నిత్యనూతన కెరీర్ ‘నిర్మాణం’.. ఆర్కిటెక్చర్


ఇంజనీరింగ్.. ఎన్నో కోర్సులు.. మరెన్నో బ్రాంచ్‌లు, స్పెషలైజేషన్లకు నెలవు! అయితే.. వినూత్నంగా, విభిన్నంగా, శతాబ్దాలుగా నిత్యనూతనంగా వెలుగులీనుతూ.. సమున్నత కెరీర్ అవకాశాలను అందిస్తోంది ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్! వాస్తవ అవసరాలతో పోల్చితే ప్రస్తుతం ఆర్కిటెక్చర్ ఇంజనీర్ల కొరత భారీగా ఉంది. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే నాటా-2015; అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సు, ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ..

 

 స్మార్ట్ సిటీలు, అర్బన్ డెవలప్‌మెంట్ ప్లానింగ్, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ప్రగతి కార ణంగా ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. మన దేశంలో ఏటా మూడు లక్షల మందికిపైగా ఆర్కిటెక్చర్ నిపుణులు అవసరమని అంచనా. కానీ, ఈ కోర్సు అందుబాటులో ఉన్న కాలేజీల సంఖ్య నాలుగు వందలు. వీటి నుంచి ఏటా పట్టాలతో బయటికివచ్చే వారి సంఖ్య నాలుగు వేలకు మించడం లేదు. నిపుణుల డిమాండ్-సప్లయ్‌లో తేడా దృష్ట్యా కోర్సు పూర్తిచేస్తూనే కలల కెరీర్ సౌధాలు నిర్మించుకోవడానికి ఆస్కారం కల్పిస్తోంది.. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్!



 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అంటే:

 సింగిల్ బెడ్‌రూం ఇల్లు.. బహుళ అంతస్తుల నిర్మాణం.. బ్రిడ్జ్‌లు.. రహదారులు.. వేటికైనా అందుబాటులో ఉన్న వనరులతో అందమైన రీతిలో డిజైన్‌లు రూపొందించి నిర్మాణాలు చేపట్టేది ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. భవంతుల డిజైన్‌లు, ఇంటీరియర్ డిజైన్లు, నగర నిర్మాణాలు చేపట్టడంలో ఆర్కిటెక్చర్ ఇంజనీర్లది ప్రధాన పాత్ర. వారిచ్చిన బ్లూ ప్రింట్స్ ఆధారంగానే ఆయా నిర్మాణాలు ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటాయి. దీనికి అవసరమైన నైపుణ్యాలు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ద్వారా లభిస్తాయి.

 

 బీఆర్క్.. కెరీర్ దిశగా తొలి అడుగు:

 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో కెరీర్ కోరుకునే వారికి తొలి అడుగు.. అయిదేళ్ల బీటెక్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. ప్రస్తుతం మన దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా దాదాపు నాలుగు వందల ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్- నాటాలో ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాయి. దేశంలోని ఆర్కిటెక్చర్ కళాశాలలను పర్యవేక్షించే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది.

 

 ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ఇలా:

 దేశంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలలో అందుబాటులో ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో ప్రవేశించడానికి ప్రత్యేక విధానం అమలవుతోంది. ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ రెండో పేపర్‌కు హాజరై ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఐఐటీల్లోని బీ.ఆర్క్ కోర్సులో ప్రవేశించాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ తర్వాత ప్రత్యేకంగా నిర్వహించే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు హాజరు కావాలి. ఈ ఏడాది ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ జూన్ 21న జరగనుంది. దీనికి అభ్యర్థులు నిర్దేశ తేదీల్లో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

 వివరాలకు వెబ్‌సైట్: jeeadv.iitm.ac.in

 

 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (్కఅ)

 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేకం గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, భోపాల్, విజయవాడలలో ఉన్న ఈ క్యాంపస్‌లలో బీఆర్క్ కోర్సులలో ప్రవేశాల ను జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు.

 

 ్కఅ.. పీజీ కోర్సులు కూడా:

 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ క్యాంపస్‌లలో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2015-16 పీజీ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్; అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్; సస్టెయినబుల్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లు ఎస్‌పీఏ విజయవాడ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, భోపాల్ క్యాంపస్‌లలో ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, అర్బన్ డిజైన్; ఇండస్ట్రియల్ డిజైన్; బిల్డింగ్ ఇం జనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ల్యాండ్ స్పేస్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.

 

 ్కఅ విజయవాడ ప్రవేశాల వివరాలు:

 ఈ క్యాంపస్‌లో ప్రతి స్పెషలైజేషన్‌లో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది సీట్లను నిట్- రూర్కెలా నిర్వహించే సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ విధానం ద్వారా భర్తీ చేస్తారు. మిగతా పది సీట్ల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ప్రవేశార్హత వివరాలు..

 

 ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, అర్బన్ ప్లానింగ్ అర్హత: సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ఫర్ ఎంటెక్/ ఎం.ప్లాన్/ఎం.ఆర్‌‌క(సీసీఎంటీ) ద్వారా ప్రవేశం కోరుకుం టే బీఆర్క్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్, బీఈ (సివిల్) ఇంజనీరింగ్‌లలో ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోర్ తప్పనిసరి. ఈ టెక్నికల్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రెండు స్పెషలైజేషన్లకు జాగ్రఫీ, ఎకనామిక్స్, సోషియాలజీలలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు కూడా అర్హులే.

