21న జాబ్‌ మేళా


ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈనెల 21న అర్హులైన నిరుద్యోగులకు నేరుగా ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కార్యక్రమం కింద ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ పథకం ద్వారా వివిధ ఉద్యోగాల్లో నియమిస్తామన్నారు. క్యాషియర్, ఆడిట్‌ ఇన్‌ఛార్జ్, సేల్స్‌ అడ్వైజర్, ఆఫీస్‌ అసిస్టెంట్, అసిస్టెంట్‌ టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు 21న స్థానిక వట్లూరు టీటీడీసీలో జరిగే కార్యక్రమానికి హాజరుకావచ్చన్నారు. ఉద్యోగాలన్నీ ఏలూరు, విజయవాడ, వీరవల్లి, నారాయణపురం, పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉంటాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీయువకులు ఉదయం 8 గంటలకు తమ ఆధార్‌ జిరాక్స్, ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, ఫొటోలు, తెల్లరేషన్‌ కార్డు జిరాక్స్‌తో హాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు జాబ్స్‌ జిల్లా మేనేజర్‌ కె.రవీంద్రబాబును 89859 06062 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

 
Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top