రెండేళ్లు రక్షించుకుందాం!

రెండేళ్లు రక్షించుకుందాం! - Sakshi

మీ భూములు బాబు లాక్కున్నా మేం వెనక్కి ఇచ్చేస్తాం

► బందరు పోర్టు బాధిత రైతులకు వైఎస్ జగన్ భరోసా

 ఇక రెండేళ్లే... దేవుడు దయదలిస్తే అంతకన్నా ముందే ఎన్నికలు

 ఈ దుర్మార్గపు పాలన పోవాలి.. వైఎస్సార్ పాలన రావాలి

 పేదల భూములు లాక్కొని.. బడా బాబులకు ఇవ్వాలనుకుంటున్నారు

 ప్రతిపక్షంలో ఉండగా 5 వేల ఎకరాలే ఎక్కువన్నారు

 ఇపుడు 1.05 లక్షల ఎకరాలు లాక్కుంటారా?

 అసైన్‌‌డ భూమి అంటే.. మీ అత్త సొత్తా?

 సాగునీరు ఆపడం, రుణాలు అందకుండా చేయడం దారుణం

 ఇంత దిక్కుమాలిన సీఎం దేశంలో ఎక్కడా లేడు

 

 సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ‘చంద్రబాబు నాయుడి పాలన ఎల్లకాలం ఉండదు. మూడేళ్లు కలిసికట్టుగా నిలబడి భూములను కాపాడుకున్నాం. ఇంకెంత.. మరో రెండేళ్లు? కళ్లు మూసుకుంటే గడిచిపోతుంది. దేవుడి దయ ఉంటే.. రెండేళ్లు కూడా పట్టదు. అంతకంటే ముందుగానే.. రేపోమాపో ఎన్నికలు వచ్చినా వచ్చేస్తాయి. ఈ దుర్మార్గపు పాలన పోవాలి. పేదల భూములు లాక్కొని.. బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టి లాభం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అందరం కలిసి బంగాళాఖాతంలో కలిపేద్దాం. 

 

 తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం భూములు లాక్కున్నా... మనం వచ్చిన తర్వాత రైతులకు వెనక్కి ఇచ్చేస్తాం’ అని బందరు పోర్టు బాధిత రైతులకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పోర్టు నిర్మాణం కోసం అంటూ భూ సమీకరణ పేరిట మచిలీపట్నం ప్రాంతంలో రైతుల నుంచి 1.05 లక్షల ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న పోరాటానికి అండగా నిలవడానికి, బాధిత రైతులకు భరోసా ఇవ్వడానికి జగన్.. గురువారం మచిలీపట్నం మండలంలో పర్యటించారు.బుద్దాలపాలెం, కోన గ్రామాల్లో రైతులతో ముఖాముఖి మాట్లాడారు.



పోర్టు నిర్మాణానికి 4-5 వేల ఎకరాలు అవసరం లేదంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన చంద్రబాబుకు అధికారంలోకి వచ్చిన తర్వాత భూదాహం పట్టుకుందని విమర్శించారు. ‘‘5 వేల ఎకరాలే అవసరం లేదన్న చంద్రబాబు.. తర్వాత 30వేల ఎకరాలు కావాలన్నారు.. తర్వాత 1.05 లక్షల ఎకరాలు భూ సమీకరణ పేరిట రైతుల నుంచి లాక్కోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. రైతులంటే ముఖ్యమంత్రికి అంత చులకనా? ప్రభుత్వానికి ఇది ధర్మమా?’’ అని జగన్ ప్రశ్నించారు. గత సంవత్సరం ఇక్కడికి వచ్చి.. రైతుల భూముల లాక్కోవద్దని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అరుునా చంద్రబాబుకు బుద్ధి మారలేదని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

 

 రైతులను వేధించడం తగునా?

‘‘భూములు లాక్కోవడానికి  ప్రయత్నిస్తున్నప్పటి నుంచీ.. పొలానికి రైతును దూరం చేయాలని ప్రభుత్వం దుష్టపన్నాగం పన్నింది. రెండేళ్ల నుంచి రైతులకు సాగునీరు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది. సాగుకు కాల్వల్లో నీరివ్వకుంటే.. రైతులు భూములు ఇచ్చేస్తారని ప్రభుత్వ వ్యూహం. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంది. భూమిని బ్యాంకుల్లో పెట్టుకొని.. అప్పు తీసుకుందామనుకున్నా రైతులకు అవకాశం లేకుండా ప్రభుత్వం కట్టడి చేస్తోంది. పిల్లల చదువులకో.. వైద్యానికో.. పెళ్లిళ్లకో భూమి అమ్ముకోవాలనుకున్నా.. రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపేసింది. భూమి లాక్కోవడానికి రైతులను వేధించడం ప్రభుత్వానికి తగునా? చంద్రబాబుకు మనసు అనేది ఉంటే.. రైతుల భూములు లాక్కొనే ప్రయత్నాన్ని వెంటనే ఆపేసి.. రైతులకు క్షమాపణలు చెప్పాలి.

