింహ

     3) అవధాన పంచానన    4) సరస్వతీపుత్ర

 28.    ఒక దృష్టాంతాన్ని విధిగా చెప్పడం ఏ శతకంలోని ప్రత్యేకత?

     1) భాస్కర శతకం    2) దాశరథి శతకం

     3) నరసింహ శతకం    4) శ్రీ వేంకటేశ్వర శతకం

 29.    కెందామర అనే పదాన్ని విడదీస్తే?

     1) కెన్ను+తామర     2) కెందు+తామర

     3) కెం+తామర    4) కొత్త+తామర

 30.    గూడు కోసం గువ్వలు కథా రచయిత?

     1) ఓల్గా         2) విద్వాన్ విశ్వం

     3) పులికంటి కృష్ణారెడ్డి    4) అలిశెట్టి ప్రభాకర్

 31.    {Vహణం అనే పదానికి నానార్థాలు?

     1) భూమి, బుద్ధి, సౌరకుటుంబం

     2) ఉరుము, నేత్రం, విశ్వం

     3) విశ్వం, నేత్రం, ప్రవాహం

     4) బుద్ధి, నేత్రం, ఆవరించడం

 32.    ‘నాకు చాలా సంతోషంగా ఉంది’.. అని నాన్న చెప్పాడు. ఈ వాక్యాన్ని పరోక్షానుకృతి వాక్యంగా మార్చితే?

     1) తనకు చాలా సంతోషంగా ఉందని నాన్న చెప్పాడు

     2) నాన్న నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు

     3) నాకు చాలా సంతోషంగా ఉందని నాన్న చెప్పాడు

     4) నాన్న తనకు చాలా సంతోషం కలిగిందని నాతో చెప్పాడు

 33.    తెలుగులో మణిప్రవాళ శైలిని ఉపయోగించిన తొలి కవి?

     1) నన్నయ        2) తిక్కన

     3) ఎర్రన    4) పాల్కురికి సోమనాథుడు

 34.    విశ్వనాథ సత్యనారాయణ ‘యక్షుడి అప్పు’ అనే పాఠ్యభాగం ఏ కోవకు చెందినది?

     1) పురాణ వచనం     2) ఇతిహాసం

     3) నాటిక         4) పీఠిక

 35.    ‘నవోదయం, మణిమంజూష, కళాతపస్విని’.. అనే పద్యకావ్యాలను ఎవరు రచించారు?

     1) నంబి శ్రీధరరావు     2) అందె వేంకటారాజం

     3) ఉత్పల సత్యనారాయణాచార్య

     4) వడ్డాది సుబ్బరాయ కవి

 36.    వడ్డాది సుబ్బారాయ కవి కలం నుంచి జాలువారిన శతకాలు?

     1) నందనవన శతకం, భక్త చింతామణి శతకం

     2) నృసింహ శతకం, నింబగిరి శతకం

     3) విశ్వనాథుశ్వర శతకం, మల్లభూపాలీయ శతకం

     4) కవిశిరోమణి శతకం, ప్రభోద చంద్రోదయం

 37.    గౌరన కలం నుంచి జాలువారిన ‘హరిశ్చందోపాఖ్యానం, నవనాథ చరిత్ర’ అనేవి?

     1) లక్షణ గ్రంథాలు    2) పురాణ, ఇతిహాసాలు

     3) ద్వ్యర్థి, ద్విపద కావ్యాలు

     4) ద్విపద కావ్యాలు

 38.    ‘వర్షాకాలంలో వానలు పడితే పంటలు బాగా పండుతాయి’ వాక్యంలో ‘పడితే’ అనేది?

     1) అవ్యర్థకం     2) శత్రర్థకం

     3) చేదర్థకం     4) క్త్వార్థకం

 39.    కడుపులు మాడ్చుకొను.. అనేది ఒక?

     1) జాతీయం     2) సామెత

     3) పొడుపు కథ     4) పదబంధం

 40.    వట్టికోట అళ్వారుస్వామి నవలల్లో ఏవి అధిక ప్రజాదరణ పొందాయి?

     1) మాలపల్లి, రథచక్రాలు

     2) ప్రజల మనిషి, గంగూ

     3) ప్రజల మనిషి, మాలపల్లి

     4) రథచక్రాలు, ప్రజల మనిషి

 

 మ్యాథమెటిక్స్

 

 

 41.     దశాంశ రూపం?

