కాంపిటీటివ్ కౌన్సెలింగ్


సివిల్స్ ప్రిలిమ్స్‌లో జాగ్రఫీలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా?

- ఎన్. ప్రియబాంధవి, అనంతపురం


 

సివిల్స్ ప్రిలిమ్స్‌లో జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ నుంచి 24 నుంచి 30 ప్రశ్నల వరకు వస్తున్నాయి. జాగ్రఫీ, ఎకాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రణాళికలో వీటికి అధిక సమయం కేటాయించాలి. సిలబస్‌లో ‘భారతదేశం, ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక, భూగోళ శాస్త్రం’ అని పేర్కొన్నారు. అభ్యర్థులు భారత భౌగోళిక అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి.



మనదేశానికి సంబంధించి వ్యవసాయం, వ్యవసాయ సంక్షోభం, రుతువులు, నదులు, అడవులు - అటవీ భూముల ఆక్రమణ, అంతరిస్తున్న జీవ జాతులు, శక్తి వనరులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రవాణా, పట్టణీకరణ ప్రక్రియ, సరిహద్దుల వివాదాలు వంటివీ ముఖ్యమే. కోర్ ఎకాలజీ నుంచి ప్రధానంగా రెండు అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అవి.. ఎకాలజీ బేసిక్ కాన్సెప్టులు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top