ఇద్దరు అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్‌

ఇద్దరు అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్‌

భీమవరం టౌన్‌ : భీమవరం వన్‌టౌన్‌లో వరుస దొంగతనాలకు çపాల్పడిన ఇద్దరు అంతర్‌ జిల్లా నేరస్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వన్‌టౌన్‌ పోలీసు సిబ్బందితో కలిసి నర్సాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు  విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. 

 విశాఖపట్నం గాజువాక సింహపురి కాలనీకి చెందిన వారే బూలా నాగసాయి, కొత్తగాజువాక కణతిరోడ్డుకు చెందిన మహమ్మద్‌ సోను అలియాస్‌ రఫి పాతనేరస్తులు. వీరిద్దరికీ జైలులో పరిచయమైంది. నాగసాయి 16 ఏళ్ల వయసు నుంచి నేరాలు చేస్తున్నాడు. గతంలో అరెస్టయిన అతను ఈ ఏడాది మార్చి 22న విశాఖ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు.  సోను 2014 నుంచి నేరాల బాటపట్టాడు. వృత్తిరీత్యా పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. సోను 20 నేరాల్లో జైలు శిక్ష అనుభవించి ఈ ఏడాది మేనెల మొదటి వారంలో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత నాగసాయి,lసోను కలసి విశాఖ, యలమంచిలి, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, తణుకు, అత్తిలి, పాలకోడేరు ప్రాంతాల్లో 23 నేరాలు చేశారు. ఈ ఇద్దరినీ భీమవరం జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సోమవారం వన్‌టౌన్‌ సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ కె.సుధాకరరెడ్డి అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.7 లక్షల విలువైన పన్నెండున్నర కేజీల వెండి, ఆరున్నరకాసుల బంగారు వస్తువులు, రెండు ఎల్‌ఈడీlటీవీలు, ఒక డీవీడీ ప్లేయర్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

చిక్కిన మరో ఇద్దరు దొంగలు 

భీమవరం టూటౌన్‌ పరిధిలో రెండు చోరీ కేసుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేసి రూ.10 లక్షల విలువైన 47.5 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు చెప్పారు. ఆయన టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు.. టూటౌన్‌ సీఐ ఎం.రమేష్‌బాబు నిందితుల కదలికలపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో ఆచంట మండలం పెనుమంచిలి గ్రామం వెళ్లారు. అక్కడ నార్గాని గోపాలకృష్ణ, ఓ  మహిళ పారిపోయేందుకు యత్నిస్తుండగా, పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. గోపాలకృష్ణను  ప్రశ్నించగా.. 2016 మార్చిలో భీమవరం టూటౌన్‌ అడ్డవంతెన సమీపంలోని సూర్యనారాయణపురం వీధిలో ఒక ఇంట్లో శీల అనిల్‌కుమార్‌తో కలిసి 30.5 కాసుల బంగారం చోరీ చేసినట్లు అంగీకరించాడు. తన వాటా 19.5 కాసులు విక్రయించేందుకు గోపాలకృష్ణ పాలకొల్లు బయల్దేరి వెళ్తుండగా, పోలీసులు పట్టుకున్నారు.  అనిల్‌కుమార్‌  గురించి ప్రశ్నించగా.. తనతోపాటు ఉన్న మహిళ అనిల్‌ తల్లి రమణి అని, ఆమె కూడా బంగారం అమ్మేందుకు తన వద్దకు వచ్చిందని గోపాలకృష్ణ చెప్పాడు. దీంతో పోలీసులు ఆమె వద్ద ఉన్న ఎనిమిది కాసుల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2013 ఆగస్టులో భీమవరం ఏఎస్‌ఆర్‌ నగర్‌లో చేసిన నేరాన్ని కూడా గోపాలకృష్ణ అంగీకరించాడని దానికి సంబంధించి 20 కాసుల బంగార ం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.  అనిల్‌కుమార్‌ పరారీలో ఉన్నాడని అతని తల్లి రమణితోపాటు గోపాలకృష్ణను అరెస్ట్‌ చేశామని చెప్పారు. టూటౌన్‌ సీఐ ఎం.రమేష్‌బాబు, ఎస్సైలను డీఎస్పీ పూర్ణచంద్రరావు అభినందించారు. కేసుల్లో సహకరించిన ఐడీ పార్టీ సిబ్బంది కె.వి.వి.సూర్యనారాయణ, జి.హెచ్‌.హెచ్‌.వెంకటేష్, వై శ్రీనివాస్, ఎం.బాబూరావులకు రివార్డులు ఇస్తామని ప్రకటించారు.

 

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top