అత్తవారింటి నుంచి పుట్టింటి వరకు..

అత్తవారింటి నుంచి పుట్టింటి వరకు.. - Sakshi


మచిలీపట్నం: కృష్ణా జిల్లా బందరుపోర్టు బాధితులు తమ కష్టాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుట ఏకరువు పెట్టారు. గురువారం బందరు మండలం బుద్దాలవారి పాలెంలో జరిగిన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. మహిళలు, రైతులు తమ సమస్యలను వైఎస్‌ జగన్‌కు వివరించారు. భూములు ఇచ్చేందుకు తమకు ఇష్టం లేకున్నా చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని, తమకు అండగా నిలవాలని కోరారు. వైఎస్‌ జగన్‌తో ఎవరు ఏం చెప్పారంటే..  

కాళికారావు, బుద్దాలపాలెం రైతు

మాది మూడు పంటలు పండే పొలం. వరి, శనగ, మినుము పండుతాయి. కానీ రైతులకు వరి తప్ప మరోటి వేయడం తెలియదు. భూసేకరణ నోటిఫికేషన్ తర్వాత ఏడాది గడిచింది, ఇప్పుడు భూ సమీకరణ అంటున్నారు. రైతు మెడపైన కత్తిపెట్టి, నరికేస్తా.. భూములిచ్చెయ్యమని అంటున్నారు. రెండేళ్ల నుంచి నీళ్లు వదలడం లేదు, బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం మానేశారు. భూముల రిజిస్ట్రేషన్లు ఆపేశారు.


కల్యాణమ్మ, కరగ్రాహారం

  • మా అత్తవారింటి నుంచి పుట్టింటి వరకు భూములు తీసుకుని పోర్టు కట్టేస్తున్నారు
  • మేం సెంటు భూమి కూడా ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదు
  • నాన్నగారు పసుపు కుంకుమ కింద నాకు పొలం ఇచ్చారు. అదీ కూడా పోర్టు కోసం తీసుకుంటున్నారు
  • పోర్టు కోసం మేం భూములు ఇవ్వడం లేదని పంటలకు నీళ్లు ఇవ్వడం ఆపేశారు
  • బ్యాంకుల దగ్గరకు వెళ్తే లోన్లు ఇవ్వడం లేదు
  • మా అబ్బాయి కాలేజీ ఫీజు కోసం బ్యాంకుకు వెళ్తే లోన్‌ ఇవ్వలేదు
  • మాకు అండగా నిలబడిన వైఎస్ఆర్‌ సీపీ నాయకుడు పేర్ని నానికి గాజులు వేస్తామని టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ నాయకులకు మహిళలంటే అంత చులకనా?


గాయత్రి

  • మా ఊరిలో 700 ఎకరాలు పోర్డుకు కోసం తీసుకుంటున్నారు
  • ఇందులో శ్మశానం, అంగన్‌వాడీ కేంద్రం భవనం, చెరువులు, పంట కాల్వలు, పంట భూములు ఉన్నాయి.
  • మే సెంటు భూమి కూడా ఇవ్వం
  • రైతులు ఇవ్వకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
  • చంద్రబాబు మా గ్రామాలకు రారు, ప్రజల ఇబ్బందులు తెలుసుకోరు


నాగేశ్వరరావు, రైతు

  • మావి మూడు పంటలు పండే పొలాలు. దొంగతనంగా పొలాలను తీసుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది
  • నాకు పదెకరాల పొలం ఉంది. పెళ్లీడు కొచ్చిన పిల్లలు ఉన్నారు
  • బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు
  • మా భూములను చంద్రబాబు బలవంతంగా లాక్కోవడం ధర్మమేనా?
  • నీళ్లు ఇవ్వకపోడంతో రెండు పంటలు పండలేదు
     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top