 

 చిల్లిగవ్వ ఇవ్వకుండా భూములు లాక్కొంటున్నారు

 భూములు కొనడానికి ఒక పద్దతి ఉంటుంది. మార్కెట్ ధర ఇవ్వడానికి సిద్ధమైతే.. ఆ ధర రైతులకు నచ్చితే.. భూమి అమ్మాల్సిన అవసరం రైతుకు ఉంటే.. భూమి విక్రయించడానికి రైతు సిద్ధపడతాడు. కానీ చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా రైతుల నుంచి భూములు లాక్కొని, ఆ భూమిలో పావలా భాగాన్ని, ఇంకా అంతకంటే తక్కువ భూమిని భిక్షం వేసినట్లు రైతులకు వేస్తారా? ఎకరాకు 4,800 గజాలు వస్తుంది. అందులో 800 లేదా 1000 గజాలు భిక్షం వేసినట్లు రైతులకు వేస్తారు. సంవత్సరానికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున పదేళ్లు ఇస్తామంటున్నారు. అది కూడా పదేళ్ల సొమ్ము కలిసి రూ. 3 లక్షలకు ఒకే సారి చెల్లించరు. కనీసం ఒకే దఫాగా చెల్లిస్తే.. ఆ సొమ్ము బ్యాంకులో పెట్టుకుంటే.. వడ్డీ అయినా వస్తుంది. ఆ అవకాశం కూడా రైతులకు లేదు. రైతులను నిలువునా మోసం చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది. ఇదే.. ఇలాంటి మోసమే రాజధానిలో కూడా చంద్రబాబు చేశారు. రాజధానిలో ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసు కదా! రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు. కట్టిన తాత్కాలిక నిర్మాణానికి కూడా చదరపు అడుగుకి రూ.6వేలు చెల్లించారు. బైట అడుగుకు వెయి, పన్నెండొందలు కూడా లేదు. ఆ స్థారుులో పెట్టారంటేనే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఎంత అవినీతి జరిగిందో..

 

 4-5 వేల ఎకరాలు సరిపోవా?

 పోర్టు నిర్మాణానికి 4-5 వేల ఎకరాలకు మించి అక్కర్లేదు. ఇంతకంటే తక్కువ విస్తీర్ణంలోనే 240 మిలియన్ టన్నుల ఎగుమతి సామర్థ్యం లో పోర్టు నిర్మించవచ్చు. కృష్ణపట్నం పోర్టు ప్రస్తుత ఎగుమతి సామర్థ్యం 50 మిలియన్ టన్నులే. బందరు పోర్టు ఎగుమతి సామర్థ్యం 240 మిలియన్ టన్నులకు చేరడానికి మరో 50 ఏళ్లు పడుతుంది.  పోర్టు నిర్మాణానికి 1,200 ఎకరాలు సరిపోతాయన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత 1.05 లక్షల ఎకరాల రైతుల భూములు లాక్కొంటున్నారు. ముఖ్యమంత్రి అరుున తర్వాత బడా పారిశ్రామికవేత్తలకు సాగిలపడి.. రైతుల నుంచి కొల్లగొట్టిన భూములను వారికి ధారదత్తం చేసి లబ్దిపొందాలనుకుంటున్నారు.

 

 రైతులు సంతోషంగా ఇస్తేనే తీసుకోవాలి

 4-5 వేల ఎకరాలు కూడా రైతులు సంతోషంగా ఇస్తేనే తీసుకోవాలి. రైతులు సంతోషంగా ఇవ్వాలంటే.. వారికి నచ్చే ధర చెల్లించాలి. ఎకరాకు రూ. 40-50 లక్షలు ఇస్తే చంద్రబాబు సొమ్మేం పోతుంది? రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటే రైతుల ఉసురు తగులుతుంది. పోర్టుకు లక్ష ఎకరాలు ఎందుకని అడిగితే... ‘పోర్టు నిర్మించి అభివృద్ధి చేసిన తర్వాత..పరిశ్రమలు పెట్టాలని ఎవరైనా వస్తే రైతులు ఎకరా రూ. 1-1.5 కోట్లు చెబుతారు. రైతులకు ఆశ ఎక్కువ. అంత ధర పెట్టి ఎలా తీసుకోగలం. అందుకే ముందుగానే లాక్కొంటున్నాం. రైతుల నుంచి లాక్కున్న తర్వాత.. అప్పుడు పలికే ధర రూ. 1-1.5 కోట్లలో వాటా తీసుకుంటాం’ అని చంద్రబాబు సమాధానం చెబుతున్నారు. 4-5 వేల ఎకరాల్లో పోర్టు నిర్మించిన తర్వాత.. పారిశ్రామికవేత్తలకు భూమి అవసరమైతే వారే రైతులతో నేరుగా మాట్లాడుకొని మార్కెట్ ధర చెల్లించి కొనుక్కుంటారు. ధర ఆమోదయోగ్యమైతే రైతులు విక్రరుుస్తారు. రైతుల భూములకు మంచి ధరలు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదా?

