బాంబే హైకోర్టులో 100‘లా క్లర్క్’ పోస్టులు

బాంబే హైకోర్టులో 100‘లా క్లర్క్’ పోస్టులు






 బాంబే హైకోర్టుతోపాటు నాగ్‌పూర్, ఔరంగాబాద్‌లలోని హైకోర్టు బెంచ్‌ల్లో ‘లా క్లర్క్’ ఉద్యోగ ఖాళీలను ఏడాది కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సంబంధిత రిజిస్ట్రార్ జనరల్

 కార్యాలయం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

 

 విద్యార్హత:

 1. కనీసం 55 శాతం మార్కులతో ఫైనల్ ఎల్‌ఎల్‌బీ ఎగ్జామ్‌ను ఫస్ట్ అటెంప్ట్‌లో పాసైన తాజా లా గ్రాడ్యుయేట్లు (లేదా) న్యాయశాస్త్రంలో పీజీ         ఉత్తీర్ణులు.

 

 2. న్యాయశాస్త్రంలో పీజీ చేసినవారికి ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

 

 3. కంప్యూటర్/ల్యాప్‌టాప్, లా కేసులకు సంబంధిత సాఫ్ట్‌వేర్‌ల వినియోగంలో ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి.

 

 వయసు: 21-30 ఏళ్లు (విద్యార్థి చదివిన లా కాలేజీ ప్రిన్సిపల్/అభ్యర్థి పేరు నమోదైన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రికమండేషన్ చేసే తేదీని వయసు లెక్కింపునకు పరిగణనలోకి తీసుకుంటారు).

 దరఖాస్తు విధానం: దరఖాస్తుదారుల అభ్యర్థిత్వాన్ని కింది విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ / బార్ అసోసియేషన్ల అధ్యక్షుల్లో ఎవరైనా ఒకరు తప్పనిసరిగా రికమండ్ చేయాలి. ఈ విషయంలో సంబంధిత ప్రిన్సిపల్/          బార్ ప్రెసిడెంట్ నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలి.

 

 1.నేషనల్ లా స్కూల్-బెంగళూరు, హైదరాబాద్, జోధ్‌పూర్

 2.న్‌యూజేఎస్ లా కాలేజ్, కలకత్తా

 3.గవర్నమెంట్ లా కాలేజ్, చర్చ్ గేట్, ముంబై

 4.ఐఎల్‌ఎస్ లా కాలేజ్, పుణె

 5.సింబయాసిస్ లా కాలేజ్, పుణె

 6.యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, నాగ్‌పూర్

 7.ఎంపీ లా కాలేజ్, ఔరంగాబాద్

 8.ుశ్వంత్ లా కాలేజ్, నాందేడ్

 9.వీఎం సల్గాంకర్ లా కాలేజ్, మిరామర్, పణజి

 10.కారే లా కాలేజ్, మార్గోవ్, గోవా

 11.యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా లా కాలేజ్ (ఇది గౌరవ చీఫ్ జస్టిస్ ఆమోదానికి లోబడి ఉంటుంది)

 12.బాంబే బార్ అసోసియేషన్/అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా/ది ఇన్‌కార్పొరేటెడ్ లా సొసైటీ/హైకోర్టు బార్ అసోసియేషన్, నాగ్‌పూర్/హైకోర్టు బార్ అసోసియేషన్, ఔరంగాబాద్/హైకోర్టు బార్ అసోసియేషన్, పణజి, గోవా.

 

 ఎంపిక విధానం:

 1.పైన పేర్కొన్న విధంగా రికమండేషన్ కలిగిన అభ్యర్థులు బాంబే హైకోర్టులో జరిగే పర్సనల్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

 2.మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన గౌరవ చీఫ్ జస్టిస్ ఆమోదానికి లోబడి ఉంటుంది.

 గౌరవ వేతనం: నెలకు రూ.20,000 స్టైపెండ్/హానరోరియం చెల్లిస్తారు.

 

 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తుకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత, వయసు తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను, రికమండేషన్ లెటర్‌ను జతచేసి కింది అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్‌లో/కొరియర్‌లో/ఆర్‌పీఏడీలో/స్వయంగా పంపాలి.  చిరునామా: రిజిస్ట్రార్ (పర్సనల్), హైకోర్టు, అప్పిలేట్ సైడ్, బాంబే, ఫిఫ్త్ ఫ్లోర్, న్యూ మంత్రాలయ బిల్డింగ్, జీటీ హాస్పిటల్ కాంపౌండ్, బిహైండ్ అశోక షాపింగ్ సెంటర్, నియర్ క్రౌఫోర్డ్ మార్కెట్, ఎల్‌టీ మార్గ్, ముంబై, 400001.

 

 ముఖ్య తేదీలు:

 1.    దరఖాస్తులను పంపేందుకు చివరి తేది: 2016, సెప్టెంబర్ 30

 2.    ఇంటర్వ్యూ తేది: హైకోర్టు వెబ్‌సైట్‌లో/అభ్యర్థి           ఇ-మెయిల్‌కు తెలియజేస్తారు.

 వెబ్‌సైట్: http://bombayhighcourt.nic.in

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top