ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు...

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు...


Q.ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సు వివరాలను తెలపండి? తర్వాత ఇదే సబ్జెక్ట్‌తో జర్మనీలో Aఎంఎస్ చేయడం ఎలా?    -నరేష్, భద్రాచలం.

 

A  ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, మెషిన్ డ్రాయింగ్, ఆటోమోటివ్ ఇంజిన్స్, వెహికల్ డైనమిక్స్, ఆటో-ఎయిర్ కండిషనింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, క్యాడ్/కామ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి సబ్జెక్టులు ఉంటాయి.

 

 ఆటోమొబైల్ ఇంజనీర్లు ఆటోమోటివ్ డిజైన్, డెవలప్‌మెంట్, ఇంజిన్స్, ఎయిర్ కండిషనింగ్, అప్లికేషన్, సర్వీస్ వంటి విభాగాల్లో పనిచేస్తారు. ఈ వృత్తిలో రాణించడానికి ఎనలిటికల్ స్కిల్స్, క్యాడ్/క్యామ్ అంశాలపై పట్టు ఉండాలి. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి మారుతి, టాటా మోటార్స్, ఫోర్డ్, ఫియట్, టయోటా, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు టాప్ రిక్రూటర్లుగా నిలుస్తున్నాయి.

 

 ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేయడానికి అత్యధిక మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న దేశం జర్మనీ. ఆ దేశ విద్యా విభాగం అంచనా మేరకు అక్కడి 370 యూనివర్సిటీల్లో దాదాపు 2 లక్షల 40 వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు. ఖర్చు కూడా ఇతర దేశాలతో చాలా తక్కువ. కొన్ని యూనివర్సిటీలు ఉచిత విద్యను కూడా అందిస్తున్నాయి. ఎంఎస్ కోర్సుకు అర్హత సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. జీఆర్‌ఈ, టోఫెల్, అకడమిక్ ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

 వివరాలకు: www.daad.de

 

 Q. ఎంఎస్సీ(ఫోరెన్సిక్ సైన్స్) కోర్సు వివరాలను తెలపండి?

 -రమేష్, నిజామాబాద్.

 పలు క్లిష్టమైన కేసుల పరిష్కారంలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఏదైనా నేరం జరిగిన వెంటనే.. కేసు పరిష్కారం అయ్యేందుకు అవసరమైన డీఎన్‌ఏ శాంపిల్స్ కోసం నేరం జరిగిన చోట లభించే ఆధారాలు, అనుమానితుల నుంచి వేలిముద్రలు సేకరించడం అనివార్యం. ఈ పనిని ఫోరెన్సిక్ నిపుణులు మాత్రమే చేస్తారు.

 మన రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం-హైదరాబాద్, ఎంఎస్సీ(ఫోరెన్సిక్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.

  వివరాలకు:  www.osmania.ac.in





 ఫోరెన్సిక్ సైన్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న విశ్వవిద్యాలయాలు: పంజాబీ యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్.

 

 కోర్సు: ఎంఎస్సీ (ఫోరెన్సిక్ సైన్స్)

 అర్హత: బీఎస్సీ/బీడీఎస్/ఎంబీబీఎస్/బీఫార్మసీ/బీటెక్.

 వెబ్‌సైట్: www.punjabiuniversity.ac.in

 

 గుజరాత్ యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, అహ్మదాబాద్.

 కోర్సు: ఎంఎస్సీ (ఫోరెన్సిక్ సైన్స్)

 అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఎస్సీ

 వెబ్‌సైట్: www.gujaratuniversity.org.in

 

 యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆంత్రోపాలజీ, ఢిల్లీ

 కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ సైన్స్.

 వెబ్‌సైట్:www.du.ac.in

 

 యూనివర్సిటీ ఆఫ్ పుణే, పుణే

 కోర్సు: డిప్లొమా ఇన్ క్రిమినాలజీ.

 అర్హత: లైఫ్ సైన్స్‌తో గ్రాడ్యుయేషన్.

 వెబ్‌సైట్:www.unipune.ac.in

 

 Q. ఎంబీఏ కోర్సును అందిస్తున్న ఐఐటీల వివరాలను తెలపండి?

 -శ్రీను, కరీంనగర్.

 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఇంజనీరింగ్ కోర్సులతోపాటు మేనేజ్‌మెంట్ విభాగంలో కూడా పలు కోర్సులను అందిస్తున్నాయి. వాటి వివరాలు..

  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - ఖరగ్‌పూర్, వినోద్‌గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రవేశాల సమయంలో ప్రాధాన్యతనిస్తారు.

 వివరాలకు: www.som.iit-kgp.ernet.in

 

 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎంబీఏ కోర్సును పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ రెండు విధాలుగా అందిస్తుంది. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ఫార్మసీ) లేదా బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా పార్ట్ టైమ్ ఎంబీఏ కోర్సులో అడ్మిషన్ ఇస్తారు. వివరాలకు: http://dms.iitd.ac.in/

 

 ఐఐటీ-మద్రాస్ (వివరాలకు: ఠీఠీఠీ.ఛీౌఝట.జీజ్టీఝ.్చఛి. జీ/ఛీౌఝట్ఛఠీ), ఐఐటీ-బాంబే (వివరాలకు: http:// www.som.iitb.ac.in), ఐఐటీ-రూర్కీ (వివరాలకు: http://www.iitr.ac.in), ఐఐటీ-కాన్పూర్ (వివరాలకు: http://www.iitk.ac.in)కూడా ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి.

 

 ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు స్టడీ మెటీరియల్

 హైదరాబాద్: పోటీ పరీక్షల్లో అభ్యర్ధిని విజేతగా నిలిపే సాధనాలు.. నిరంతర శ్రమ, అంకితభావం. వీటితో ప్రామాణికమైన స్డడీ మెటీరియల్ కూడా ఉండాలి. ముఖ్యంగా స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవల్, స్టెనోగ్రాఫర్స్, జూనియర్ ఇంజనీర్ వంటి అన్ని పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు అప్లికేషన్ ఓరియంటేషన్‌లో ఉంటున్నాయి.

 

 వీటికి సరైన సమాధానాలు గుర్తించాలంటే విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ఈ తరుణంలో.. సాక్షి అన్ని ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో ఎగ్జామ్ గెడైన్స్‌తో పాటు వివరణలు, సాధనలతో కూడిన మెటీరియల్, గ్రాండ్ టెస్ట్‌లు, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, పాత ప్రశ్నా పత్రాలు అందుబాటులో ఉన్నాయి.

 

 ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో కామన్‌గా ఉండే సెక్షన్‌లు

 జనరల్ ఇంటెల్లిజెన్స్ అండ్ రీజినింగ్

 జనరల్ అవేర్‌నెస్

 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

 జనరల్ ఇంగ్లిష్

 వెబ్‌సైట్:

 http://sakshieducation.com/SSC/Index.htm

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top