 

 వచ్చేది మనందరి ప్రభుత్వమే..

 ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. బిడ్డలకు నష్టం, కష్టం కలగడానికి ఏ తండ్రీ అంగీకరించడు. కానీ చంద్రబాబు .. బిడ్డల్లాంటి పేదల నుంచి భూములు లాక్కొంటున్నారు. పైగా అసైన్‌‌డ భూములకు తక్కువ స్థలం ఇస్తామంటున్నారు. పేదల పట్ల మరింత ప్రేమగా ఉండాల్సిన ముఖ్యమంత్రి.. అసైన్‌‌డ పేరిట వారి పొట్టకొట్టడం న్యాయంగా లేదు. అసైన్‌‌డ భూమి అంటే.. అత్తగారి సొత్తరుునట్లు ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ దుర్మార్గపు పాలన పోవాలి. పోయేదాకా దేవుళ్లకు మొక్కండి. అందరం కలిసికట్టుగా ఉండి చంద్రబాబు దుర్మార్గపు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది. దేవుని దయ ఉంటే అంతకంటే ముందుగానే ఎన్నికలు రావచ్చు. తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం. అప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తులు రైతుల వెంట్రుక కూడా పీకలేరు.’’ అని జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

 

 వైఎస్సార్ పాలన రావాలి

 పిల్లల ఫీజులు చెల్లించడానికి భూములు అమ్ముకుందామనుకున్నా ప్రభుత్వం అవకాశం లేకుండా చేసిందని బుద్దాలపాలెంలో ఒక మహిళ జగన్ దృష్టికి తెచ్చింది. దీనికి స్పందించిన జగన్.. ‘‘చదువుల కోసం పేదలు అప్పులపాలు కాకూడదని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. పేదల చదువుల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తెచ్చారు. దానికీ చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. కాలేజీల యాజమాన్యాలతో కుమ్మక్కయి ఫీజులు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు.. పెరిగిన ఫీజును రీయింబర్స్ చేయడానికి నిరాకరించారు. ఫీజు 70 వేల నుంచి రూ. లక్ష వరకు ఉన్నా.. పెంచిన ఫీజు చెల్లించకుండా పాత ఫీజునే ప్రభుత్వం చెల్లిస్తుందని ఆంక్షలు పెట్టారు. భూమి లేది ఇల్లు తెగనమ్ముకొని పేదలు ఫీజులు చెల్లిస్తున్నారు. 

 

 ఈ పరిస్థితి మారాలి. ఈ దుర్మార్గపు ప్రభుత్వం పోవాలి. వైఎస్సార్ పాలన మళ్లీ రావాలి. పేదవాడు చదువుల కోసం అప్పులపాలు కాకుండా ఉండే రోజు రావాలి. పేదల ఇళ్లల్లో పిల్లలంతా మంచి చదువులు చదువుకుంటే పేదరికం అంతరించి పోతుందని దివంగత నేత వైఎస్సార్ భావించారు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తెచ్చి పేదలకు ఉన్నత చదువులు దక్కేటట్లు చేశారు. కానీ చంద్రబాబు.. బీసీ పట్ల ఎంతో ప్రేమ ఉందని చెబుతారు. బీసీలకు ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇస్తే బాగుపడతారా?’’ అని జగన్ ప్రశ్నించారు.

 

 నో చంద్రబాబు..

 కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో రైతులతో జగన్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ‘నో చంద్రబాబు’ నినాదంతో హోరెత్తింది. పోర్టు నిర్మాణం పేరు చెప్పి భూ సమీకరణ పేరిట 1.05 లక్షల ఎకరాల రైతుల భూములు తీసుకోవడాన్ని జగన్ తీవ్రంగా నిరసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును వ్యతిరేకించే వారంతా ‘నో చంద్రబాబు’ అని రెండు చేతులు పెకైత్తి నినాదం చేయాలని జగన్ సూచించారు. దానికి స్పందించిన రైతులంతా.. రెండు చేతులు పెకైత్తి ‘నో చంద్రబాబు’ అని నినదించి ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. 10-15 సార్లకు పైగా రైతులంతా ఈ నినాదాలను కొనసాగించారు.

 - సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top