     1)     2)  3)     4)

 42.    శిరీష వద్ద 50 పైసలు, 25 పైసల నాణేలు ఉన్నాయి. 50 పైసల నాణేల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో 25 పైసల నాణేలు ఉన్నాయి. వీటి మొత్తం రూ. 9 అయితే 25 పైసల నాణేల సంఖ్య?

     1) 14    2) 16    3) 18    4) 20

 43. మాలిక్ రెండు టేబుళ్లను ఒక్కొక్కటి రూ.3 వేలకు అమ్మాడు. ఒక టేబుల్‌పై 20 శాతం లాభం, మరోదానిపై 20 శాతం నష్టం వస్తే మొత్తం మీద అతనికి లాభమా? నష్టమా? ఎంత శాతం?

     1) 4 శాతం నష్టం    2) 4 శాతం లాభం

     3) 5 శాతం నష్టం    4) 5 శాతం లాభం

 44.    కింది వాటిలో ఏది నిజం?

     1) కమ్మీరేఖా చిత్రంలో అన్ని కమ్మల వెడల్పులు సమానం

     2) ఒక దత్తాంశానికి గీసిన సోపాన రేఖా చిత్రం, పౌనఃపున్య బహుభుజిల వైశాల్యాలు సమానం

     3) సంచిత పౌనఃపున్య వక్రాన్ని ఓజీవ్ వక్రం అంటారు

     4) పైవన్నీ

 45.    దీర్ఘచతురస్రం భ్రమణ సౌష్టవ పరిమాణం ----

     1) 2    2) 3    3) 4    4) 1

 

 46.     అయితే

     1) 10    2) 15    3) 20    4) 30

 47.    ్చ + ఛ + ఛి = 9, ్చఛ + ఛఛి + ఛ్చి = 26 అయితే ్చ2 + ఛ2 + ఛి2 =

     1) 29    2) 30    3) 39    4) 41

 48.    10 సెం.మీ. వ్యాసార్ధంగా గల అర్ధగోళం సంపూర్ణ తల వైశాల్యం? (చదరపు సెం.మీ.)

     1) 684    2) 942    3) 1084    4) 2184

 49.    ఒక రాంబస్‌లో కర్ణాలు 12 సెం.మీ., 16 సెం.మీ. దాని భుజాల మధ్య బిందువులను వరుస క్రమంలో కలిపితే ఏర్పడే పటం వైశాల్యం? (చదరపు సెం.మీ.)

     1) 96    2) 48    3) 24    4) 12

 52.    కింది వాటిలో ఏది నిజం?

     1) ప్రతి సమితికి కనీసం రెండు ఉపసమితులు ఉంటాయి.

     2)  అయితే అ, ఆ లను వియుక్త సమితులు అంటారు.

     3)

     4) పైవన్నీ.

 53.    ax2 - 5x + c బహుపది శూన్యాల మొత్తం, లబ్దం రెండూ 10 కి సమానం అయితే ఛి విలువ

     1) 10    2) 5    3) -10    4) -5

 54.    a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 సరళరేఖలు సమాంతర రేఖలు అవడానికి నియమం ----

 

     1)     2)

 

     3)     4) ఏదీ కాదు

 55.    4్ఠ2  12్ఠ + 9 = 0 వర్గ సమీకరణం మూలాల స్వభావం?

     1) వాస్తవాలు, విభిన్నాలు

     2) వాస్తవాలు, సమానాలు

     3) కల్పితాలు    4) ఏదీ కాదు

 56.    ఒక అంకశ్రేఢిలో 11వ పదం 38, 16వ పదం 73 అయితే సామాన్య భేదం?

     1) 5    2) 6    3) 7    4) 8

 57.    ఈ అఆఇ ఒక సమబాహు త్రిభుజం. అఈ చ ఆఇ అయితే 3అఆ2 =?

     1) అఈ2    2) 2అఈ2    3) 3 అఈ2    4) 4అఈ2

 58.    అయితే

     

 

     1) 1    2)     3)     4) ఏదీకాదు

 59.    హర్పీత్ రెండు నాణేలను ఒకేసారి ఎగరేశాడు. కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత?

 

     1)     2)     3)     4) 1

 60.    భూమిపై ఒక టవర్ నిటారుగా ఉంది. దాని అడుగు నుంచి 15 మీటర్ల దూరంలో ఉన్న స్థానం నుంచి ఆ టవర్ పైకొనను 450 ఊర్థ్వకోణంలో పరిశీలిస్తే ఆ టవర్ ఎత్తు? (మీటర్లలో..)

