చిల్‌..చిల్‌ గుండె ఝల్‌!


 

చలిగా వాతావరణం

అల్లాడుతున్న జనం

జాగ్రత్తలు తప్పనిసరి

 

చలిగాలులు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ అధికమవుతున్నాయి. దీనికితోడు వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు జలుబు, దగ్గు, తుమ్ములు, ఎరుపెక్కిన కళ్లతో బాధపడుతున్నారు. ఇక రకరకాల జ్వరాలు వేధిస్తున్నాయి. ఆస్తమా రోగులు మరింత ఇబ్బంది పడుతున్నారు. రైతులు పొలానికి వెళ్తూ చలి దెబ్బకు అనారోగ్యానికి గురవుతున్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ  చలి వణికిస్తోంది. ఈనేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోకుంటే వ్యాధులు ముదిరిపోయే అవకాశం ఉంది. 

ఇలా చేయాలి

ళీ తెల్లవారు జామున, రాత్రివేళ బయట తిరగకూడదు.

ళీ ప్రతి రోజూ తలస్నానం చేయకపోవడం మంచిది. 

ళీ ధూమపానానికి దూరంగా ఉండాలి. దీనివల్ల వైరస్‌లు దాడి చేస్తాయి. బలహీనపడి ఉబ్బస వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. 

ళీ చలిగాలి నేరుగా శరీరానికి తగలకుండా చూసుకోవాలి. 

ళీ ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు హెల్మెట్‌ను ధరిస్తే మంచిది.

ళీ బయటకు వెళ్లే సమయంలో శరీరం అంతా కప్పేసేలా దుస్తులు ధరించాలి.

ళీ చలికాలంలో ఆకలి తక్కువగా ఉంటుంది. ఆహారాన్ని మితంగా  తీసుకోవాలి. పండ్లు తీసుకోవడం ఎంతో మేలు.

ళీ చలికాలంలో వ్యాయామాన్ని విడిచిపెట్టకుండా ఇంట్లోనే  20 నిమిషాల పాటు  చేయాలి. 

ళీ చర్మం పొడిబారకుడా.. స్నానానికి ముందు తైలం(కొబ్బరినూనె)తో మర్దన చేసుకోవాలి.

ళీ చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు జ్వరం, గొంతునొప్పి, కఫం ఎక్కువగా రావడం వంటి వ్యాధులకు గురవుతారు. వీరు చలి ఉన్న సమయంలో బయట తిరగకూడదు.

ళీ ఆస్తమా ఉన్నవారు ఉదయం 8గంటల తర్వాత బయటకు రావాలి. లేకుంటే క్రానిక్‌ సమస్యలు, న్యూమోనియా వచ్చే ప్రమాదముంది.  

ళీ బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలి.

ఆహార నియమాలు పాటించాలి

చలికాలంలో ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. చలికాలంలో  శరీరంలో అన్ని భాగాలు చలితో ఉండి వ్యాధి నిరోధకశక్తి కోల్పోతాయి. ఈసమయంలో శరకీరం ఉష్ణోగ్రతలు సమతూకం పాటించాలి. ప్రధానంగా కోడిగుడ్డు, చపాతీలు, క్యాలిఫ్లవర్, బాదంపప్పు, క్యాబేజీ, పాలకూర, పీచుపదార్థాలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవాలి. పిల్లలకు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. క్యాబేజీ తినడం వలన శరీరంపై ఉండే మొటిమలు రాకుండా, పొడిబారకుండా ఉంటుంది. శరీర ఉష్ణోగత్రలు కాపాడేలా ఆహార నియమాలు పాటించాలి. సూర్యోదయం అయ్యేంతవరకు, సాయంత్రం 6–30 గంటల తర్వాత బయటకు వెళ్లకూడదు. ద్విచక్రవాహనాలపై ప్రయాణించరాదు. వేడి పదార్థాలు తీసుకోవాలి.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top