కాంపిటీటివ్ కౌన్సెలింగ్


గ్రూప్స్, పోలీస్ కానిస్టేబుల్స్ తది తర పరీక్షల్లో నదులు, వాటి అనుబంధ అంశాలకు ఎలా par సిద్ధమవ్వాలి?ఙ- ఎస్.ప్రవీణ్ కుమార్, ఖమ్మం.



ఉద్యోగ నియామక పరీక్షల కోణంలో చూస్తే ‘భారతదేశం-నదీ వ్యవస్థ’ విభాగం కీలకమైంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే వీటి నుంచి రెండు, మూడు పశ్నలు వస్తున్నట్లు గమనించవచ్చు. తూర్పు, పశ్చిమం, దక్షిణం వైపునకు ప్రవహించే నదులు, వాటి జన్మస్థానాలు, వేర్వేరు ప్రాంతాల్లో వాటి పేర్లు, ఉప నదులు, పరీవాహక ప్రాంతాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వివిధ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల గురించి కూడా తెలుసుకోవాలి. అంతర్ భూభాగ నదీ వ్యవస్థపైనా అవగాహన అవసరం. గతంలో జరిగిన ఒక పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్‌లో ఏ నదిని దక్షిణ గంగ అని పిలుస్తారు? అనే ప్రశ్న వచ్చింది. దీనికి సరైన సమాధానం ‘గోదావరి’. భారతదేశంలో పొడవైన నది గంగా.



 దక్షిణ భారతదేశంలో పొడవైన నది గోదావరి. ఒక నది గురించి చదువుతున్నప్పుడు ఇలాంటి అంశాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. అప్పుడు ఏ అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా కచ్చితమైన సమాధానం గుర్తించవచ్చు. కొన్నిసార్లు ఇలాంటి సులభతరమైన ప్రశ్నలే అడిగినా.. పెరుగుతున్న పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వీటిపై ఇంకాస్త కఠినమైన ప్రశ్నలూ ఇవ్వొచ్చు. అందువల్ల నదులు, వాటి పొడవు, అవి ప్రవహించే రాష్ట్రాలు, వాటిపై ఉన్న ప్రాజెక్టులు తదితర అంశాలను పట్టిక రూపంలో రూపొందించుకుని రివిజన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చదివిన విషయాలు మరచిపోవడానికి అవకాశం ఉండదు. దీంతోపాటు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. అప్పుడే సబ్జెక్టుపై పట్టు లభిస్తుంది.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top