ముంపు మండలాల్లో వైఎస్ జగన్ పర్యటన ఖరారు

సమావేశంలో మాట్లాడుతున్న అనంత ఉదయ్ భాస్కర్, వేదికపై రాజేశ్వరి - Sakshi


 జూలై 2న రానున్నారని ప్రకటించిన ఎమ్మెల్యే రాజేశ్వరి, యువ నేత అనంతబాబు

 ప్రజలను అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపు

 

 రేఖపల్లి(వీఆర్‌పురం) : విలీన మండలాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటన జూలై 2వ తేదీన ఖరారైందని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) ప్రకటించారు. రేఖపల్లిలో శనివారం వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల వైఎస్సార్‌సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించి పర్యటనపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో  కాపు ఉద్యమం కారణంగా ఈ నెల 16వ తేదీన ఖరారైన పర్యటనను రద్దు చేసుకున్న విషయూన్ని గుర్తు చేశారు.

 

పశ్చిమ పర్యటన అనంతరం...

జులై 1వ తేదీన జగన్ మోహన్‌రెడ్డి ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా విలీన మండలాల్లో పర్యటించిన అనంతరం తూర్పు విలీన మండలాల్లో 2న పర్యటిస్తారన్నారు. భద్రాచలంలో రాత్రి విశ్రాంతి తీసుకొని 2న ఎటపాక మండలం మీదుగా కూనవరం చేరుకొని అక్కడి నుంచి రేఖపల్లిలో నిర్వాసిత రైతులతో మాట్లాడతారని చెప్పారు.


అనంతరం రేఖపల్లి చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాచర్ల గంగులు, ఆవుల మరియాదాస్, రమేష్ నాయుడు, కడియం రామాచారి, మంత్రిప్రగడ నరసింహారావు, ఎండీ మూసా, కొవ్వూరి రాంబాబు, వైఎస్సార్ సీపీ మండలాల కన్వీనర్లు పొడియం గోపాల్, ఆలూరి కోటేశ్వర రావు, కిశోర్‌బాబు, వై.రామలింగారెడ్డి, వాసు  జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top