రాజస్థాన్‌లో 941 ఇంజనీర్ పోస్టులు


రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగం (ఆర్‌వీయూఎన్) లిమిటెడ్..  ఇంజనీర్ పోస్టుల భర్తీకి రెండుప్రకటనలను జారీ చేసింది. భారీ వేతనాలను, ఆకర్షణీయమైనసదుపాయాలను కల్పిస్తున్న  ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ల వివరాలు..

 

 ఖాళీలు: మొత్తం పోస్టులు 941 (అసిస్టెంట్ ఇంజనీర్-284, జూనియర్ ఇంజనీర్-657)

 విభాగాల వారీగా అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీ: ఎలక్ట్రికల్-216, మెకానికల్-41, సివిల్-21, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-5, ఫైర్ అండ్ సేఫ్టీ-1విభాగాల వారీగా జూనియర్ ఇంజనీర్ వేకెన్సీ: ఎలక్ట్రికల్-374, మెకానికల్-161, సివిల్-72, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-38, ఫైర్ అండ్ సేఫ్టీ-12వేతనం: ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు ప్రొబేషన రీ ట్రైనీగా పనిచేయాలి. ఈ సమయంలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)కి నెలకు రూ.22,180, జూనియర్ ఇంజనీర్ (జేఈ)కి రూ.13,200 చెల్లిస్తారు. ప్రొబేషన్ అనంతరం ఏఈకి రూ.15,600-39,100+గ్రేడ్‌పే రూ.5,400; జేఈకి రూ.9,300-34,800+గ్రేడ్‌పే రూ.3,600 ఇస్తారు.

 

 విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌ల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.  వయసు: ఏఈ పోస్టులకు 2017 జనవరి 1 నాటికి కనీసం 21 ఏళ్లు, గరిష్టం 38 ఏళ్లలోపు ఉండాలి. జేఈ పోస్టులకు 2017 జనవరి 1 నాటికి కనీసం 21 ఏళ్లు, గరిష్టం 37 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.

 

 ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే (హిందీ సబ్జెక్ట్ మినహా) ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం అమలు చేస్తారు. ఓసీ అభ్యర్థులు కనీసం 30 శాతం, మిగిలిన కేటగిరీల వారు 20 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది. ప్రశ్నలను కింది సబ్జెక్టుల నుంచి రూపొందిస్తారు.   

 

 1.రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ: అనలిటికల్ రీజనింగ్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ ఔట్, కోడింగ్-డీకోడింగ్, షేప్స్, మిర్రర్ ఇమేజెస్, క్లాక్..

 2.మ్యాథమెటిక్స్: ఇంటర్మీడియెట్ స్థాయి

 3.జీకే అండ్ ఎవ్రీ డే సైన్స్: కరెంట్ ఈవెంట్స్; రాష్ట్రీయ (రాజస్థాన్), జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు; వార్తల్లో వ్యక్తులు, ప్రదేశాలు; గేమ్స్, స్పోర్ట్స్; సైన్స్, ఇండియన్ హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ (రాజస్థాన్‌కు ప్రాధాన్యత)       

 4.హిందీ జనరల్: హిందీ భాష, గ్రామర్ (పదో తరగతి స్థాయి)    

 5.ఇంగ్లిష్ జనరల్: ఇంగ్లిష్ భాష, గ్రామర్ (పదో తరగతి స్థాయి)

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

   దరఖాస్తు రుసుం:

  ఓసీలు రూ.600; మిగిలిన కేటగిరీల వారు

     రూ.300 చెల్లించాలి.

 దరఖాస్తుకు చివరి తేది:

 ఏఈ పోస్టులకు: అక్టోబర్ 5;

 జేఈ పోస్టులకు: అక్టోబర్ 13.

 వెబ్‌సైట్: www.energy.rajasthan.gov.in

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top