ఫెర్టిలైజర్ షాపులపై విజిలెన్స్ దాడులు

ఫెర్టిలైజర్ షాపులపై విజిలెన్స్ దాడులు - Sakshi


ఒక షాపుపై 6ఏ కేసు నమోదు

రూ.21.1 లక్షల బయో అమ్మకాలు నిలిపివేత


 

 చీరాల టౌన్ : చీరాల పట్టణం, మండలంలో ఉన్న ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై మంగళవారం ఒంగోలు విజిలెన్స్ డీఎస్పీ ఈ.సుప్రజ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకువిజిలెన్స్, వ్యవసాయశాఖ సహకారంతో నిర్వహించిన ఈ దాడుల్లో పలు లోపాలను గుర్తించామని డీఎస్పీ తెలిపారు. పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర, సుభాషిణి, అన్నపూర్ణ, ఆర్‌కే, బాలాజీ, వెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాపుల్లో విజిలెన్‌‌స, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అనుమతి పత్రాలు, స్టాక్ రిజిస్టర్లు, ’ఓ’ ఫారం తదితర లావాదేవీలను పరిశీలించారు.


పట్టణంలోని బాలాజీ ఫెర్టిలైజర్ దుకాణంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.21.1 లక్షల విలువ కలిగిన బయో ఉత్పత్తులు కలిగి ఉండటంతో పాటు వీటి అమ్మకాలను నిలిపివేయడంతో, వాటిని అమ్మకూడదని దుకాణదారుడిని హెచ్చరించారు. అలానే ఆర్‌కే ఫెర్టిలైజర్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు కలిగి ఉండటంతో షాపు నిర్వాహకుడిపై 6 ఏ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్‌‌స డీఎస్పీ సుప్రజ విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున సర్టిఫైడ్ కంపెనీకి చెందిన ఎరువులు, పురుగు మందులే విక్రరుుంచి రైతులకు అన్ని రకాల బిల్లులు ఇవ్వాలన్నారు. అరుుతే, కొందరు పురుగు మందుల విక్రయదారులు నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకుండా బయో ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్నారని తమ పరిశీలనలో తేలిందన్నారు.


నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న స్టాక్‌ను సీజ్ చేయడంతో పాటు అమ్మకందార్లపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయశాఖ ఏడీఏ కె.రాజకుమారి, ఏవో ఫాతిమాబేగం, విజిలెన్‌‌స సీఐ నాయక్, ఎస్‌సై సాంబయ్య, డీసీటీవో నవీన్, ఎఫ్‌ఆర్‌వో బాబు, వీఆర్వోలు శివారెడ్డి, రాంబాబు ఉన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top