     1) 15    2)     3) 30    4) 7.5

 

 సైన్స్

 

 61.    {శవ్య ధ్వనుల పౌనఃపున్య అవధి?

     1) 20 ఏో - 2000 ఏో

     2) 20 ఏో - 20 ఓఏో

     3) 20 ఏో- 200 ఏో

     4) 2000 ఏో - 20,000 ఏో

 

 62.    వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందే ప్రక్రియ?

     1) బాష్పీభవనం     2) ద్రవీభవనం

     3) ఘనీభవనం     4) సాంద్రీకరణం

 

 63.    విద్యుత్‌బల్బులో ఉపయోగించే ఫిలమెంటును దేంతో తయారుచేస్తారు?

     1) కాపర్         2) అల్యూమినియం

     3) టంగస్టన్     4) మాంగనీస్

 

 64.    {బష్ కుంచె, చేపల వలల తయారీకి ఉపయోగించేది?

     1) నైలాన్          2) రేయాన్

     3) అక్రిలిక్         4) పాలిస్టర్

 

 65.    దీర్ఘవృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త?

     1) నీల్స్‌బోర్     2) సోమర్‌ఫీల్డ్

     3) లాండే         4) రూథర్‌ఫర్డ్

 

 66.    -ఇైైఖ ప్రమేయ సమూహాన్ని కలిగియున్న సమ్మేళనాలను ఏమంటారు?

     1) ఆల్డిహైడ్స్     2) అమైన్స్

     3) ఈథర్స్         4) ఎస్టర్స్

 

 67.    ముక్కిపోవడం అనేది ఏ చర్య?

     1) ఆక్సీకరణం     2) క్షయకరణం

     3) రెడాక్స్        4) కాంతి రసాయన

 

 68.    పాదరసం లాటిన్ పేరు?

     1) ఆరమ్         2) ఛాల్కోజన్స్

     3) ప్లంబా         4) హైడ్రార్జిరం

 

 69.    విశిష్టనిరోధానికి ప్రమాణాలు?

     1) ఓమ్/మీటర్     2) ఓమ్-మీటర్

     3) ఓమ్/మీటర్2     4) ఓమ్‌లు

 

 70.    పదహారో గ్రూపు మూలకాలను ఏమంటారు?

     1) క్షారలోహాలు     2) క్షారమృత్తిక లోహాలు

     3) హాలోజన్స్     4) ఛాల్కోజన్స్

 

 71.    పట్టు పురుగు కాటర్‌పిల్లర్‌ని ఏమని పిలుస్తారు?

     1) క్రైసాలిస్     2) గ్రబ్

     3) రిగ్లర్         4) ఎరూసిఫారం

 

 72.    హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల జీర్ణాశయం గోడలు పాడవకుండా ఏది కాపాడుతుంది?

     1) టయలిన్     2) ఎమైలేజ్

     3) మ్యూసిన్     4) పెప్సిన్

 

 73.    {పపంచ ధరిత్రీ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?

     1) ఏప్రిల్ 7     2) ఏప్రిల్ 22

     3) ఫిబ్రవరి 4     4) ఫిబ్రవరి 11

 

 74.    ఏ రంగు కాంతిలో కిరణజన్య సంయోగక్రియ జరగదు?

     1) తెలుపు         2) ఎరుపు

     3) నీలం         4) ఆకుపచ్చ

 

 75.    ‘వైటమిన్’ అనే పేరును తొలుత ఎవరు ప్రతిపాదించారు?

     1) ఫంక్         2) హాఫ్‌కిన్స్

     3) జెన్నర్         4) హిల్

 

 76.    అధివృక్క గ్రంథి స్రవించే స్రావం?

     1) థైరాక్సిన్     2) అడ్రినలిన్

     3) పిట్యూటరీ     4) ఇన్సులిన్

 

 77.    ఏ లక్షణం ఉండటం వల్ల రణపాల మొక్క ప్రత్యేకత సంతరించుకుంది?

     1) ఛేదనం ద్వారా శాఖీయోత్పత్తి

     2) పత్రకోరకాలు ఉండటం

     3) వేరుమొగ్గలు ఏర్పరచటం

     4) లశునాలు కలిగి ఉండటం

 

 78.    ఒక మొక్క స్త్రీ బీజకణం క్రోమోజోముల సంఖ్య 15 అయితే ఆ కణంతో సంయోగం చెందే పురుష బీజకణంలోని క్రోమోజోముల సంఖ్య?

