భీమడోలులో విజిలెన్స్‌ దాడులు


 

భీమడోలు : భీమడోలులోని ఓ జనరల్‌ స్టోర్స్‌లో ని బంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన బియ్యం, నిత్యావసర సరుకులు 93.50 క్వింటాళ్ల నిల్వలు ఉండటాన్ని గుర్తించిన వి జిలెన్స్‌ అధికారులు శని వారం కేసు నమోదు చేశా రు. విజిలెన్స్‌ తహసీల్దార్‌ శైలజ ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేశ్వరరావు భీమడోలు గణపతి సెంటర్‌లోని జనరల్‌ స్టోర్స్, గోడౌన్‌ను తనిఖీలు చేశారు. స్టోర్స్‌ యాజమాని ముత్తా వెంకటేశ్వరరావు ఎటువంటి లైసెన్సు లేకుండా అక్రమంగా సరుకులను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. రూ.2,02,500 విలువ గల సరుకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 72 క్వింటాళ్ల బియ్యం, 20 క్వింటాళ్ల పంచదార, 50 కిలోల మినపప్పు, 50 కిలోల కందిపప్పు, 50 కిలోల పచ్చిశనగపప్పును సీజ్‌ చేశారు. సరుకులను భీమడోలు సీఎస్‌డీటీ జయశ్రీకి అప్పగించారు.  

జీడిపప్పు పరిశ్రమపై దాడి

దేవరపల్లి: దేవరపల్లిలో జీడిపప్పు పరిశ్రమపై శనివారం సాయంత్రం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌పోర్సుమెంట్‌ అధికారులు దాడులు చేశారు. దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని సుతాపల్లి నాగరాజుకు చెందిన  వీరవెంకట లక్ష్మీకాంతం ట్రేడర్స్‌ జీడిపప్పు ఫ్యాక్టరీలో అనుమతులు లేకుండా పప్పు ల మిల్లు పెట్టి మినపప్పు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పప్పుల మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 13 బస్తాల మినపప్పు, 27 బస్తాల మినుములను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.26 లక్షలు ఉంటుందని విజిలెన్స్‌ అధికారులు తెలి పారు. కేసు నమోదు చేసి సరుకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top