 

 సస్టెయినబుల్ ఆర్కిటెక్చర్:

 ఈ స్పెషలైజేషన్‌లో కూడా పది సీట్లను సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ విధానం ద్వారా భర్తీ చేస్తారు. మిగతా పది సీట్లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలంటే.. 60 శాతం మార్కుల తో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ పరిధిలోలేని సీట్లకు గేట్ స్కోర్ లేని విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.spav.ac.in

 

 ప్రామాణికం.. నాటా స్కోర్

 ఎన్‌ఐటీలు, ఐఐటీలు మినహాయిస్తే దేశంలోని మిగతా అన్ని ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నాటాలో పొందిన స్కోర్ ప్రామాణికంగా నిలుస్తోంది. ఈ టెస్ట్‌ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహిస్తుంది. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించినాటా నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత: ఎంపీసీ గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.

 

 పరీక్ష స్వరూపం:

 నాటా రెండు విభాగాలుగా ఉంటుంది. అవి.. పేపర్ బేస్డ్ విధానంలో డ్రాయింగ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈస్థటిక్ సెన్సిటివిటీ టెస్ట్. రెండు గంటల వ్యవధిలో ఉండే డ్రాయింగ్ టెస్ట్‌లో అభ్యర్థిలోని సృజనాత్మక నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఏదైనా ఒక అంశాన్ని లేదా సందర్భాన్ని పేర్కొని, దానికి అనుగుణంగా చిత్రాన్ని రూపొందించమంటారు. ఈస్థటిక్ సెన్సిటివిటీ టెస్ట్‌లో అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక దృక్పథం, సృజనాత్మకత, ఆర్కిటెక్చర్ అవేర్‌నెస్, ఇమాజినేషన్ వంటి నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో మొత్తం 40 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఇలా మొత్తం రెండు వందల మార్కులకు ఉండే ఈ పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు పొందితేనే కౌన్సెలింగ్/ప్రవేశ ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు.

 

 పరీక్ష తేదీలు:

 నాటా పరీక్ష ఏప్రిల్ 1, 2015 నుంచి మే 25, 2015 వర కు అదే విధంగా జూన్ 1, 2015 నుంచి ఆగస్ట్ 21, 2015 వరకు రెండుసార్లు నిర్ణీత స్లాట్‌లలో జరుగుతుంది.

 అభ్యర్థులు తమకు అందుబాటులోని స్లాట్‌లలో పరీక్షకు ఎన్నిసార్లయినా హాజరు కావచ్చు. నాటా విషయంలో విద్యార్థులకు ఉన్న ప్రత్యేక వెసులుబాటు ఇది.

 ఒక స్లాట్‌లో తక్కువ స్కోర్ వచ్చినా మరో స్లాట్‌ను ఎంపిక చేసుకుని మెరుగైన స్కోర్ పొందేందుకు ఆస్కారం లభిస్తుంది.

 

 నాటా టెస్ట్ సెంటర్లు:

 ఆంధ్రప్రదేశ్‌లో భీమవరం, విశాఖపట్నంలలో; తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో టెస్ట్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమకు నచ్చిన టెస్ట్

 సెంటర్‌లో పరీక్షకు హాజరు కావచ్చు.

 వివరాలకు వెబ్‌సైట్: ఠీఠీఠీ.్చ్ట్చ.జీ

 

 ‘ఉన్నత విద్య’తో మరింత ఉన్నతంగా

 ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వెంటనే కార్పొరేట్ కొలువులు స్వాగతం పలకడం ఖాయంగా మారింది. అయితే పీజీ చేస్తే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. పీజీ స్థాయిలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో అందుబాటులో ఉన్న ముఖ్య స్పెషలైజేషన్లు - ఆర్కిటెక్చర్; అర్బన్ డిజైన్; ల్యాండ్ స్కేప్ ఇంజనీరింగ్; ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్; బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్; అర్బన్ అండ్ రీజనల్/సిటీ ప్లానింగ్; ఇండస్ట్రియల్ డిజైన్/ప్రొడక్ట్ డిజైన్; అర్బన్ డిజైన్.

 

 ప్రారంభంలోనే లక్షల వార్షిక ప్యాకేజీలు

 ఆర్కిటెక్చర్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ప్రారంభంలోనే రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలతో ఆఫర్లు అందుతున్నాయి. మౌలిక సదుపాయాల సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, కార్పొరేట్ కాంట్రాక్ట్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా ప్రభుత్వ రంగంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్; పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, రైల్వేస్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ తదితర శాఖల్లో సులువుగా కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అర్హతతో స్వయం ఉపాధికి కూడా విస్తృత ఆస్కారం ఉంది. సొంతంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే స్వయం ఉపాధిలో రాణించాలంటే.. సబ్జెక్ట్ నైపుణ్యంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎంతో అవసరం. కొంత పని అనుభవం గడించాక స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడం మంచిదని నిపుణుల అభిప్రాయం.

 

 

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top