భోగి భాగ్యాలు!

భోగి భాగ్యాలు! - Sakshi


జిల్లాలో ఆరంభమైన సంక్రాంతి సందడి

పట్టణాల్లోనూ ఉట్టిపడుతున్న పల్లె వాతావరణం




సిరి సంపదలిచ్చి.. సంతోషాలను కలబోసిన తెలుగు సంప్రదాయ పండుగ సంక్రాంతి సందడి ఆరంభమైంది. జిల్లాలో తొలిరోజు ప్రతి ఇంటి ముందు భోగి దివ్వెలతో సంబరాల సంక్రాంతికి సాదరంగా స్వాగతం పలికారు. అహం కాలిపోయి, ఆత్మశుద్ధి కావాలని, చలి ఆగిపోయి ఆనందం వెల్లివిరియాలని కోరుతూ ప్రజలు శుక్రవారం వేకువజామున భోగి మంటలు వేశారు.



యువకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. విద్యా సంస్థలు, అపార్ట్‌మెంట్స్‌ వద్ద సామూహికంగా భోగి మంటలువేసి సంబరాలు చేసుకున్నారు. గొబ్బి పాటలు పాడుతూ..రంగవల్లులు వేస్తూ ఆడపడుచులు ఆకట్టుకున్నారు. గంగిరెద్దుల ఆటలతో సందడి నెలకొంది. – తిరుపతి కల్చరల్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top