యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి - Sakshi


ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌

► గుట్కా నిషేధం కరపత్రాల విడుదల

నిర్మల్‌టౌన్  :
  యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ పేర్కొన్నారు. గురుకృప ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల జాతీయ సేవాపథకం వాలంటీర్లు రూపొందించిన కరపత్రాలను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విడుదల చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడారు. నేటి సమాజంలో యువత వ్యసనాల బారిన పడుతున్నారని ఆవేదనం వ్యక్తం చేశారు. యువతతో పాటు పెద్దవాళ్లు సైతం గుట్కాకు బానిసలు అవుతున్నందున  గుట్కా వాడకం విపరీతంగా పెరిపోయిందని అన్నారు.


భైంసా పట్టణానికి చెందిన గురుకృప వొకేషనల్‌ జూనియర్‌ కళాశాల జాతీయ సేవాపథకం వాలంటీర్లు గుట్కా వాడకం వల్ల సంభవించే రోగాలను తెలియజేస్తూ కరపత్రాలను రూపొందించడం అభినందనీయమని కొని యాడారు. గుట్కా తినడం ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. ఎవరైనా గుట్కా విక్రయాన్ని చేపడితే వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో డాక్టర్‌ రామకృష్ణగౌడ్, డైరెక్టర్‌ సాయినాథ్, ప్రిన్సిపాల్, ఎన్ ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.



పీపుల్స్‌ ఫ్రెండ్లీ..

ప్రజలకు పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులుగా సేవలిందిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. స్థానిక పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నలుగురు ఎస్పీకి  ఫిర్యాదులు అందజేశారు. సమస్యను ఎస్పీకి తెలియజేసి అర్జీలను సమర్పించారు. వారి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్  ద్వారా మాట్లాడి విచారణకు ఆదేశించారు.


అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని అన్నారు. వారితో స్నేహభావంతో మెలగాలని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు.  శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాత్రి పూట పెట్రోలింగ్‌ పెంచి నేరాలను అరికడతామని తెలిపారు. పోలీసుస్టేషన్ కు ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.



శారీరక దారుఢ్యానికి పరేడ్‌..

జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారి జిల్లా సాయుధ దళ పోలీసు సమీకరణ కవాతు(మొబిలైజేషన్  పరేడ్‌)ను ఎస్సీ  సాయుధ దళ పరేడ్‌ ప్రాంగణంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా సాయుధదళ పోలీసులకు ఈ కవాతు ప్రతి ఏడాది ఒకసారి ఉంటుందని అన్నారు. జనవరిలో జిల్లా సాయుధ దళ పోలీసులకు పరేడ్‌ సందర్భంగా రెండు వారాల పాటు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. పరేడ్‌ వల్ల శారీరక దారుఢ్యం, చురుకుదనం ఉంటాయని దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. 


సమాజంలో నేరాల నియంత్రణ కోసం, విధులలో అప్రమత్తతకై ఆయుధాల పరిజ్ఞానం, పరేడ్‌ శిక్షణ, యోగ, వ్యాయామం, ఫైరింగ్‌ లాంటి అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. ఇది ప్రతీ రోజు ఉదయం 6గంటలకు  ప్రారంభమవుతుందన్నారు. ఇందులో  ఇంచార్జీ ఆర్‌ఐ సాయినాథ్, ఎంటీఓ కృష్ణ, ఆర్‌ ఎస్సైలు శ్రీకాంత్, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top