ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ

ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ - Sakshi

సీతానగరం (రాజానగరం) :

ఓటర్లుగా నమోదు చేసుకోవడం నిరంతర ప్రక్రియని జాయింట్‌ కలెక్టర్‌ టు, నియోజకవర్గ ఓటర్లు నమోదు అధికారి జే రాధాకృష్ణమూర్తి తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచదేశాలు మనవైపు చూస్తున్నాయని, 20 నుంచి 35 ఏళ్ల యువకులు మన దేశంలో 30 శాతానికి పైగా ఉన్నారని, దేశాభివృద్ధి యువకుల సారధ్యంలోనే సాధ్యమన్నారు. ఫారమ్‌ 6ను నింపి, రెండు ఫొటోలు, ఆధార్, రేష¯ŒSకార్డు, టె¯ŒS్తక్లాస్‌ సర్టిఫికెట్‌ జిరాక్స్‌ అందించి, ఓటరుగా నమోదు కావాలన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండలంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఆయా పోలింగ్‌ స్టేష¯ŒSల వద్ద బూత్‌లెవెల్‌ ఆఫీసర్లకు నేరుగా ఫారమ్‌ 6 అందించవచ్చని తెలిపారు. ఓటుహక్కును వినియోగించుకునే సమయంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగరాదన్నారు. ఓటుహక్కు వినియోగించుకునే విధానంపై గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తమ ఓటుహక్కు ఎంత పవిత్రమైనదో అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని పి.ప్రసన్న అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ చదువుకోనివారు తమ ఆధార్, రేష¯ŒSకార్డులలోని వయసును పరిగణలోకి తీసుకుని ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 99.9శాతం రేష¯ŒSకార్డులు, 95శాతం నుంచి 98 శాతం మంది ఆధార్‌ తీసుకున్నవారు ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఓటుహక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని జేసీ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ గోపాలకృష్ణ మాట్లాడుతూ కళాశాలలో బాలురకు రెండు మరుగుదొడ్లు నెలకొల్పాలని కోరగా, దానికి జేసీ–2 రాధాకృష్ణ సానుకూలంగా స్పందించారు. రాజానగరం నియోజకవర్గం ఎన్నికల డీటీ సత్యనారాయణ, సీతానగరం డిప్యూటీ తహసీల్దార్‌ రామారావు, ఆర్‌ఐ సుధాకర్, ఎంఈవో టి.ముత్యాలు, ఏఎస్‌వో భగవా¯ŒSదాస్‌ పాల్గొన్నారు

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top