'మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు కావాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్కథ

రాక్షస పాలనను సాగనంపుదాం

Sakshi | Updated: January 27, 2017 13:19 (IST)
రాక్షస పాలనను సాగనంపుదాం
 వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో రావణ, రాక్షస రాజ్యాన్ని పారదోలేవరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు విశ్రమించవద్దని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. శనివారం పెంటపాడు మండలం అలంపురంలోని ధర్మా ఫంక్షన్‌ ప్లాజాలో జరిగిన మండల పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ మండల అ«ధ్యక్షుడు వల్లూరి బ్రహ్మానందం అధ్యక్షతన జరిగిన సమవేశంలో ఆళ్ల నాని మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంపై కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. పార్టీ కోసం కష్టపడాలని, కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండి సేవలందించిన కార్యకర్తలను అధికారంలో భాగస్వాములను చేస్తామని ఆయన హామీనిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసాలకు బలైపోయిన ప్రజలకు అండగా నిలవడానికే గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను నట్టేట ముంచి అప్పుల పాలు చేసిందని, కనీసం అర్హులకు రేషన్‌కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందన్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చని టీడీపీకి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయంతో దీటైన జవాబు చెప్పేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలన్నారు. ఒక సామాన్య వ్యక్తిగా గూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొంది అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మాని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను ఎలా బెదిరించాలా? అనే ఆలోచనలో ఇక్కడి మంత్రి ఉన్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన కొట్టు సత్యనారాయణపై కూడా అక్రమ కేసులు బనాయించారని, పార్టీ, ప్రజలు కేఎస్‌ఎన్‌కు అండగా నిలవడం వల్ల ఏమీ చేయలేక అధికార పార్టీ నేతలు తోక ముడిచారన్నారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీగా పేరు మార్చడం ఎంతవరకు సమంజసమని నాని ప్రశ్నించారు. వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్‌ యూనివర్సిటీగా మార్చాలని జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు నిస్సిగ్గుగా తీర్మానం చేయించారన్నారు. నియోజకవర్గ పరిశీలకులు చెలికాని రాజాబాబు మాట్లాడుతూ గడపగడపకు వైఎస్సార్‌ కార్యక్రమాన్ని కొట్టు సత్యనారాయణ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో లక్ష రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత తనకు లేదని చెప్పిన తాడేపల్లిగూడెంకు చెందిన ప్రజాప్రతినిధి రాష్ట్రంలో ఎక్కడ విలువైన ఆస్తులున్నా వాటిని తమ బంధువుల ద్వారా కొనడానికి నేడు సిద్ధంగా ఉన్నారని, అవినీతిరహిత పాలన అందిస్తున్నామని చెప్పే ప్రధాని మోదీ ఇలాంటి నేతలపై దృష్టి సారిస్తే మంచిదన్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మజ, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు సుధీర్‌బాబు, పార్టీ నాయకులు పోతంశెట్టి లక్ష్మి, మడిపల్లి పుష్పావతి, పాలా గణపతి, గుండుమోగుల సాంబయ్య, గొర్రెల లక్ష్మీనర్సమ్మ, బండారు నాగు, పిచ్చుకల రాజారావు, గోరింట రాఘవరాజు, కర్రి భాస్కరరావు, తెన్నేటి జగజ్జీవన్, వింజమూరి శ్రీనివాస్, చింతపల్లి శ్రీనివాస్, మల్లిపూడి జాయ్‌బాబు, కుమారస్వామి, శ్రీను, కట్టుబోయిన కృష్ణప్రసాద్, మద్దుకూరి సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 
 
 
 
 
 

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అంగన్‌వాడీలపై వరాల జల్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC