కార్మికులసమస్యలు పరిష్కరించాలి

కార్మికులసమస్యలు పరిష్కరించాలి - Sakshi


శ్రీకాకుళం అర్బన్‌:ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే యాజమాన్యం పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఆర్టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రీజనల్‌ కార్యదర్శి ఎం.ఎ. రాజు, జోనల్‌ ఆఫీస్‌ బేరర్‌ బి.టి.రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీఎస్‌ ఆర్టీసీ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ రెండు రోజుల రిలేనిరాహారదీక్ష కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో దీక్షా శిబిరం సోమవారం నిర్వహించారు.  ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడుతూ మే 2015 నెలలో జరిగిన 8 రోజుల సమ్మె కాలపు జీతాన్ని ఏరియర్స్‌తో కలిపి చెల్లించాలని, జూలై–2016 నుంచి రావాల్సిన డీఏను ఏరియర్స్‌తో సహా వెంటనే చెల్లించాలని, అంగీకరించిన ప్రకారం సమైక్యాంధ్ర సమ్మె కాలానికి 60రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని, గ్యారేజీల్లో అన్ని కేటగిరిలలో ఖాళీలను భర్తీ చేయాలని, రద్దు చేసిన సర్వీసులను పునరుద్ధరించాలని, అన్ని సర్వీసులకు అవసరం మేరకు రన్నింగ్‌టైం ఇవ్వాలని, కొత్తబస్సులు ప్రవేశపెట్టాలని, డిస్‌ ఎంగేజ్‌ అయిన కండక్టర్, డ్రైవర్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, అంగీకరించిన మేరకు పెండింగ్‌లో ఉన్న యూనిఫాం ఇవ్వాలని, 2015 లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్‌ వెంటనే చెల్లించాలని, 2013 నుంచి జోనల్‌ వర్క్‌షాపు టైర్‌షాపుల్లో రివైజ్డ్‌ మ్యాన్‌ పవర్‌ రేటును అమలు చేసి బకాయిలు చెల్లించాలని, నష్టాల పేరుతో సర్వీసులు రద్దు చేసే ప్రక్రియను నిలుపుదల చేయాలని తదితర డిమాండ్‌లపై ఈ రెండు రోజులు రిలే నిరాహారదీక్ష చేçపడుతున్నామని తెలిపారు. ఈ «నిరాహారదీక్షా శిబిరంలో సోమవారం దీక్షకు దిగిన వారిలో ఎన్‌ఎంయూ నేతలు ఎం.జి.కృష్ణా, ఎం.ఆర్‌.మూర్తి, పి.రమణ, ఆర్‌వీఎస్‌ఎస్‌ రావు, కె.పి.రావు, జె.ఆర్‌.కుమార్, టి.ఎస్‌.నారాయణ, ఎం.ఎస్‌.రాములు, బి.పి.రాజు, జె.ఎం.రావు,  ఎం.ఎన్‌.రావు, ఆర్‌.వి.రావు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top