ఐక్యతతోనే రాణింపు

ఐక్యతతోనే రాణింపు


పరిగి (పెనుకొండ రూరల్‌) : ఐక్యత ఉన్నప్పుడే ఏరంగంలో నైనా రాణించ గలమని మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, గురునాథ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం  ప్రజాకవి యోగివేమన శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు.  యువతరం పోటోలు, సెల్ఫీలపై దృష్టి పెట్టకుండా రాజ్యధికారం కోసం ముందుండి నడిపించాలన్నారు. దీనివల్ల పది మందికి సాయం చేయవచ్చునన్నారు. అనైక్యత అభివృద్ధి నిరోధకమన్నారు. కర్ణాటక డిప్యూటీ స్పీకర్‌ శివశంకరరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్‌ తోపుదుర్తి కవిత, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్‌ శివశంకరరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రజల బాధ్యతను సరళ భాషలో విశదీకరించిన మహనీయుడు వేమన అని కొనియాడారు.



రెడ్డి వర్గీయులు  పార్టీల కతీతంగా భావితరాలకు అభివృద్ధి చిహ్నంగా ఉండాలన్నారు. అంతకుముందు వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజాకవి యోగివేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రెడ్డి సంక్షేమ కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేసి శంకుస్థానన న చేశారు. స్థలదాత ఆదినారాయణరెడ్డి, గౌరిబిదనూర్‌ మాజీ ఎమ్మెల్యే అశ్వర్థనారాయణరెడ్డి, మడకశిర మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకరరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు వైస్‌ చైర్మన్‌ ఆనందరంగారెడ్డి, ఇండిన్‌ ఒలిపిక్‌ అసోషియేసన్‌ అధ్యక్షులు జేసి పవన్‌కుమార్‌రెడ్డి, పెనుకొండ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి మారుతీరెడ్డి తదితర నాయకులు,రెడ్డి సామాజికవర్గంవారు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top