     1) 30     2) 45     3) 8     4) 15

 

 79.    నల్లమందు, సర్పగ్రంథి మొక్కల నుంచి ఆల్కలాయిడ్లు లభించే భాగాలు వరుసగా?

     1) బెరడు, ఆకు     2) కాయ, గింజలు

     3) గింజలు, బెరడు     4) కాయ, వేరు

 

 80.    నిర్మాణాత్మక క్రియలకు అవసరమయ్యే శక్తిని అందించే జీవక్రియ ఏది?

     1) విసర్జన క్రియ     2) నాడీ క్రియ

     3) శ్వాసక్రియ     4) ప్రసరణ-రవాణా

 

 సోషల్

 

 81.    {పస్తుతం మనకు అందుబాటులో ఉన్న అతి పురాతనమైన భౌగోళిక పటాలను సుమేరియన్లు వేటిపై గీశారు?

     1) పలుచని రాతి శిలలు     2) మట్టి పలకలు

     3) మొత్తటి వస్త్రాలు     4) వెడల్పాటి కంచురేకులు

 

 82.    విశాఖపట్నంలో సాధారణంగా ఏడాదంతా ఒకే రకమైన శీతోష్ణస్థితులు ఉండటానికి ప్రధాన కారణం?

     1) భూమధ్య రేఖపై నుంచి వాయవ్యం వైపు వీచే వ్యాపార పవనాలు

     2) పశ్చిమం నుంచి తూర్పుతీరం వైపు ప్రయాణించే పశ్చిమ పవనాలు

     3) సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి

     4) 1, 3

 

 83.    గోల్కొండ పత్రిక సంపాదకుడు?

     1) మాడపాటి హనుమంతరావు

     2) కొమర్రాజు లక్ష్మణరావు

     3) సురవరం ప్రతాపరెడ్డి

     4) జె.వి.నరసింగరావు

 

 84.    స్వతంత్ర భారతదేశంలో చివరగా విలీనమైన సంస్థానం ఏది?

     1) కాశ్మీర్         2) జునాగఢ్

     3) హైదరాబాద్     4) మైసూర్

 

 85.    ‘1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం.. రాజకీయాల్లో మనకు సమానత ఉంటుంది కానీ సామాజిక, ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది’ అని ఉద్ఘాటించినవారు?

     1) బి.ఆర్.అంబేద్కర్     2) నెహ్రూ

     3) మహాత్మాగాంధీ    4) బాబూ రాజేంద్రప్రసాద్

 

 86.    ఏటీఎం అనగా?

     1) అటోమేటెడ్ టెల్లర్ మెషీన్

     2) ఎనీ టైమ్ మనీ    3) ఆల్ టైమ్ మనీ

     4) ఆటెమెటిక్ టెల్లింగ్ మెసేజ్

 

 87.    {Xనిచ్ రేఖకు తూర్పు, పడమర ప్రదేశాలను కలిపి ప్రపంచాన్ని ఎన్ని కాలమండలాలుగా విభజించారు?

     1) 12     2) 6     3) 24     4) 15

 

 88.    గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితల పైపొరలు కొట్టుకుపోవడాన్ని ఏమంటారు?

     1) శిలాశైథిల్యం    2) నిక్షేపణ

     3) క్రమక్షయం     4) రవాణా

 

 89.    ‘యువరాజు (ది ప్రిన్స్)’ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?

     1) మాంటెస్క్యూ    2) మాకియవెల్లి

     3) ప్లేటో         4) అరిస్టాటిల్

 

 90.    జాతి అనే పదానికి ఆధునిక అర్థాన్నిచ్చే విప్లవం?

     1) రష్యా విప్లవం     2) అమెరికన్ విప్లవం

     3) ఫ్రెంచి విప్లవం     4) బ్రిటన్ విప్లవం

 

 91.    సమన్యాయ పాలన అంటే?

     1) ప్రభుత్వ పాలన న్యాయసమ్మతంగా ఉండటం

     2) రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు ఇవ్వడం

     3) న్యాయస్థానాల్లో న్యాయం అందరికీ సమానంగా అందించడం

     4) ఏ వ్యక్తికి చట్టం ముందు, చట్టాల రక్షణలో సమానత్వాన్ని తిరస్కరించకుండా ఉండటం

 

 92.    హరిత విప్లవం వల్ల జరగని పరిణామం?

