తహశీల్దార్‌ ఆఫీసులో మహిళ ఆత్మహత్యాయత్నం


బూర్గంపహాడ్‌(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): బూర్గంపహాడ్ తహసీల్ధార్ ఆఫీసులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సారపాకకు చెందిన సదరు మహిళ తన భూమిని కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయింది. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయం గురించి స్థానిక తహశీల్దార్‌ పోలీసులకు సమాచారం అందించారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top