రైలులో యువతి మృతి


శ్రీకాకుళం: ఆమదాలవలస రైల్వే అధికారులు ఓ యువతి ప్రాణం కాపాడేందుకు చేసిన ప్రయత్నం వృథా అయ్యింది. చివరకు యువతి రైలులోనే మృతి చెందింది. ఈ సంఘటన ప్రయూణికులను విషాదానికి గురి చేసింది.



వివరాల్లోకి వెళ్తే...హౌరా నుంచి యశ్వంతపూర్‌కు దురంతో ఎక్స్‌ప్రెస్ మంగళవారం బయలుదేరింది. ఇందులో ప్రయూణిస్తున్న ఎ.గోస్వామి(22) అనే యువతి పలాస సమీపంలో తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీన్ని గమనించిన టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్(టీటీఈ) వద్ద శ్రీకాకుళం చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ ఎల్.ఆనంద్ ఫోన్ నంబరు ఉండడంతో ఆయనకు సమాచారం అందించారు. దురంతో రైలుకు శ్రీకాకుళంలో హాల్ట్ లేకపోవడంతో ఆనంద్ స్టేషన్ సూపరింటెండెంట్ రవికి విషయాన్ని తెలియజేశారు.



రైల్వే డాక్టర్ విజయనగరంలో విధులు నిర్వర్తించడం వల్ల అధికారులిద్దరూ మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రైవేటు వైద్యుడైన మల్లెల కృష్ణప్రసాద్‌ను స్టేషన్‌కు రప్పించారు. శ్రీకాకుళం స్టేషన్‌కు రైలు రాగానే రోగి బంధువులు చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. వెంటనే వైద్యుడు ఎస్-3లో ప్రయూణిస్తున్న గోస్వామిని పరీక్షించి కొన ఊపిరితో ఉన్న ఆమెను బ్రతికించేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. రైలులోనే మృతి చెందింది. దురంతోకు శ్రీకాకుళంలో హాల్ట్ లేకపోవడంతో మృతదేహాన్ని విజయనగరంలో దించారు. ప్రయత్నం ఫలించకపోయినా రైల్వే అధికారుల చొరవను పలువురు కొనియాడారు.

 

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top