     1) పర్యావరణ సమస్యలు తగ్గాయి

     2) ఆహార ధాన్యాల నిల్వలు పెరిగాయి

     3) సంప్రదాయ వ్యవసాయ సాగు విధానాలు తగ్గుముఖం పట్టాయి

     4) ఏవీకావు

 

 93.    ద్వీపకల్ప నదుల్లో పెద్దది?

     1) గంగా         2) కృష్ణా

     3) గోదావరి     4) కావేరి

 

 94.    పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి ప్రధాన కారణం?

     1) ప్రకృతివిపత్తులు     2) మానవ చర్యలు

     3) ప్రభుత్వ ప్రణాళికల్లోని లోపాలు

     4) పైవన్నీ

 

 95.    ఐక్యరాజ్యసమితి ఎప్పుడు ఏర్పడింది?

     1) 1942         2) 1945

      3) 1948         4) 1944

 

 96.    ‘విభజించి పాలించు’ అనే సిద్ధాంతం వల్ల ఒనగూరే ప్రయోజనం?

     1) ఆధిపత్యం     2) పాలనలో స్థిరత్వం

     3) నిరంకుశాధికారం     4) పైవన్నీ

 

 97.    1962లో భారత్-చైనా యుద్ధానికి కారణం?

     1) అంతర్గత చొరబాట్లు

     2) సీమాంతర ఉగ్రవాదం

     3) అంతర్జాతీయ రాజకీయ వైషమ్యాలు

     4) సరిహద్దు వివాదం

 

 98.    ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం..’ అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది?

     1) జూన్ 2, 2014     2) నవంబరు 1, 2012

     3) సెప్టెంబరు 17, 2010

     4) డిసెంబర్ 9, 2009

 

 99.    తెలంగాణలో జనసాంద్రత తక్కువగా ఉన్న జిల్లా?

     1) అదిలాబాద్     2) ఖమ్మం

     3) మహబూబ్‌నగర్     4) నిజామాబాద్

 

 100. భారతదేశంలో మొత్తం సాగుభూమిలో వర్షాధారం కింద ఉన్న భూమి ఎంత?

     1) 5.8 కోట్ల హెక్టార్లు     2) 7.4 కోట్ల హెక్టార్లు

     3) 8.5 కోట్ల హెక్టార్లు     4) 9.2 కోట్ల హెక్టార్లు

 

 సమాధానాలు

 1) 2    2) 3    3) 3    4) 4    5) 1

 6) 4    7) 2    8) 1    9) 1    10) 4

 11) 1    12) 3    13) 2    14) 2    15) 3

 16) 2    17) 2    18) 3    19) 3    20) 3

 21) 3    22) 4    23) 2    24) 1    25) 2

 26) 4    27) 4    28) 1    29) 1    30) 3

 31) 4    32) 1    33) 4    34) 3    35) 2

 36) 1    37) 4    38) 3    39) 1    40) 2

 41) 3    42) 3    43) 1    44) 4    45) 1

 46) 3    47) 1    48) 2    49) 2    50) 3

 51) 2    52) 4    53) 2    54) 2    55) 2

 56) 3    57) 4    58) 2    59) 3    60) 1

 61) 2    62) 4    63) 3    64) 1    65) 2

 66) 4    67) 1    68) 4    69) 2    70) 4

 71) 4    72) 3    73) 2    74) 4    75) 1

 76) 2    77) 2    78) 4    79) 4    80) 3

 81) 2    82) 3    83) 3    84) 3    85) 1

 86) 1    87) 3    88) 3    89) 2    90) 3

 91) 4    92) 1    93) 3    94) 2    95) 2

 96) 1    97) 4    98) 4    99) 1    100) 4

 

 

 రూపకర్తలు

 జనరల్ నాలెడ్‌‌జ - ఎన్.విజయేందర్ రెడ్డి

 టీచింగ్ ఆప్టిట్యూడ్, తెలుగు - ఎన్.కె.మద్దిలేటి

 ఇంగ్లిష్ - పి.వి.సి.హెచ్.శాస్త్రి

 గణితం - వై.వనంరాజు

 ఫిజికల్ సైన్‌‌స - ఎ.వి.సుధాకర్

 బయాలజీ - ఎస్.పి.డి.పుష్పరాజ్

 సోషల్ - బొమ్మనబోయిన శ్రీనివాస్

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top