మండల సర్వసభ్యసమావేశాన్ని వాకౌట్‌ చేసిన ఎంపీటీసీలు

మండల సర్వసభ్యసమావేశాన్ని వాకౌట్‌ చేసిన ఎంపీటీసీలు


కోదాడరూరల్‌ : గ్రామాల అభివద్ధికి తమ కోటా కింద ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ అన్ని పార్టీల ఎంపీటీసీలు శనివారం జరగాల్సిన మండల సర్వసభ్యసమావేశాన్ని వాకౌట్‌ చేశారు. కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దీంతో సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ కనీస నిధులు కేటాయించక పోగా జనరల్‌ నిధులన్నింటినీ సర్పంచ్‌లకే కేటాయిస్తున్నారని వాపోయారు. నిధులు లేక గ్రామాల్లో తిరగలేని పరస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తమకు  ప్రకటించిన రూ.5 వేల వేతనం కూడా అందడంలేదని... ఇప్పటికైనా నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మందలపు శేషు, ఎంపీటీసీల నియోజకవర్గ అధ్యక్షులు కొండపల్లి వాసు, నెల్లూరి వీరభద్రరావు, బాణోతు ప్రసాద్, బత్తుల వెంకన్న, పాముల మైసయ్య,  అప్జల్, కొచెచ్చర్ల రమేష్, తూమాటి పుష్పావతి, ఇర్ల అన్నపూర్ణ, వీదమణి, మరియమ్మ, వెంకట్రావమ్మ , భవాని, భాగ్యమ్మ, తిప్పని రమ, కోఅప్షన్‌ సభ్యులు ఎండి.రఫి ఉన్నారు.

సమావేశానికి హాజరు కాని అధికారులు.....

ప్రజా సమస్యలపై మూడు నెలలకోసారి జరిగే మండల సమావేశానికి 16 శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉండగా సగం శాఖల అధికారులు హాజరు కాలేదు. వారం రోజుల క్రితమే సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులంతా హాజరు కాకపోవడంపై ఎంపీపీ, ఎంపీడీఓలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీపీ తెలిపారు. ఆర్టీసీ, ఐబీ, ఐకేపీ, ఎకై ్సజ్, గహ, సోషల్‌ వెల్ఫేర్, ఉపాధిహామీ శాఖల అధికారులు హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డేగరాణి, డీసీసీబీ చైర్మన్‌ పాండురంగారావు, తహసీల్దార్‌ వి.శ్రీదేవి, ఎంపీడీఓ ప్రేమ్‌కరుణ్‌రెడ్డి, పీఆర్‌ ఏఈ లక్ష్మారెడ్డి, ఎలక్ట్రికల్‌ రూరల్‌ ఏఈ మల్లెల శ్రీనివాసరావు, సీడీపీఓ కష్ణకుమారి, సూపరింటెండెంట్‌ సుగుణకుమార్, ఈఓఆర్డీ సాంబిరెడ్డి, డేగబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top