ఆదర్శప్రాయుడు రుక్మిణి రాంరెడ్డి


  • సాంస్కృతిక సైనికుడు  

  • ఆయన ఆశయ సాధన కోసం పాటుపడాలి

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

  • మహబూబాబాద్‌ : ప్రముఖ విద్యావేత్త, రచయిత, కార్టూనిస్ట్‌ రుక్మిణి రాంరెడ్డి ఆదర్శ ప్రాయుడు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో  రాంరెడ్డి సంస్మరణ సభను శనివారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి నాయకులు, ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యు డు సాదుల శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాంరెడ్డి ఆశయ సాధన కోసం పాటుపడాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిలోను, పలు రంగాల్లోను రాణించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సాంస్కృతిక సైనికుడు అని ఆయనను సాంస్కృతిక రంగం ఉన్నంత వరకు ఎవరూ మరిచిపోరన్నారు.  కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.రాములు, నాయకులు రాజారావు, జి.నాగయ్య, సారంపెల్లి వాసుదేవరెడ్డి, చుక్కయ్య, సీహెచ్‌.రంగయ్య, శెట్టివెంకన్న, ఆకులరాజు, సూర్నపు సోమయ్య, జి.రాజన్న, ఎస్‌.రాజమౌళి, డి.రాంమూర్తి,  కె.మహేష్,  భాగ్య మ్మ, సీతారామ్, రుక్మిణి పాల్గొన్నారు. 

    పార్టీలు మారడం.. 

    చొక్కాలు మార్చినంత సులువైంది  

    చొక్కాలు మార్చినంత సులువుగా నాయకులు పార్టీలు మారుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  శనివారం జరిగిన విద్యావేత్త  రాంరెడ్డి సంతాప సభలో ఆయన మాట్లాడారు. డబ్బుపై వ్యామోహంతో పాటు స్వార్థం పెరిగిపోయి రాజకీయం అంతా వ్యాపారంగా మారిందని ఆవేదన వ్య క్తం చేశారు. ప్రభుత్వాలు మారినా పాలనా విధానంలో మార్పు రావడం లేదని, ప్రజలకు మేలు జరుగడం లేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో శృతి, సాగర్‌ ఎ¯ŒSకౌంటర్‌ జరిగిందని, మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ విషయంలో 144 సెక్ష¯ŒS విధించడం దారుణమన్నారు. బంగారు తెలంగాణ ముఖ్యంకాదని తొలుత ప్రజల బతుకులు మారాలన్నారు. విద్యా, వైద్యం ప్రజలకు అందుబాటులోకి రావాలన్నారు. రాష్ట్రంలో 3.50 కోట్ల పై చిలుకు జనాభా ఉందని ఆ జనాభాలో ఎస్సీ లు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే ఎక్కువగా ఉన్నారని, వారి జనాభాను బట్టి ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలని తమ్మినేని కోరారు. సామాజిక న్యాయం అంటే ఆ వర్గానికి చెం దిన కొంతమంది వ్యక్తులకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడం కాదని, ప్రజలకు న్యాయం జరిగే పాలన సాగాలన్నారు. రాజకీయ స్వభా వం మారినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు    
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top