కాంపిటీటివ్‌ కౌన్సెలింగ్‌


పోటీ పరీక్షలకు సంబంధించి జాగ్రఫీ అంశాలను ఎలా             చదవాలి?

– ఎం.విజయ్‌ కుమార్, హైదరాబాద్‌.

జాగ్రఫీలో పట్టు సాధించాలంటే..

అట్లాస్‌పై పరిపూర్ణ అవగాహన పొందాలి. ఇది అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ భౌగోళిక అంశాల పరంగా బేసిక్‌ నైపు

ణ్యాన్ని అందిస్తుంది. ఆ తర్వాత సిల

బస్‌ను పరిశీలిస్తూ అందులోని ప్రాధా

న్యత జాబితాను రూపొందించుకోవాలి. దాని ఆధారంగా ప్రిపరేషన్‌ను సాగిం

చాలి. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రధా

నంగా దృష్టి సారించాలి. విపత్తు నిర్వహణ విధానం, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ కార్యకలాపాలు, ఇటీవల

కాలంలో జాతీయ, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన ప్రకృతి



విపత్తుల గురించి తెలుసుకోవాలి. జాగ్రఫీలోనే అభ్యర్థులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన మరో అంశం.. సహజ వనరులు, అవి నిక్షిప్తమై ఉన్న ప్రాంతాలు, అందుకు కారణాలను అధ్యయనం చేయాలి. అదేవిధంగా కొన్ని పంటలు కొన్ని ప్రాంతాల్లోనే అత్యధికంగా పండుతాయి (ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న ఎక్కువగా పండుతుంది). రాష్ట్రంలోని సహజ వనరులు, వాటి వెలికితీతకు చేపట్టిన చర్యలు గురించి తెలుసుకోవడంతోపాటు ప్రస్తుత పరిస్థితిపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా గ్రూప్‌–3, గ్రూప్‌–4 పోస్టులకు పోటీ పడే ఔత్సాహికులు రాష్ట్రంలోని ప్రధాన పంటలు, ప్రాంతాలు, జనాభా, నిష్పత్తి వంటి అంశాలను తప్పనిసరిగా ఔపోసన పట్టాలి. పర్యావరణం, పర్యావరణ కాలుష్యం, కర్బన ఉద్గారాలు, నివారణ చర్యలపైనా పట్టు సాధించాలి. అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణ దిశగా పలు దేశాల మధ్య ఒప్పందాలు, ఐక్యరాజ్య సమితి వేదికగా జరిగిన ఒప్పందాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ, ఎకాలజీలో ప్రశ్న – సమాధానం కోణంలో కాకుండా కొంత వరకు డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో ముందుకు సాగాలి.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top